PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr5dc3122e-b21a-4d27-8e8f-99b9729cde11-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr5dc3122e-b21a-4d27-8e8f-99b9729cde11-415x250-IndiaHerald.jpgఏపీ, తెలంగాణ జల వివాదంపై వైసీపీ మరోసారి వివరణ ఇచ్చింది.. కలసి కూర్చుని మాట్లాడుకునేందుకు మేం రెడీ.. కానీ... ఆ కేసీఆర్ సహకరించడం లేదు.. మేం ఏం చేసేది అంటూ నిస్సహాయత వ్యక్తం చేస్తోంది వైసీపీ. ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ నీళ్లను వాడుకోవాలని ప్రయత్నం చేయడం లేదని.. ఏపీకి కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటామని అంటున్నారు ఆ పార్టీ నాయకులు. కలిసి కూర్చుని మాట్లాడుకునేందుకు అటువైపు నుంచి సహకారం రాకపోవడం దురదృష్టకరమని.. కేసీఆర్‌తో మాట్లాడేందుకు తమకు ఎటువంటి భేషజాలు లేవని ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు ప్రభుత్వ చీఫKCR{#}CBN;KCR;srikanth;Godavari River;Jagan;GADIKOTA SRIKANTH REDDY;Telangana;Telugu;Rayalaseema;CM;Telangana Chief Minister;Aqua;YCP;Reddy;Partyకేసీఆర్ సహకరించడం లేదు.. మేమేం చేసిది చెప్పండి..?కేసీఆర్ సహకరించడం లేదు.. మేమేం చేసిది చెప్పండి..?KCR{#}CBN;KCR;srikanth;Godavari River;Jagan;GADIKOTA SRIKANTH REDDY;Telangana;Telugu;Rayalaseema;CM;Telangana Chief Minister;Aqua;YCP;Reddy;PartyThu, 22 Jul 2021 06:34:00 GMTఏపీ, తెలంగాణ జల వివాదంపై వైసీపీ మరోసారి వివరణ ఇచ్చింది.. కలసి కూర్చుని మాట్లాడుకునేందుకు మేం రెడీ.. కానీ... ఆ కేసీఆర్ సహకరించడం లేదు.. మేం ఏం చేసేది అంటూ నిస్సహాయత వ్యక్తం చేస్తోంది వైసీపీ. ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ నీళ్లను వాడుకోవాలని ప్రయత్నం చేయడం లేదని.. ఏపీకి కేటాయించిన నీటిని మాత్రమే వాడుకుంటామని  అంటున్నారు ఆ పార్టీ నాయకులు. కలిసి కూర్చుని మాట్లాడుకునేందుకు అటువైపు నుంచి సహకారం రాకపోవడం దురదృష్టకరమని..  కేసీఆర్‌తో మాట్లాడేందుకు తమకు ఎటువంటి భేషజాలు లేవని ఓపెన్ ఆఫర్ ఇస్తున్నారు ప్రభుత్వ చీఫ్ విప్  గడికోట శ్రీకాంత్ రెడ్డి.  


తెలుగు ప్రజలు అందరూ బాగుండాలనే భావనతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పని చేస్తున్నారని... ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని.. ఆయన అంటున్నారు. కేసీఆర్ తో భోజనం చేసినప్పుడు ఏం స్టాండ్ తో ఉన్నారో... నేటికీ సీఎం వైయ‌స్ జగన్ గారిది అదే స్టాండ్‌తో ఉన్నారని..  మేం వేరే రాష్ట్రాల నీళ్ళు దోచుకోవాలనుకోవడం లేద‌ని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ‌కాంత్‌రెడ్డి అంటున్నారు. ఇక చంద్రబాబు విషయానికి వస్తే.. రాయలసీమ ఎత్తిపోతలతో జగన్‌ మోహన్‌ రెడ్డికి మంచిపేరు వస్తుందనే దుర్భుద్ధితోనే చంద్రబాబు నీచ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. గెజిట్‌పై సీమ ప్రాంత ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... రాయలసీమ ప్రాజెక్ట్‌లకు సంబంధించి నీటి కేటాయింపులకు పూర్తిస్థాయిలో పోరాటం చేస్తామని శ్రీకాంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.


రాయలసీమ ప్రాజెక్టులపై గతంలో ముఖ్యమంత్రిగా వై‍యస్‌ రాజశేఖర్‌రెడ్డికి, ఈనాటడి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌కు ఉన్న చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరని... రాయలసీమ లిఫ్ట్ పై చంద్రబాబు తన వైఖరి చెప్పకుండా నానుస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఇలా తెలంగాణకు వంతపాడుతున్న చంద్రబాబు ఎప్పటికీ ఆంధ్రా ద్రోహిగానే మిగిలిపోతారని srikanth REDDY' target='_blank' title='గడికోట శ్రీకాంత్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>గడికోట శ్రీకాంత్ రెడ్డి  ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత విపక్ష నేతగా చంద్రబాబుకు ఎందుకు లేదని ప్రశ్నించారు. గతంలో కృష్ణా, గోదావరి జలాలపై రాష్ట్ర ప్రయోజనాలను ఎగువ రాష్ట్రాలకు చంద్రబాబు తాకట్టు పెట్టారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. తన హయాంలో చంద్రబాబు నాయుడు సాగునీటి ప్రాజెక్ట్‌లను నిర్లక్ష్యం చేయడం వల్లే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కుప ఈ దుస్థితి వచ్చిందని శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు.





ఏపీ, తెలంగాణ జల వివాదంపై వైసీపీ మరోసారి వివరణ ఇచ్చింది.. కలసి కూర్చుని మాట్లాడుకునేందుకు మేం రెడీ.. కానీ... ఆ కేసీఆర్ సహకరించడం లేదు.. మేం ఏం చేసేది అంటూ నిస్సహాయత వ్యక్తం చేస్తోంది వైసీపీ.

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: పెద్దిరెడ్డి సోదరుడుతో కష్టమే...!

విశాఖలో ఊహించని ట్విస్టులు...ప్లస్ లేనట్లేనా?

బాబు కోసం పవన్ త్యాగం...ఫిక్స్ అయిపోయినట్లేనా...?

రజినికి షాక్ భారీగానే ఉంటుందా? ప్రత్తిపాటికి కలిసొచ్చింది ఏంటి?

ఆ రెండు జిల్లాల్లో వైసీపీకి షాక్...లీడింగ్ మారిందా?

దాడి ఫ్యామిలీ మళ్ళీ రూట్ మారుస్తుందా?

హన్సిక ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తుందా?

బుట్ట బొమ్మకి మరో అదిరిపోయే ఛాన్స్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>