PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/fight-for-right-ycp-vs-tdp-8f89ee82-2aa6-488f-9707-6fb05124c5cc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/fight-for-right-ycp-vs-tdp-8f89ee82-2aa6-488f-9707-6fb05124c5cc-415x250-IndiaHerald.jpgఒక విన‌తి ప‌త్రం ఇస్తామంటే ఒప్పుకోరు ఒక ధ‌ర్నా చేస్తాం అంటే ఒప్పుకోరు.. నిర‌స‌న‌లూ ధ‌ర్నాలూ లేకుండా ఆ రోజు విప‌క్షంలో వైఎస్సార్సీపీ ఉందా అన్న‌ది ప్ర‌శ్న.. జ‌న‌సేన‌నూ టీడీపీనీ అదే ప‌నిగా అడ్డుకోవ‌డంలో వైసీపీ స‌క్సెస్ అయితే కావొచ్చు.. కానీ అదే అంతిమ విజ‌యం కాదు అన్న‌ది గ్ర‌హించ‌గ‌ల‌గాలి. కానీ ప్ర‌స్తుత వాతావ‌ర‌ణం అలా లేదు. రాష్ట్రంలో ఎక్క‌డ ఏ నిర‌స‌న‌కూ తావివ్వ‌కుండా త‌మదే రాజ్యం అన్న విధంగా ఎక్క‌డిక‌క్క‌డ హౌస్ అరెస్టుల‌కు పాల్ప‌డ‌డం విచార‌క‌రం. మొన్న‌టి వేళ జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేసిన వైఎస్సాtdp {#}TDP;House;job;police;YCP;CM;Teluguఫైట్ ఫ‌ర్ రైట్ : జ‌గ‌న్ స‌ర్ త‌ప్పు చేస్తున్నారు??? మీరుఫైట్ ఫ‌ర్ రైట్ : జ‌గ‌న్ స‌ర్ త‌ప్పు చేస్తున్నారు??? మీరుtdp {#}TDP;House;job;police;YCP;CM;TeluguThu, 22 Jul 2021 17:07:00 GMT
ప్ర‌జా స్వామ్యంలో అంతా ఉండాలి
 
విప‌క్షం రోడ్డెక్కితే క‌నీసం మాట్లాడే అవ‌కాశం ఇవ్వాలి

 
ధ‌ర్నాలూ రాస్తారోకోలూ వ‌ద్దంటూ జ‌న‌సేన‌ను అడ్డుకుంటే

 
టీడీపీని ఎక్క‌డికక్క‌డ నిలువరిస్తే వ్య‌తిరేక స్వ‌రం పెరిగిపోవ‌డం ఖాయం


 

నిరంకుశత్వం అధికారంలో ఉంది.. లేదా అధికార పార్టీలో ఉంది అన్న‌ది ఇవాళ విప‌క్షాల గోడు... ఇటీవ‌ల తాడేప‌ల్లిలో సీఎం ఇంటి ముట్ట‌డిని పోలీసులు అడ్డుకుని మ‌రో మారు విప‌క్షాలను అడ్డుకోవ‌డంలో స‌ఫ‌లీకృతం అయ్యారు. ఆ రోజు చాలా మంది టీడీపీ నాయ‌కులు గృహ నిర్బంధాల‌కు లోన‌యిన‌ప్ప‌టికీ  కొంద‌రు మాత్రం చాక‌చ‌క్యంగా త‌ప్పించుకుని త‌మ నిర‌స‌న‌కు ఓ రూపం ఇవ్వ‌గ‌లిగారు. ముఖ్యంగా తెలుగు యువ‌త ఈ విష‌య‌మై విజ‌య‌వంతం అయింద‌నే చెప్పాలి. ఇటీవ‌ల వ‌చ్చిన కొత్త నాయ‌క‌త్వా ల కృషి ఫ‌లించిన మేర‌కు ఈ నిర‌స‌న కాస్త‌యినా  అనుకున్న విధంగా జ‌రిగింద‌నే అంగీక‌రించాలి..  ప‌ద‌వులు వాటి అధికారాలు శాశ్వ‌తం కాకున్నా మాట్లాడే అవ‌కాశం ఇవ్వ‌క‌పోవ‌డం, ఎక్క‌డిక‌క్క‌డ పోలీసుల‌తో అడ్డుకోవ‌డం వ‌ల‌న ప‌రువు పోయేది జ‌గ‌న్ ప్ర‌భుత్వానిదే అని, అలా కాకుండా త‌మ విన్న‌పాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని నిరుద్యోగుల‌కు న్యాయం చేయాల‌న్న‌దే త‌మ అభిమతం అన్న‌ది క‌మ్యూనిస్టుల మాట.


