MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefined టాలీవుడ్ ఇండస్ట్రీని శాసిస్తున్న ఆ నలుగురు లో దగ్గుబాటి కుటుంబం ఒకటి అన్నది ఎవరు కాదనలేని సత్యం. ఆకుటుంబం నుండి వచ్చిన వెంకటేష్ కొన్ని దశాబ్దాలుగా హీరోగా రాణిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు అదే బాటలో పైనిస్తూ వెంకటేష్ కూతురు ఆశ్రిత ఫుడ్ చైన్ రెస్టారెంట్ బిజినెస్ లో ప్రస్తుతం రాణించడమే కాకుండా మహిళా వ్యాపార వేత్తగా అనేక విజయాలు సాధిస్తోంది. ఈమధ్య ఇన్ స్టా గ్రామ్ లో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్ డాట్ కాం విడుదల చేసింది.అంతర్జాతీయ స్థాయిలో ఆvenkatesh{#}Spain;Daggubati Venkateswara Rao;Yevaru;Suresh;Venkatesh;media;Fatherదగ్గుబాటి కుటుంబ నేపధ్యం పై వెంకటేష్ కూతురు షాకింగ్ కామెంట్స్ !దగ్గుబాటి కుటుంబ నేపధ్యం పై వెంకటేష్ కూతురు షాకింగ్ కామెంట్స్ !venkatesh{#}Spain;Daggubati Venkateswara Rao;Yevaru;Suresh;Venkatesh;media;FatherTue, 20 Jul 2021 09:00:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీని శాసిస్తున్న ఆ నలుగురు లో దగ్గుబాటి కుటుంబం ఒకటి అన్నది ఎవరు కాదనలేని సత్యం. ఆకుటుంబం నుండి వచ్చిన వెంకటేష్ కొన్ని దశాబ్దాలుగా హీరోగా రాణిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు అదే బాటలో పైనిస్తూ వెంకటేష్ కూతురు ఆశ్రిత ఫుడ్ చైన్ రెస్టారెంట్ బిజినెస్ లో ప్రస్తుతం రాణించడమే కాకుండా మహిళా వ్యాపార వేత్తగా అనేక విజయాలు సాధిస్తోంది. ఈమధ్య ఇన్ స్టా గ్రామ్ లో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్ డాట్ కాం విడుదల చేసింది.


అంతర్జాతీయ స్థాయిలో ఆశ్రిత 377వ స్థానంలో నిలవటంతో పాటు ఆసియాలో 27వ ర్యాంకు సాధించింది. చాలకాలం తరువాత మాత్రమే ఆమెను వెంకటేష్ కూతురుగా గుర్తించారు. తన కుటుంబం గురించిన వివరాలు చెప్పకుండా ఆమె తన స్వశక్తితో ఇన్ స్టా గ్రామ్ లో లక్షలాది సంఖ్యలో ఫాలోయర్స్ ను సంపాదించుకుంది. ఈసందర్భంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన కుటుంబ నేపధ్యం పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది.  


తాను టీనేజ్ లో ఉన్నప్పుడు తన తండ్రి వెంకటేష్ తన పెద్దనాన్న సురేష్ బాబు విదేశాలకు వెళ్ళి వచ్చిన తరువాత ఆ దేశాలలోని వంటల గురించి రుచుల గురించి తరుచూ చెపుతూ ఉండేవారని దీనితో ఆవంటలలోని రుచుల పై తనకు ఆశక్తి పెరిగి తాను 20 దేశాలు తిరిగి అనేక కొత్తకొత్త ప్రాంతాలు చూడటమే కాకుండా అక్కడి రుచులను ఆశ్వాదించి అలాంటి వంటలు తాను కూడ ఎందుకు తయారుచేయలేను అన్న ఆలోచనలతో ఫుడ్ టెక్నాలజీలో ఉన్నత చదువులు చదివిన విషయాన్ని బయటపెట్టింది. ప్రస్తుతం పెళ్లైన తర్వాత తన భర్తతో కలిసి స్పెయిన్ లోని బార్సిలోనాలో ఒక ఫుడ్ రెస్టారెంట్ ను చాల విజయవంతంగా నిర్వహిస్తున్న ఆశ్రిత ఎకనామిక్స్ లో మాస్టర్స్ ఆపైన ఎంబీఏ చేసింది. పుడ్ ట్రావెల్ ఫోటోగ్రఫీ రంగాలపై ఒక ప్రత్యేకమైన బ్లాగ్ ను నిర్వహిస్తున్న ఆశ్రిత ఇన్ స్టా గ్రామ్ విజిటర్స్ కు సుపరిచితురాలు.



కేవలం ఇన్ స్టా గ్రామ్ లోని తన బ్లాగ్ ద్వారా భారీ మొత్తంలో ఆమె సంపాదిస్తోంది అంటే ఎవరైనా ఆశ్చర్యపడే విషయం. బార్సిలోనాలో కల్నరీ షెఫ్ ప్రోగ్రాం చేస్తున్న ఆశ్రిత తన సోషల్ మీడియా పేజ్ గురించి మాట్లాడుతూ తాను ఇన్ స్టా గ్రామ్ లో ఎకౌంట్ ప్రారంభించినప్పుడు తాను ఎవరో ఎవరికీ తెలియదని చాలాకాలం ఫుడ్ అండ్ ట్రావెల్ మీద ఆసక్తి ఉన్న వారు మాత్రమే తన పేజ్ ను ఫాలో అయిన విషయాన్ని వివరించింది. తన చిన్న తనం నుండి తన తండ్రి తన కుటుంబ పేరు ఉపయోగించకుండా ఎదిగి నప్పుడు మాత్రమే నిజమైన విజయం అని చెపుతూ ఉండటంతో తన కుటుంబ పేరు ఎక్కడా వాడకుండా తాను సాధించిన ఈవిజయాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపింది..  






తరుణ్ భాస్కర్ ఎదురు చూపులతోనే సరిపెడుతున్నాడే..!!

చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కంటే త‌న‌కే ఎక్క‌వ ఫాలోయింగ్ అంటా..!

కేటీఆర్ కోసం స్పెషల్ గిఫ్ట్ ప్లాన్ చేసిన నటి ?

చ‌ల‌ప‌తిరావు భార్య ఎలా చనిపోయిందో తెలుసా..!?

వెంకీ నటించిన రీమేక్ సినిమాలెన్నో తెలుసా?

సురేష్ బాబు మాటలకు అర్థాలు వెతుకుతున్న ఎగ్జిబ్యూటర్స్ !

టీవీ : డాక్టర్ బాబు ఆస్తి విలువ తెలుసా..?

నారప్ప : రివ్యూ

మోక్షజ్ఞ ఎంట్రీ ఆ సినిమాతోనేనా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>