BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag1074ca53-4b8f-495f-b539-a98b14e56d92-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag1074ca53-4b8f-495f-b539-a98b14e56d92-415x250-IndiaHerald.jpg న‌వ‌జ్యోత్‌సింగ్ సిద్ధూను పంజాబ్ పీసీసీ అధ్య‌క్షుడిగా నియ‌మించిన త‌ర్వాత రాజ‌కీయాలు చ‌ల్ల‌బ‌డ‌తాయనుకుంటే మ‌రింత వేడెక్కాయి. బుధ‌వారం స్వ‌ర్ణ‌దేవాల‌యం సంద‌ర్శ‌న‌కు భారీగా నేత‌లు త‌ర‌లిరావాలంటూ సిద్ధూ ఇచ్చిన పిలుపున‌కు 60 మంది ఎమ్మెల్యేలు రావ‌డంతో ఒక్క‌సారిగా పంజాబ్ రాజ‌కీయం వేడెక్కింది. అమృత్‌స‌ర్‌లో పెద్ద‌సంఖ్య‌లో సిద్ధూ క‌టౌట్లు వెలిశాయి. అలాగే స్వ‌ర్ణ‌దేవాల‌యం వ‌ద్ద కార్య‌క‌ర్త‌లు, నేత‌ల‌తో కార్య‌క్ర‌మం బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌ను త‌ల‌పించింది. సిద్ధూ పీసీసీ అధ్య‌క్షుడైన త‌ర్వాత ముఖ్య‌మంత్రి అమ‌రింద‌రtag{#}MLA;Punjab;Congress;Partyవేడెక్కిన పంజాబ్ రాజ‌కీయం?వేడెక్కిన పంజాబ్ రాజ‌కీయం?tag{#}MLA;Punjab;Congress;PartyWed, 21 Jul 2021 18:42:00 GMT

న‌వ‌జ్యోత్‌సింగ్ సిద్ధూను పంజాబ్ పీసీసీ అధ్య‌క్షుడిగా నియ‌మించిన త‌ర్వాత రాజ‌కీయాలు చ‌ల్ల‌బ‌డ‌తాయనుకుంటే మ‌రింత వేడెక్కాయి. బుధ‌వారం స్వ‌ర్ణ‌దేవాల‌యం సంద‌ర్శ‌న‌కు భారీగా నేత‌లు త‌ర‌లిరావాలంటూ సిద్ధూ ఇచ్చిన పిలుపున‌కు 60 మంది ఎమ్మెల్యేలు రావ‌డంతో ఒక్క‌సారిగా పంజాబ్ రాజ‌కీయం వేడెక్కింది. అమృత్‌స‌ర్‌లో పెద్ద‌సంఖ్య‌లో సిద్ధూ క‌టౌట్లు వెలిశాయి. అలాగే స్వ‌ర్ణ‌దేవాల‌యం వ‌ద్ద కార్య‌క‌ర్త‌లు, నేత‌ల‌తో కార్య‌క్ర‌మం బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌ను త‌ల‌పించింది. సిద్ధూ పీసీసీ అధ్య‌క్షుడైన త‌ర్వాత ముఖ్య‌మంత్రి అమ‌రింద‌ర్‌ను సిద్ధూకానీ, సిద్ధూను అమ‌రింద‌ర్‌కానీ ఇంత‌వ‌ర‌కు క‌ల‌వ‌లేదు. త‌న‌పై చేసిన వ్యాఖ్య‌ల‌కు క్ష‌మాప‌ణ చెబితేనే క‌లుస్తాన‌ని కెప్టెన్ అమ‌రింద‌ర్ స్ప‌ష్టం చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మ‌ద‌న్‌లాల్ జుల్పూర్ మాట్లాడుతూ పంజాబ్ మొత్తం సిద్ధూను కోరుకుంటోంద‌ని, ఆయ‌న నియామ‌కంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వ‌చ్చింద‌న్నారు. 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీలో కాంగ్రెస్ బ‌లం 77గా ఉంది. పీసీసీ అధ్య‌క్షుడిగా నియ‌మితుడైన సిద్ధూ ముఖ్య‌మంత్రి అమ‌రింద‌ర్‌కు క్ష‌మాప‌ణ చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని మ‌ద‌న్‌లాల్ అన్నారు.