 
 
నిర‌స‌న ప్ర‌జాస్వామ్య దేశంలో ప్ర‌ధాన హ‌క్కు.. హ‌క్కుల కోసం గొంతెత్త‌డం న్యాయం. రెండు ల‌క్ష‌ల‌కు  పైగా ఉద్యోగాలు అంటూ మీరు ఆ రోజు  ఊద‌ర‌గొట్టారు ఇవాళ క‌నీసం మేం ఎంప్లాయ్మెంట్ కార్యాల‌యాల‌కు పోయి విన‌తులు ఇస్తామంటే త‌ట్టుకోలేక‌పోతు న్నారు.. నిరుద్యోగం క‌న్నా రాజ‌కీయ నిరుద్యోగం మిమ్మ‌ల్ని బాధ‌పెడ్తుంటే నేనేం చేయ‌ను.. అంటూ జ‌నసేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆవేద‌న చెందారు. ఇటీవ‌ల విజ‌య‌న‌గ‌రం లో తెలుగు యువ‌త అధ్య‌క్షులు వేమ‌లి చైత‌న్య బాబూది ఇదే ఆవేద‌న. తాను నిర‌స‌న కోసం రాష్ట్ర రాజ‌ధానికి వెళ్తుంటే ముంద‌స్తు స‌మాచారం అందుకుని అరెస్టు చేశార‌ని, త‌న‌తో పాటు ఇంకొంద‌రినీ అదుపులో తీసుకుని పోలీసులు జులుం చూపార‌ని ఆయ‌న వాపోయారు. ఆ రోజు ఇదే రీతిన చంద్ర‌బాబు స‌ర్కార్ ఉంటే జ‌గ‌న్
పాద‌యాత్ర చేసేవారా అన్న‌ది కూడా ఆయ‌న వినిపిస్తున్న వాద‌న.





ఒక విన‌తి ప‌త్రం ఇస్తామంటే ఒప్పుకోరు ఒక ధ‌ర్నా చేస్తాం అంటే ఒప్పుకోరు.. నిర‌స‌న‌లూ ధ‌ర్నాలూ లేకుండా ఆ రోజు విప‌క్షంలో వైఎస్సార్సీపీ ఉందా అన్న‌ది ప్ర‌శ్న.. జ‌న‌సేన‌నూ టీడీపీనీ అదే ప‌నిగా అడ్డుకోవ‌డంలో వైసీపీ స‌క్సెస్ అయితే కావొచ్చు.. కానీ అదే అంతిమ విజ‌యం కాదు అన్న‌ది గ్ర‌హించ‌గ‌ల‌గాలి. కానీ ప్ర‌స్తుత వాతావ‌ర‌ణం అలా లేదు. రాష్ట్రంలో ఎక్క‌డ ఏ నిర‌స‌న‌కూ తావివ్వ‌కుండా త‌మదే రాజ్యం అన్న విధంగా ఎక్క‌డిక‌క్క‌డ హౌస్ అరెస్టుల‌కు పాల్ప‌డ‌డం విచార‌క‌రం.  మొన్న‌టి వేళ జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేసిన వైఎస్సార్సీపీ స‌ర్కారు ఇచ్చిన మాట త‌ప్పింద‌ని, రెండున్న‌ర ల‌క్ష‌ల ఉద్యోగాల క‌ల్ప‌నే ధ్యేయ‌మ‌ని అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ ఇచ్చిన మాట త‌ప్ప‌డమే కాదు నిర‌స‌న గ‌ళాలు అన్న‌వి వినిపించ‌కుండా చేస్తున్నార‌న్న‌ది విప‌క్షాల మండిపాటు. ఆగ్ర‌హం కూడా...





రాజ్ కుంద్రా అసలు ఎలా పట్టుబడ్డాడంటే ?

అరవ స్టార్ ని మనవాళ్ళు వదలడం లేదేంటి..?

వామ్మో అక్కడ వరుసగా పిల్లుల మరణం.. ఎందుకంటే..?

రామ్‌రాజ్ కాట‌న్‌లో "తెలుగు" గొడ‌వ‌?

ఎంపీల పోరాటం రఘురామకు నచ్చేసిందిగా...?

ఓటీటీ వల్ల బ్రతికిపోతున్న సందీప్ కిషన్!!

కోర్టులో సినిమా డైలాగ్ తో రెచ్చిపోయిన వ్యక్తి

క‌లెక్ట‌ర్లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి.. సీఎం జ‌గ‌న్ ఆదేశాలు.. !

పొద్దున్నే పరిచయం.. సాయంత్రం పెళ్లి.. ఈ నటి గట్స్ వేరే లెవల్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>