QuotesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/quotes/131/dhanam-12164a42-74bc-4354-aa51-498a196cb81f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/quotes/131/dhanam-12164a42-74bc-4354-aa51-498a196cb81f-415x250-IndiaHerald.jpgసాధారణంగా మన పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు.. ఫలానా సమయాల్లో, ఫలానా సందర్భాలలో మన ఇంటి నుంచి కొన్ని వస్తువులను ఇతరులకు దానంగా ఇవ్వకూడదని, ఒకవేళ అలా ఇచ్చిన తరుణంలో మన ఇంట్లో లక్ష్మీదేవి నిలబడటం చాలా కష్టం అని అంటారు మన పెద్దవాళ్ళు. అంతేకాదు ఈ వస్తువులను ఇవ్వడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి నిలవడం అస్సలు జరగదు అట. అయితే ఆ వస్తువులు ఏవేవో ఇప్పుడు ఇక్కడ ఒకసారి చదివి తెలుసుకుందాం..DHANAM {#}oil;Wife;courtమంచిమాట : ఇతరులకు దానం చేయకూడని వస్తువులు ఏంటో తెలుసా..మంచిమాట : ఇతరులకు దానం చేయకూడని వస్తువులు ఏంటో తెలుసా..DHANAM {#}oil;Wife;courtThu, 22 Jul 2021 14:00:00 GMTసాధారణంగా మన పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు.. ఫలానా  సమయాల్లో,  ఫలానా సందర్భాలలో మన ఇంటి నుంచి కొన్ని వస్తువులను ఇతరులకు దానంగా ఇవ్వకూడదని,  ఒకవేళ అలా ఇచ్చిన తరుణంలో మన ఇంట్లో లక్ష్మీదేవి నిలబడటం చాలా కష్టం అని అంటారు మన పెద్దవాళ్ళు. అంతేకాదు ఈ వస్తువులను ఇవ్వడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి నిలవడం అస్సలు జరగదు అట. అయితే ఆ వస్తువులు ఏవేవో ఇప్పుడు ఇక్కడ ఒకసారి చదివి తెలుసుకుందాం..


1.పరక :
వీటిని మన ఇంటికి వచ్చిన బంధువులకు కానీ లేదా ఇతరులకు కానీ ఈ పరకలను దానం చేయకూడదు. ఇలా దానం చేయడం వల్ల ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని కూడా ఊడ్చి ఇచ్చినట్లు అని పండితులు చెబుతున్నారు. అందుకే ఇతరులకు ఈ పరకలను దానంగా ఇవ్వకూడదు.

2. కొబ్బరి నూనె:
కొబ్బరి నూనెను కూడా మన ఇంటికి వచ్చిన బంధువులకు ఇవ్వకూడదు. ఇక  ఇరుగింటి, పొరుగింటి వాళ్లకు కూడా కొబ్బరి నూనె దానంగా ఇవ్వకూడదు. ముఖ్యంగా మన ఇంటికి వచ్చిన బంధువులకు మన చేతులతో వారి జుట్టుకు కొబ్బరి నూనెను రాయడం వంటి పని అసలు చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ధనలక్ష్మి ఉండదట.

3. పదునైన వస్తువులు:
కత్తులు , కటార్లు వంటి పదునైన వస్తువులను ఇతరులకు దానంగా ఇవ్వకూడదు.ఇలా  ఇచ్చిన ఎడల వారిని దురదృష్టం చుట్టుముడుతుంది. భార్య భర్తల మధ్య గొడవలు పెరగడం, ఒక్కోసారి చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

4. చెడిపోయిన ఆహారం:
పాచిపోయిన లేదా చెడిపోయిన ఆహారాన్ని ఇతరులకు దానంగా ఇవ్వరాదు. ఇలా ఇచ్చిన ఎడల కోర్టు వ్యవహారాల్లో చిక్కుకోవడం లేదా చేతిలో ఉన్న డబ్బు మొత్తం మనకు తెలియకుండానే ఖర్చు అయిపోవడం లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

5. పగిలిన వస్తువులు, చిరిగిన దుస్తులు :
సాధారణంగా మన ఇంట్లో వుండే పగిలి పోయిన వస్తువులు గాని చిరిగిన దుస్తులను గాని ఇతరులకు దానంగా ఇవ్వకూడదు ఇలా చేయడం వల్ల దరిద్రం వస్తుంది. కాబట్టి ఇలాంటి వస్తువులను ఇతరులకు దానంగా ఇవ్వకుండా జాగ్రత్తపడండి.



ప్రియమణి పెళ్లి చెల్లదు.. ముస్తఫా రాజ్ మొదటి భార్య.. !

హుజూరాబాద్ లో గెలవకపోతే ఈటెల పరిస్థితి ఏంటీ...?

క్యాలీఫ్లవర్ అండ్ బీన్స్ కర్రీ మీకోసం.. !

53 ఏళ్ల కింద కేసు...కోర్టు తీర్పు వచ్చేలోగా దారుణం ?

నటి కస్తూరి భర్త కూడా మనకు తెలిసిన నటుడే

భర్త వీర్యం కోసం కోర్ట్ కి ఎక్కిన మహిళ

హుజూరాబాద్ బరిలో కెటిఆర్ ప్రత్యర్థి?

రాజ్ కుంద్రాకు పడే శిక్ష ఏంటంటే ?

అక్క‌డ టిక్‌టాక్ మ‌ళ్లీ బ్యాన్‌.. ఆ విడియోలే కార‌ణం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>