భార‌తీయ జ‌న‌తాపార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీ వెళుతున్నారు. మూడు రోజులు ఢిల్లీలో ఉండి పార్టీ పెద్దలతో ఏపీ ప‌రిస్థితిపై చర్చలు జరపనున్నారు. మూడురోజ‌లుండేలా రావాలంటూ పెద్దల నుంచి సమాచారం అంద‌డంతో సోము వీర్రాజుతో పాటు ఇతర పార్టీ నేతలు కూడా ఆశ్చర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఢిల్లీ వెళుతున్న సోము పార్టీ అధ్య‌క్షుడిగానే తిరిగొస్తారా? లేదంటే ప‌ద‌వి ఊడ‌గొట్టుకొని తిరిగొస్తారా? అనే చ‌ర్చ‌లు ఇప్పుడు ఏపీ బీజేపీలో ప్రారంభ‌మైంది.

"మూడురోజులుండేలా" ఢిల్లీ రండి??

మోడీ చెప్పిన దానికి.. అసలు మాటలు కూడా రావట్లేదు : రౌత్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా ఉధృతి త‌గ్గ‌డంలేదు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,527 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైద్య, ఆరోగ్యశాఖ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం 2,412 మంది బాధితులు కోలుకున్నారు. 19 మంది మృతిచెందారు. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసులు 19,46,749కు పెరిగాయి. 19,09,613 మంది కోలుకున్నారు. మ‌ర‌ణించిన‌వారి సంఖ్య 13,197కు చేరింది. రాష్ట్రంలో ప్ర‌స్తుతం 23,939 యాక్టివ్‌ కేసులున్నాయని వైద్య‌, ఆరోగ్యశాఖ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. కొత్తగా నమోదైన కేసుల్లో తూర్పుగోదావరి జిల్లాలో 515, చిత్తూరులో 318 కేసులున్నాయి. అలాగే ప్రకాశంలో 303, పశ్చిమ గోదావరి జిల్లాలో 288, కృష్ణా జిల్లాలో 249, నెల్లూరులో 206, గుంటూరు జిల్లాలో 182, విశాఖపట్నంలో 133, కడప జిల్లాలో 111 చొప్పున అత్యధిక‌ కేసులు నమోద‌య్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 86,280 శాంపిల్స్‌ పరీక్షించారు. ఇప్ప‌టికే వైర‌స్ త‌గ్గుముఖం ప‌డుతోంద‌ని అంద‌రూ భావిస్తుండ‌గా రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండ‌టంతో ప్ర‌భుత్వం కూడా క‌ర్ఫ్యూను ఈనెల 30వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తూ ఉత్త‌ర్వులు జారీచేసింది.

ఏపీలో క‌రోనా ఉధృతి?

బీజేపీ దేశద్రేహం చేస్తోందన్న శైలజానాథ్

అత‌డికి వివాదాలేమీ కొత్త కాదు.. అత‌డికి కేసులేమీ కొత్త కాదు.. అత‌డికి శిక్ష‌లేమీ కొత్త కాదు.. అత‌నికి కొత్త‌వంటూ ఏవీ లేవు. అన్నీ పాత‌వే. ఐపీఎల్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు య‌జ‌మానిగా ఉన్న‌ప్పుడు బెట్టింగ్‌కు పాల్ప‌డ్డాడు.. దీంతోపాటు వెలుగులోకి రానివి ఎన్నెన్నో ఉన్నాయి. ఇప్పుడు పోర్నోగ్ర‌ఫీ రాకెట్ న‌డిపిస్తున్నాడు. ఆయ‌న పేరు రాజ్‌కుంద్రా. శిల్పా శెట్టి భర్త ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అయ్యారు. పోర్న్ సినిమాల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తున్నారంటూ కేసులు న‌మోద‌య్యాయి. వాటిని మొబైల్ యాప్స్‌లో రిలీజ్ చేస్తున్నట్లుగా అభియోగాలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయ్యారు. ముంబ‌యి క్రైమ్‌బ్రాంచ్ అత‌ని చేతికి అర‌దండాలు వేసింది. ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం బాలీవుడ్‌లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. బ‌య‌ట‌కు పేరు చెప్ప‌డానికి ఇష్ట‌ప‌డ‌ని ఎంతోమంది న‌టీమ‌ణులు రాజ్‌కుంద్రా అరెస్ట్‌వ‌ల్ల న్యాయ‌మే జ‌రిగింద‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

బాలీవుడ్‌లో రాజ్‌కుంద్రా ప్ర‌కంప‌న‌లు?

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>