EditorialGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/no-more-in-andhrapradesh-only-having-castec5000cd0-e1d4-4779-a870-6ec1c1fc9429-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/no-more-in-andhrapradesh-only-having-castec5000cd0-e1d4-4779-a870-6ec1c1fc9429-415x250-IndiaHerald.jpgఅక్క‌డ గ‌ల్లంత‌వ‌డానికి ఏమీ మిగిలిలేదు.. అక్క‌డ పోవ‌డానికి, పారేసుకోవ‌డానికి కూడా ఏమీ లేవు.. అక్క‌డేం జ‌రుగుతుందో అక్క‌డివారికే అర్థంకావ‌డంలేదు.. అక్క‌డ ఏముంద‌ని చెబుతున్నారో అదైతే లేదు.. అక్క‌డి నుంచి ఎక్క‌డికెళ్లినా హాయిగా బ‌త‌కొచ్చ‌నే ఆశ మాత్రం అక్క‌డివారిని స‌జీవంగా ఉంచుతోంది.. అక్క‌డ ఎడారి లేదు.. కానీ ఎడారిలా అయిపోయింది.. అక్క‌డ నీటికి లోటు లేదు.. కానీ నాగ‌రిక‌త వెన‌క‌బ‌డింది.. అక్క‌డ కొనుగోలు శ‌క్తి ఎక్కువే.. కానీ కొన‌డానికి ఎవ‌రూ ముందుకు రావ‌డంలేదు.. ఇలా చెప్పుకుంటూ పోతే అక్క‌డ ఎన్నో ఉన్నtag{#}Nijam;Andhra Pradesh;KCR;Telanganaఅక్క‌డ మిగిలిందేమీ లేదు.. "కులం" ఒక్క‌టేఅక్క‌డ మిగిలిందేమీ లేదు.. "కులం" ఒక్క‌టేtag{#}Nijam;Andhra Pradesh;KCR;TelanganaThu, 22 Jul 2021 16:15:13 GMT
అక్క‌డ గ‌ల్లంత‌వ‌డానికి ఏమీ మిగిలిలేదు.. అక్క‌డ పోవ‌డానికి, పారేసుకోవ‌డానికి కూడా ఏమీ లేవు.. అక్క‌డేం జ‌రుగుతుందో అక్క‌డివారికే అర్థంకావ‌డంలేదు.. అక్క‌డ ఏముంద‌ని చెబుతున్నారో అదైతే లేదు.. అక్క‌డి నుంచి ఎక్క‌డికెళ్లినా హాయిగా బ‌త‌కొచ్చ‌నే ఆశ మాత్రం అక్క‌డివారిని స‌జీవంగా ఉంచుతోంది.. అక్క‌డ ఎడారి లేదు.. కానీ ఎడారిలా అయిపోయింది.. అక్క‌డ నీటికి లోటు లేదు.. కానీ నాగ‌రిక‌త వెన‌క‌బ‌డింది.. అక్క‌డ కొనుగోలు శ‌క్తి ఎక్కువే.. కానీ కొన‌డానికి ఎవ‌రూ ముందుకు రావ‌డంలేదు.. ఇలా చెప్పుకుంటూ పోతే అక్క‌డ ఎన్నో ఉన్నాయి. అదే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం.

