PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-69f76081-1712-48e6-b241-971d8947cbbb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-69f76081-1712-48e6-b241-971d8947cbbb-415x250-IndiaHerald.jpgనిర్ణయం తీసుకుంది. ఆ కమిటీ ఆధ్వర్యంలో స్క్రీనింగ్ చేసిన తర్వాత మాత్రమే ఆ నేతల గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ కమిటీ ఓకే చెప్పిన తర్వాతే స్థానిక నేతలు సర్దుబాటు చేసిన తర్వాతే కొత్త వారిని పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ కండిషన్స్ పార్టీలో చేరాలని కొనేవారికి మోకాలు అడ్డం పెడితే ఎలా అని చాలా మంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యూహం ఎంత వరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.Political {#}MP;TPCC;Bhupalpally;Diesel;Mahbubnagar;Revanth Reddy;Congress;Khammam;Party;Reddy;local language;Success;Minister;Districtకండిషన్ ఒకే అయితేనే పార్టీలోకి రండి.. రేవంత్ కొత్త రూల్..?కండిషన్ ఒకే అయితేనే పార్టీలోకి రండి.. రేవంత్ కొత్త రూల్..?Political {#}MP;TPCC;Bhupalpally;Diesel;Mahbubnagar;Revanth Reddy;Congress;Khammam;Party;Reddy;local language;Success;Minister;DistrictWed, 21 Jul 2021 14:05:00 GMT టిపిసిసి  అధ్యక్షుడిగా  రేవంత్ రెడ్డి వచ్చాక  పార్టీ సమీకరణాలు మారుతున్నాయి అని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీలో  నూతనోత్సాహం మొదలైంది. దీంతో  చాలామంది నేతలు ఆ పార్టీ వైపు చూస్తున్నారని చెప్పవచ్చు. కానీ పార్టీలోకి రావాలనుకునే వారికి కాంగ్రెస్ నేతలు ఒక కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ ఓకే చెబితేనే  పార్టీలోకి రావడానికి అవకాశం ఉన్నదని వారు చెబుతున్నారు. అసలా కండిషన్ ఏమిటి.. ఈ కండిషన్ను ఎందుకు పెట్టారు.. తెలుసుకుందాం. రేవంత్ రెడ్డి  టీపీసీసీ కాకముందు కాంగ్రెస్ పార్టీ నుంచి  వలసలు పోవడమే తప్ప రావడం అనేది  గత ఏడున్నర సంవత్సరాల నుంచి లేదనే చెప్పవచ్చు.

రేవంత్ రెడ్డి పిసిసి అయిన తర్వాత  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు  కొత్త నూతనోత్సాహం వచ్చిందని, పార్టీ మళ్లీ పుంజుకుంటుందని, పలువురు అభిప్రాయపడుతున్నారు. అదే దూకుడుతో రేవంత్ రెడ్డి కూడా  ముందస్తు కార్యాచరణతో  పార్టీని ముందుకు తీసుకు పోతున్నారు. ఇటీవల కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలపై  కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా నిరసన తెలియజేయడంలో  సక్సెస్ అయింది. దీంతో కొత్త బాస్  కాంగ్రెస్ కు మళ్లీ పునర్జీవం పోసేందుకు పాత నేతలందరినీ వరుసగా కలుస్తున్నారు. పార్టీలకతీతంగా గతంలో పలుకుబడి కలిగినటువంటి నేతలను, వారి వారసులను సైతం కలిసి మాట్లాడుతున్నారు. అందులో భాగంగానే మాజీ మంత్రి టి.దేవేందర్ గౌడ్, ఖమ్మం ఫైర్ బ్రాండ్  అయిన రేణుకా చౌదరి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వంటి వారిని కలిసి  మద్దతు కోరారు. ఇలా  ముందస్తు ఆలోచనతో వెళ్తున్న రేవంత్ రెడ్డి వైపు చాలామంది ఈ నేతల చూపు పడుతోంది. దీంతో చాలామంది నేతలు  హస్తం తీర్థం పుచ్చుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే మహబూబ్నగర్  జిల్లా బిజెపి అధ్యక్షుడు, నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, భూపాలపల్లి నేత గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్ కు మద్దతు తెలుపుతున్నారు. ఇలా పలువురు నేతలు కాంగ్రెస్ లోకి వస్తుండడంతో ఇదివరకు ఉన్నటువంటి చాలా మంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ లోకి రావడాన్ని  స్థానిక నేతలు కొందరు వ్యతిరేకిస్తున్నారని సమాచారం. అందుకే ఇలాంటి పరిస్థితులు ముందు ముందు  రాకూడదని ఆలోచనతోనే పార్టీ సరికొత్త ఆలోచనతో నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీలో చేరే వారి విషయంలో  ఒక కమిటీ వేయాలని  పీసీసీ నిర్ణయం తీసుకుంది. ఆ కమిటీ ఆధ్వర్యంలో  స్క్రీనింగ్ చేసిన తర్వాత మాత్రమే  ఆ నేతల గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే  ఈ కమిటీ ఓకే చెప్పిన తర్వాతే స్థానిక నేతలు సర్దుబాటు చేసిన తర్వాతే  కొత్త వారిని పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ కండిషన్స్ పార్టీలో చేరాలని కొనేవారికి మోకాలు అడ్డం పెడితే ఎలా అని చాలా మంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యూహం ఎంత వరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.



లింగ‌మార్పిడి స‌ర్జ‌జీ త‌ర‌వాత ఆ స‌మ‌స్య‌లు..ట్రాన్స్ జండ‌ర్ ఆత్మ‌హ‌త్య‌.. !

మంచిమాట : వీటిని.. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చూస్తే , అత్యంత శుభప్రదం..

ఆంధ్రాపాల‌కులు నిద్ర‌పోతున్నారా...? - మాజీ మంత్రి

ఎవ‌రైనా స‌రే.. వైటీపీలో చేరాల్సిందే..?

జ‌గ‌న్ కోసం జ‌నాల్ని ఇబ్బంది పెడుతున్న పోలీసులు...?

ఏపీలో ఇంట‌ర్ ఫ‌లితాలు ఎప్పుడంటే?

టీకా తీసుకుంటేనే ప్ర‌యాణం.. 7 సూత్రాల‌తో కేంద్రం స‌ల‌హా..!

ఏపీ మంత్రికి అధికారి బంప‌ర్ ఆఫ‌ర్‌?

చిరంజీవి టైటిల్ తో కార్తికేయ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>