PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcp4bd31f25-7dba-47be-84a0-4021567141af-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcp4bd31f25-7dba-47be-84a0-4021567141af-415x250-IndiaHerald.jpgదీంతో.. సొంత పార్టీలోనే ఉండ‌వ‌ల్లికి వ్య‌తిరేకంగా చాలా మంది చ‌క్రాలు తిప్పుతున్నారు. రాజ‌ధాని విష‌యంలో ఇప్ప‌టికేఆమె చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో ఇక్క‌డి ప్ర‌జ‌లు గుర్రుగా ఉన్నారు. ఇక‌, ఎంపీతోను.. ఒక‌రిద్ద‌రు మంత్రుల‌తోనూ కూడా ఆమెకు స‌ఖ్య‌త లేదు. ఈ ప‌రిణామాలే.. సీఎం జ‌గ‌న్కు ఆమెపై ఫిర్యాదులు చేసే వ‌ర‌కు వెళ్లాయ‌ని అంటున్నారు. వాస్త‌వానికి జ‌గ‌న్‌కు తాను చాలా క్లోజ్ అని.. మంత్రి వ‌ర్గంలో సీటు కూడా ఖ‌రార‌వుతోంద‌ని.. శ్రీదేవి అనుచ‌రుల ద్వారా పెద్ద ఎత్తున ప్ర‌చారం చేయిం చుకుంటున్నారు. సోష‌ల్ మీడియYSRCP{#}Vundavalli Aruna Kumar;Thadikonda;TDP;YCP;Sridevi Kapoor;Guntur;CM;Minister;local language;Party;mediaఆ వైసీపీ మ‌హిళా ఎమ్మెల్యేకు 2024లో నో టిక్కెట్ ?ఆ వైసీపీ మ‌హిళా ఎమ్మెల్యేకు 2024లో నో టిక్కెట్ ?YSRCP{#}Vundavalli Aruna Kumar;Thadikonda;TDP;YCP;Sridevi Kapoor;Guntur;CM;Minister;local language;Party;mediaWed, 21 Jul 2021 14:57:00 GMTరాజ‌కీయాలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండ‌వు. ఎప్పుడు ఎలా మారితే.. దానికి అనుగుణంగానే నాయ‌కులు మారాల్సిన ప‌రిస్థితి  ఉంటుంది. ఇప్పుడు ఈ మాట‌.. గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవి గురించి బాహాటంగానే వినిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో అనూహ్యంగా తెర‌మీదికి వ‌చ్చిన డాక్ట‌ర్ శ్రీదేవి.. వైసీపీ త‌ర‌ఫున టికెట్ ద‌క్కించుకుని.. పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకు న్నారు. అయితే.. ఆమె వివాదాల‌కు కేంద్రంగా మారార‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టు కూడా సంపాయిం చుకోలేక పోవ‌డం మ‌రింత గా ఆమెను వివాదానికి గురి చేస్తోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆఖ‌రికి ఎంపీల‌కు కూడా ఆమె రాజ‌కీయం న‌చ్చ‌డం లేదు.

దీంతో.. సొంత పార్టీలోనే ఉండ‌వ‌ల్లికి వ్య‌తిరేకంగా చాలా మంది చ‌క్రాలు తిప్పుతున్నారు. రాజ‌ధాని విష‌యంలో ఇప్ప‌టికేఆమె చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో ఇక్క‌డి ప్ర‌జ‌లు గుర్రుగా ఉన్నారు. ఇక‌, ఎంపీతోను.. ఒక‌రిద్ద‌రు మంత్రుల‌తోనూ కూడా ఆమెకు స‌ఖ్య‌త లేదు. ఈ ప‌రిణామాలే.. సీఎం జ‌గ‌న్కు ఆమెపై ఫిర్యాదులు చేసే వ‌ర‌కు వెళ్లాయ‌ని అంటున్నారు. వాస్త‌వానికి జ‌గ‌న్‌కు  తాను చాలా క్లోజ్ అని.. మంత్రి వ‌ర్గంలో సీటు కూడా ఖ‌రార‌వుతోంద‌ని.. శ్రీదేవి అనుచ‌రుల ద్వారా పెద్ద ఎత్తున ప్ర‌చారం చేయిం చుకుంటున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా పాట‌లు రాయించుకుని పాడించుకుంటున్నారు. అడ‌పా ద‌డ‌పా.. అభివృద్ది కార్య‌క్ర‌మాల పేరుతో హ‌డావుడి చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఇవ‌న్నీ..వాపులేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఎందుకంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాడికొండ టికెట్‌ను జ‌గ‌న్‌.. మాజీ మంత్రి, ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉన్న డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్ కు ఖ‌రారు చేశార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ హామీతోనే డొక్కా టీడీపీ ఎమ్మెల్సీ గా ఉన్న‌ప్ప‌టికీ.. వైసీపీలోకి వ‌చ్చార‌ని.. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు తాడికొండ ఖాయ‌మ‌ని.. మ‌రోసారి ప్ర‌చారం ఊపందుకుంది. పైగా.. శ్రీదేవి మాదిరిగా.. ఇక్క‌డ స్థానిక ప్ర‌జ‌ల నుంచి మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్‌కు వ్య‌తిరేకత లేక‌పోవ‌డం.. బ‌ల‌మైన సామాజిక వ‌ర్గం అండ‌గా ఉండ‌డం వంటివి క‌లిసివ‌స్తున్న నేప‌థ్యంలో రాజ‌ధాని వ్య‌తిరేక‌త కూడా ఆయ‌న‌పై ప‌డే అవ‌కాశం లేద‌ని అంటున్నారు.

ఇక‌, పార్టీ ప‌రంగాను.. ఏ స‌మ‌స్య వ‌చ్చినా స్పందించ‌డంలో వ‌ర‌ప్ర‌సాద్ ముందుంటున్నార‌ని.. అందుకే ఆయ‌న‌కు మంచి మార్కులు కూడా ప‌డుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మొత్తానికి ఒక్క‌ఛాన్స్‌కే ఎగిరిపోయే నేత‌ల్లో శ్రీదేవి పేరు బాహాటంగానే వినిపిస్తుండ‌డం వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారితీసింది.





వైసీపీ ఎమ్మెల్యేతో ప్రాణాహాని ఉందంటున్న బీజేపీ నేత‌...?

అందరి ముందే ఆమెకి కిస్ పెట్టిన జబర్దస్త్ కమెడియన్.. వైరల్ వీడియో?

కూతురి మీద మహేష్ కి ఇంత నమ్మకమా..?

తాడికొండ 2024 టిక్కెట్ డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్‌కేనా ?

పెళ్లయ్యాక జీవితం మారిపోయింది...రానా..!

ప‌వ‌న్ ఫాలోయింగ్ త‌గ్గించేశారు.. గ‌మ‌నించారా..?

ప్రెస్ అకాడ‌మీలో జ‌ర్న‌లిస్టుల‌కు శిక్ష‌ణ‌...ప్ర‌భుత్వం ఆలోచ‌న ఇదేనా...?

జ‌న‌సేన‌లో క‌ల‌క‌లం.. ఆ నేత‌ను మార్చాల‌ని డిమాండ్‌..!

లింగ‌మార్పిడి స‌ర్జ‌జీ త‌ర‌వాత ఆ స‌మ‌స్య‌లు..ట్రాన్స్ జండ‌ర్ ఆత్మ‌హ‌త్య‌.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>