చ‌ప్ప‌ట్ల‌తో మార్మోగిన టీఆర్ ఎస్ భ‌వ‌న్‌
హుజూరాబాద్ ఉప ఎన్నిక సంద‌ర్భంగా పాడి కౌశిక్‌రెడ్డిని పార్టీలో చేర్చుకునే కార్య‌క్ర‌మంలో మాట్లాడిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆంధ్రాలో ఏమీ మిగ‌ల్లేద‌ని, మొత్తం గ‌ల్లంతైంద‌ని, ఒక్క తెలంగాణ‌లోనే అభివృద్ధి ఉంద‌ని చెప్పారు. కేసీఆర్ ఈ మాట అన్న‌ప్పుడు టీఆర్ ఎస్ భ‌వ‌న్ మొత్తం చ‌ప్ప‌ట్ల‌తో మార్మోగింది. ఆంధ్రాలో అంతా గ‌ల్లంతే అన్న‌దానికి వ‌చ్చిన స్పంద‌న అది. తెలంగాణ అభివృద్ధి ప‌థంలో ప‌య‌నిస్తోంది అన్న‌ప్పుడు కూడా ఆ స్పంద‌న రాలేదు. ఒక వ్యాపార‌వేత్త‌కు మ‌రో వ్యాపార‌వేత్త పోటీగా ఉన్న‌ప్పుడు.. కాల‌క్ర‌మంలో ఒక వ్యాపార‌వేత్త దివాలా తీస్తే ఎదుటి వ్యాపారి ఎంత ఆనందంతో ఉంటారో కేసీఆర్ కూడా అదే త‌ర‌హా ఉత్సాహాన్ని క‌న‌ప‌రుస్తున్నారు. ఆయ‌న ఈ మాట‌ల‌న్న త‌ర్వాత సామాజిక మాధ్య‌మాల్లో పెద్ద ఎత్తున నెటిజ‌న్లు ట్రోలింగ్ ప్రారంభించారు.

ఏపీకి వ్య‌తిరేకంగా నెటిజ‌న్ల ట్రోలింగ్‌
ఆ ట్రోలింగ్ కేసీఆర్ కు వ్య‌తిరేకంగా కాదు.. ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా. రాష్ట్రంలో పరిస్థితి ఇంత దారుణంగా త‌యారైంద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నా ఏపీ సర్కార్ కనీసం స్పంద‌న లేకుండా ఉంది. కేసీఆర్ అన్న‌మాట‌ల్లో నిజం కూడా ఉంది. ఎందుకంటే తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి అంద‌రూ ముందుకు వ‌స్తున్నారుకానీ ఏపీలో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి మాత్రం ఎవ‌రూ ముందుకు రావ‌డంలేదు. ప్ర‌జ‌ల ఆస్తుల విలువ‌ను పెంచ‌డం, వారిని అభివృద్ధి చేయ‌డంపై ప్ర‌భుత్వం దృష్టిసారించి విజ‌య‌వంత‌మైంది. ప్ర‌భుత్వం కూడా ఆ విజ‌న్‌తోనే ముందుకు వెళుతోంది. కానీ ఏపీలో మాత్రం దివాలా ఆలోచ‌న‌ల‌తో ప్ర‌జ‌ల ఖాతాల్లోకి డ‌బ్బులు మ‌ళ్లించ‌డంద్వారా ఇంట్లో కూర్చొని ప‌రిపాల‌న చేస్తూ ప్ర‌జ‌ల‌ను అష్ట‌కష్టాల‌పాల్జేస్తోంది. ఏపీలోని ప్ర‌జ‌లకు కూడా కుల‌మే ముఖ్యం. ఆ కులం గుజ్జు బుర్ర‌లో నిండుగా ఉన్నంత‌కాలం ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న‌రీతిలో ఏపీ అభివృద్ధి ఉంటుంద‌నే మాత్రం సుస్ప‌ష్టం.





విక్ట‌రీ వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా విశ్వ‌రూపం చూపించిన చిత్రం నారప్ప. ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుద‌ల‌ చేయడం ద్వారా నిర్మాతలకు రూ.17 కోట్ల లాభం వచ్చింద‌ని ప‌రిశ్ర‌మ‌వ‌ర్గాలు చెబుతున్నాయి. అభిమానులు, ఎగ్జిబిట‌ర్ల కోరిక మేర‌కే ఒకవేళ ‘నారప్ప’ ధియేటర్లలో విడుద‌లై ఉంటే ఇప్పుడు వ‌చ్చిన లాభం కంటే ఎక్కువ‌గా మ‌రో రూ.10 కోట్లు వ‌చ్చివుండేవ‌ని అంటున్నారు. ఈ సినిమాకు ప్రేక్ష‌కుల నుంచి మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. అంతే కాకుండా స‌మీక్ష‌లు కూడా వ్య‌తిరేకంగానే వ‌చ్చాయి. అయినా ఇది మాస్ సినిమా కావ‌డం, వెంక‌టేష్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుంటే నిర్మాత‌లు మ‌రో రూ.10 కోట్లు పోగొట్టుకున్నారంటున్నారు.

