TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/mobile-display-broken9d7529da-bff2-4c53-8cca-51f945d75589-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/mobile-display-broken9d7529da-bff2-4c53-8cca-51f945d75589-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో పేద,ధనిక అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న ఏకైక వస్తువు ఏదంటే స్మార్ట్ ఫోన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే అంతలా మొబైల్ కి కనెక్ట్ అయిపోయాము మనం. మన చేతిలో మొబైల్ లేకుంటే ఒక నిమిషం బయట కూడా వెళ్ళలేము. అలాంటి మొబైల్ మన చేతిలో నుంచి జారి కింద పడి పగిలితే ఎంత బాధ పడతామో కదా..! MOBILE DISPLAY BROKEN{#}TECHNOLOGY;Dell;HP;Asus;Acer;electricity;Professor;Manam;Samsung;Huawei;Nokia;LG;HTC;Motorola;Redmi;Smart phone;Apple;Sonyమొబైల్ స్క్రీన్ పగిలిందా..? డోంట్ వర్రీ ..!మొబైల్ స్క్రీన్ పగిలిందా..? డోంట్ వర్రీ ..!MOBILE DISPLAY BROKEN{#}TECHNOLOGY;Dell;HP;Asus;Acer;electricity;Professor;Manam;Samsung;Huawei;Nokia;LG;HTC;Motorola;Redmi;Smart phone;Apple;SonyThu, 22 Jul 2021 14:02:05 GMT
ఇటీవల కాలంలో పేద,ధనిక అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న ఏకైక వస్తువు ఏదంటే స్మార్ట్ ఫోన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే అంతలా మొబైల్ కి కనెక్ట్ అయిపోయాము మనం. మన చేతిలో మొబైల్ లేకుంటే ఒక నిమిషం బయట కూడా వెళ్ళలేము. అలాంటి మొబైల్ మన చేతిలో నుంచి జారి కింద పడి పగిలితే ఎంత బాధ పడతామో కదా..!

కొత్త మొబైల్స్ తీసుకున్నప్పుడు, మనం ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాము. అయితే అలాంటి మొబైల్  ఒకవేళ చెయ్యి జారి పడటం, ఏదైనా కోపంలో విసరడం, వంటివి చేస్తూ ఉంటాము ఎక్కువగా. అయితే అలాంటప్పుడు మొబైల్ ఫోన్ పై ఉండే డిస్ప్లే పగిలిపోతుంది. ఇంకొకసారి ఈ డిస్ప్లే ప్యాడ్ పగిలి పోతే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. కానీ ఇప్పుడు చెప్పబోయే విషయం తెలుసుకుంటే , మనం చాలా సంబరపడి పోతాము. ఎందుకంటే భారతీయ సాంకేతిక సంస్థ శాస్త్రవేత్తలు ఒక కొత్త ఆవిష్కరణను కనుక్కున్నారు. అదేమిటంటే ,  మొబైల్ డిస్ ప్లే పగిలిపోతే ఎలా అతికించాలి అని..

IIT,IISER టెక్నాలజీ సంస్థకు సంబంధించిన పరిశోధకులు కోల్ కత్తాలో  అక్కడ సైన్స్ జర్నల్ లో మొబైల్ స్క్రీన్ పై పరిశోధనలు జరపగా.. ఆ పగిలిపోయిన మొబైల్ భాగాలను తిరిగి కలపగలిగిన ఒక స్వీయ స్వస్థత పదార్థం కనుక్కున్నారు. పరిశోధనలు చేసిన అనంతరం వారు  ఎముకలు, గాయాలు శస్త్రచికిత్స చేయడం ద్వారా ఎలా అతుక్కుంటాయో, అదేవిధంగా ఈ గాజు పదార్థాన్ని పగిలిన స్క్రీన్పై వేయడం వల్ల , ఆ స్క్రీన్ యధావిధిగా తయారవుతుందని పరిశోధనలో తేలడం జరిగింది.

ఇక ప్రొఫెసర్ డి. మల్లారెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధనలో ఈ విషయం తేలినట్టు తెలిసింది. ఈ పదార్థంతో ఏదైనా విచ్ఛిన్నం లేదా విరిగిన ఉపరితలాల వద్ద , వ్యతిరేక విద్యుత్ శక్తిని ప్రేరేపిస్తుంది తద్వారా యధాస్థితికి వస్తుందని పరిశోధనలో తేలింది. ఇకపై ఎవరూ అత్యధిక ఖర్చుతో ఈ మొబైల్ డిస్ప్లే ను  వేయించాల్సిన పనిలేదు అని పరిశోధకులు తెలిపారు.





వెంటిలేటర్‌పై బిగ్ బాస్ బ్యూటీ..?

శిల్పా శెట్టి పెట్టుకున్న ఈ వాచ్ ఖరీదెంతో తెలుసా ?

తరుణ్, ఉదయ్ కిరణ్ లతో పోల్చద్దు అంటున్న యువ హీరో..!

గూగుల్ మ్యాప్స్ సరికొత్త ఆవిష్కరణ.. ఇకపై నో వెయిటింగ్..

నాడు అన్న‌మ‌య్య సినిమా అసిస్టెంట్ కెమేరామెన్ నేడు టాప్ డైరెక్ట‌ర్ ?

కౌశిక్ రెడ్డికి షాక్.. 5.6 లక్షల జరిమానా విధించిన జిహెచ్ఎంసి..?

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్...

ఈ - సిమ్ కార్డు తీసుకోవాలి అనుకుంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి?

మెగా ఫ్యామిలీలో వార్ మొదలవనుందా !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>