BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag794e89f1-17ac-44c7-a6b1-46103583a660-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag794e89f1-17ac-44c7-a6b1-46103583a660-415x250-IndiaHerald.jpg ఏపీ, తెలంగాణ మ‌ధ్య జ‌ల‌వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ అంశాన్ని వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి ఈరోజు లోక్‌స‌భ‌లో ప్ర‌స్తావించారు. తెలంగాణ అక్ర‌మంగా ప్రాజెక్టులు నిర్మిస్తోంద‌ని, త‌మ ప్ర‌భుత్వాన్ని ఏనాడూ సంప్ర‌దించ‌లేద‌ని ఆరోపించారు. కేంద్రం విడుద‌ల చేసిన గెజిట్ నోటిఫికేష‌న్‌పై ఆయ‌న మాట్లాడుతూ తెలంగాణ ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు సంధించారు. విభ‌జ‌న హామీల ప్ర‌కారం కాకుండా ఇష్టారీతిన వ్య‌వ‌హ‌రిస్తోందంటూ ఎంపీ మండిప‌డ్డారు. దీనికి జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పందిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రtag{#}Krishna River;Om Birla;Rajya Sabha;venkaiah naidu;MP;Minister;Telangana;Telugu;YCPలోక్‌స‌భ‌లో కేసీఆర్‌ను టార్గెట్ చేసిన వైసీపీ?లోక్‌స‌భ‌లో కేసీఆర్‌ను టార్గెట్ చేసిన వైసీపీ?tag{#}Krishna River;Om Birla;Rajya Sabha;venkaiah naidu;MP;Minister;Telangana;Telugu;YCPThu, 22 Jul 2021 11:29:48 GMT

ఏపీ, తెలంగాణ మ‌ధ్య జ‌ల‌వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ అంశాన్ని వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి ఈరోజు లోక్‌స‌భ‌లో ప్ర‌స్తావించారు. తెలంగాణ అక్ర‌మంగా ప్రాజెక్టులు నిర్మిస్తోంద‌ని, త‌మ ప్ర‌భుత్వాన్ని ఏనాడూ సంప్ర‌దించ‌లేద‌ని ఆరోపించారు. కేంద్రం విడుద‌ల చేసిన గెజిట్ నోటిఫికేష‌న్‌పై ఆయ‌న మాట్లాడుతూ తెలంగాణ ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు సంధించారు. విభ‌జ‌న హామీల ప్ర‌కారం కాకుండా ఇష్టారీతిన వ్య‌వ‌హ‌రిస్తోందంటూ ఎంపీ మండిప‌డ్డారు. దీనికి జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పందిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల‌ను దృష్టిలో ఉంచుకొనే గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేశామ‌ని చెప్పారు. ఇరు రాష్ట్రాల మ‌ధ్య ఎటువంటి వివాదాల‌కు తావులేకుండా చూస్తున్నామ‌న్నారు. ఉభ‌య స‌భ‌ల్లో విప‌క్షాలు నిర‌స‌న‌లు చేస్తున్న నేప‌థ్యంలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు మ‌ధ్యాహ్నం 12.00 గంట‌ల వ‌ర‌కు స‌భ‌ను వాయిదా వేశారు. అలాగే లోక్ సభను స్పీకర్ ఓం బిర్లా కూడా స‌భ‌ను 12.00 గంటల వరకు వాయిదా వేశారు. ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ మ‌ధ్య కృష్ణా న‌దీ జ‌లాల పంప‌కంపై వివాదం న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే.



కౌశిక్ రెడ్డికి షాక్.. 5.6 లక్షల జరిమానా విధించిన జిహెచ్ఎంసి..?

పండించే పంటకి.. తినే తిండికీ పార్టీ రంగులు?

ప్ర‌ధాన‌మంత్రిగా న‌రేంద్ర‌మోడీని ఆ ప‌ద‌విలో కూర్చోబెట్ట‌డంవెన‌క ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ వ్యూహం దాగివుంద‌నే విష‌యం దేశం మొత్తానికి తెలుసు. ఆ త‌ర్వాత ఢిల్లీలో అర‌వింద్ కేజ్రీవాల్‌, పంజాబ్ లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం, ఏపీలో జ‌గ‌న్‌, త‌మిళ‌నాడులో స్టాలిన్‌, ప‌శ్చిమ బెంగాల్ లో మ‌మ‌తా బెన‌ర్జీ అధికారం చేప‌ట్ట‌డం వెన‌క పీకే కీల‌క‌పాత్ర పోషించారు. మ‌ధ్య‌లో జ‌రిగిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మాత్రం భార‌తీయ జ‌న‌తాపార్టీ మాత్రం పీకేను కాద‌ని అమిత్ షా వ్యూహం ప్ర‌కారం వెళ్లి విజ‌యం సాధించారు. అప్ప‌టినుంచి మోడీ, అమిత్ షా పీకేను దూరం పెడుతూ వ‌చ్చారు. ఇప్ప‌టికి ఆ దూరం ఎంత‌లా పెరిగిందంటే న‌రేంద్ర‌మోడీకి వ్య‌తిరేకంగా పీకే ఒక కూట‌మిని తయారుచేసేంత‌గా. ఈ సారి ఎన్నిక‌ల్లో ఎలాగైనా కాంగ్రెస్ పార్టీకి అధికారం క‌ట్ట‌బెట్ట‌డ‌మే ల‌క్ష్యంగా ఆయ‌న వ్యూహం ప‌న్నుతున్నారు.

జగన్ అనవసరంగా కొత్త సమస్య తెచ్చుకుంటున్నారా...?

న‌రేంద్ర‌మోడీ, ప్ర‌శాంత్ కిషోర్‌.. ఎవ‌రిది పైచేయి?

మనోళ్లు అటు.. వాళ్లేమో ఇటు..అసలేం జరుగుతోంది!

రవిబాబు అసలు దర్శకుడే కాదు.. ప్రొడ్యూసర్ సంచలన వ్యాఖ్యలు..!

రీమేక్ లు అంటే ఆ అభిప్రాయం తొలగించిన సినిమాలు!!

నటి కస్తూరి భర్త కూడా మనకు తెలిసిన నటుడే



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>