ధియేట‌ర్ల‌లో అయితే నార‌ప్ప‌కు రూ.25 కోట్ల లాభం?

బయటకు రావొద్దంటున్న కేసీఆర్

ఆంధ్రప్రదేశ్‌లో మత మార్పిడుల అంశం మళ్లీ కలకలం సృష్టిస్తోంది. ఈ అంశంపై తక్షణం నివేదిక ఇవ్వాల్సిందిగా జాతీయ ఎస్సీ కమిషన్ రాష్ట్ర‌ ముఖ్య‌కార్య‌ద‌ర్శిని ఆదేశించింది. ఏపీలో దళితుల్ని ల‌క్ష్యంగా ఎంచుకొని మత మార్పిళ్లకు పాల్పడుతున్నారంటూ నాగ‌రాజు అనే వ్య‌క్తి జాతీయ ఎస్సీ క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా క‌మిష‌న్ నుంచి చీఫ్ సెక్ర‌ట‌రీకి తాఖీదులు అందాయి. రెండువారాల్లో విచార‌ణ జ‌రిపి నివేదిక ఇవ్వాల‌ని క‌మిష‌న్ ఆదేశించింది. అలా జ‌ర‌గ‌ని ప‌క్షంలో రాజ్యాంగంలోని 338 ఆర్టిక‌ల్ ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది.

మ‌తం మార్చండి.. ఎవ‌రు అడ్డొస్తారో చూస్తా..??

గవర్నర్ ని ఇరికిస్తున్న జగన్...?

తమిళుల‌కు ఎంతో ఇష్ట‌మైన వ‌స్త్ర దుకాణాల్లో రామ్‌రాజ్ కాట‌న్ క‌చ్చితంగా ఉంటుంది. తమిళనాడులో మొద‌లై కేర‌ళ‌, కర్ణాటక, ఏపీ, తెలంగాణ‌ల్లో విస్తరించింది. ఉత్తర భార‌త‌దేశంలో కూడా దుకాణాలు ఏర్పాటు చేస్తోంది. అటువంటి సంస్థ ఉత్ప‌త్తుల‌ను త‌మిళులు బాయ్‌కాట్ చేస్తున్నారు. తాజాగా రామ్‌రాజ్ కాట‌న్‌ సంస్థ ఉద్యోగాల కోసం ఒక ప్ర‌క‌ట‌న ఇచ్చింది. మ‌ధురై, తిరుప్పూరు ప్రాంతాల్లో మాన‌వ వ‌న‌రుల విభాగంలో ఎగ్జిక్యూటివ్‌గా ప‌నిచేయ‌డానికి అభ్య‌ర్థులు కావాల‌ని, తెలుగులో మాట్లాడేవారికి మొద‌టి ప్రాధాన్య‌మ‌ని సంస్థ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. అంతే ఒక్క‌సారిగా త‌మిళ తంబీలు అగ్గిమీద గుగ్గిల‌మ‌య్యారు. తెలుగు మాట్లాడేవారికి ప్రాధాన్య‌మ‌నడం వారికి ఏమాత్రం రుచించ‌లేదు. మ‌ధురై, తిరుప్పూరు ప్రాంతాల్లో తెలుగు మాట్లాడేవారు అధిక సంఖ్య‌లో ఉంటారు. అంతేకాకుండా తంజావూరు, కుంభ‌కోణం, కంచి త‌దిత‌ర ప్రాంతాల్లో ప‌నిచేయ‌డానికి కూడా తెలుగు మాట్లాడేవారు కావాలంటూ సంస్థ ప్ర‌క‌ట‌న ఇచ్చింది.

రామ్‌రాజ్ కాట‌న్‌లో "తెలుగు" గొడ‌వ‌?

ఎంపీల పోరాటం రఘురామకు నచ్చేసిందిగా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>