MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shalini755f97ce-2b16-479e-be9d-d67db61cfcb9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shalini755f97ce-2b16-479e-be9d-d67db61cfcb9-415x250-IndiaHerald.jpgబాలనటిగా సినిమా కెరీర్ ను ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్ గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది నటి శాలిని అజిత్ కుమార్. 3 ఏళ్ల ప్రాయంలోనే మళయాల సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది శాలిని. ఆ తరువాత తెలుగులో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో బాల నటిగా నటించి ప్రేక్షకులను మెప్పించి మంచి క్రేజ్ ను అందుకుంది. ఆ సినిమాతో వచ్చిన పాపులారిటీ తో చాలా రోజులకు సినిమా పరిశ్రమ కు హీరోయిన్ గా పరిచయం అయింది.shalini{#}Mani Ratnam;Ajit Pawar;ajith kumar;marriage;Husband;Heroine;Tamil;Kollywood;Chitram;Telugu;Cinema;Heroసెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్న అజిత్ భార్య శాలిని..సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్న అజిత్ భార్య శాలిని..shalini{#}Mani Ratnam;Ajit Pawar;ajith kumar;marriage;Husband;Heroine;Tamil;Kollywood;Chitram;Telugu;Cinema;HeroWed, 21 Jul 2021 13:00:00 GMTబాలనటిగా సినిమా కెరీర్ ను ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్ గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది నటి శాలిని అజిత్ కుమార్. 3 ఏళ్ల ప్రాయంలోనే మళయాల సినిమా ద్వారా తెరంగేట్రం చేసింది శాలిని. ఆ తరువాత తెలుగులో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో బాల నటిగా నటించి ప్రేక్షకులను మెప్పించి మంచి క్రేజ్ ను అందుకుంది. ఆ సినిమాతో వచ్చిన పాపులారిటీ తో చాలా రోజులకు సినిమా పరిశ్రమ కు హీరోయిన్ గా పరిచయం అయింది.

శాలిని హీరోయిన్ పాత్రలో నటించిన మొట్టమొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు మలయాళ, తమిళ తెలుగు భాషల్లో డిమాండ్ ఎక్కువైపోయింది. ఆ విధంగా ఆమె బాలనటిగా తెలుగులో నటించిన మొదటి చిత్రం జైలుపక్షి సూపర్ హిట్ కాగా ఆ తర్వాత వరుస అవకాశాలను ఆమె అందుకుంది. చిన్నారి దేవత, బ్రహ్మ పుత్రుడు సినిమా లలో నటించింది. అయితే హీరోయిన్ గా మాత్రం ఆమె తెలుగులో ఇప్పటివరకు సినిమా చేయలేదు. కానీ మలయాళంలో మాత్రం చాలానే సినిమాలు చేసింది. 

ఇక డబ్బింగ్ సినిమాల ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. మణిరత్నం తెరకెక్కించిన సఖి సినిమాలో హీరోయిన్ గా నటించి అందరి హృదయాలను దోచుకుంది.అయితే  ఆ తర్వాత ఆమె అనూహ్యంగా సినిమాల నుంచి నిష్క్రమించి అందరినీ నిరాశపరిచారు. ఆమె కెరీర్ పిక్స్ లో ఉండగానే తమిళ స్టార్ హీరో అజిత్ ను ప్రేమించి పెళ్ళాడింది. పెళ్లి తర్వాత పూర్తిగా కుటుంబానికే తన సమయాన్ని వెచ్చించింది. భర్త పిల్లలు తన ప్రపంచంగా బ్రతికింది. అప్పటినుంచి ఇప్పటివరకు వెండితెరపై మళ్లీ కనిపించ లేదు కానీ ఆమె త్వరలోనే మణిరత్నం సినిమాతో ఎంట్రీ చేయడానికి రెడీ అవుతున్నారట. మణిరత్నం తెరకెక్కిస్తున్న సినిమా పోన్నియన్ సెల్వన్ లో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.



సినిమాల్లోకి స్టార్ కిడ్స్.. ఎవరెవరు వస్తున్నారంటే?

కొడుకుపై సంచలన వ్యాఖ్యలు చేసిన నిర్మాత సురేష్ బాబు ?

చిరంజీవి టైటిల్ తో కార్తికేయ..!

ఆర్ఆర్ఆర్ సినిమాలో ప్రమోషన్ సాంగ్ స్పెషల్ ఇదేనా..!?

ఇకపై ఆదర్శ స్మారకాలుగా ఆ మూడు..!

విక్టరీ వెంకటేష్ బాల నటుడిగా నటించిన సినిమా ఇదే..!?

"హాట్ షాట్స్" కోసం న‌న్ను రాజ్ కుంద్రా అడిగాడు..యూట్యూబ‌ర్ సంచ‌ల‌నం.. !

ఈ హీరోల నుంచి ప్రభాస్ ముప్పు తప్పదా!!

రాజశేఖర్ చేయాల్సిన అపరిచితుడు విక్రమ్ చేతిలోకి ఎలా వెళ్ళింది



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>