CrimeN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder-f83e0194-369a-428e-a801-9e76d4d72bb8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder-f83e0194-369a-428e-a801-9e76d4d72bb8-415x250-IndiaHerald.jpgవారిద్దరూ భార్యాభర్తలు దశాబ్దాలకు పైగా కలిసి కాపురం చేశారు. ఇక పిల్లలు కూడా సెటిల్ అవడంతో హాయిగా శేషజీవితం సంతోషంగా గడపాల్సింది పోయి ఈ వయసులోనూ వాళ్లిద్దరి మధ్య గొడువలు, మనస్పర్దలు తలెత్తాయి. అయితే బంధువుల ఇంటికి వెళ్లే విషయంలో యువజంట మాదిరిగా ఆ వృద్ధజంట మాటా మాటా అనుకున్నారంట.murder {#}West Godavari;Mulugu;Masala;Andhra Pradesh;Smart phone;Wife;police;marriage;News;monday80 ఏళ్ల వయసులో భార్యభర్తల మధ్య గొడవ.. చివరికి..!?80 ఏళ్ల వయసులో భార్యభర్తల మధ్య గొడవ.. చివరికి..!?murder {#}West Godavari;Mulugu;Masala;Andhra Pradesh;Smart phone;Wife;police;marriage;News;mondayTue, 20 Jul 2021 21:15:00 GMTవారిద్దరూ భార్యాభర్తలు దశాబ్దాలకు పైగా కలిసి కాపురం చేశారు. ఇక పిల్లలు కూడా సెటిల్ అవడంతో హాయిగా శేషజీవితం సంతోషంగా గడపాల్సింది పోయి ఈ వయసులోనూ వాళ్లిద్దరి మధ్య గొడువలు, మనస్పర్దలు తలెత్తాయి. అయితే బంధువుల ఇంటికి వెళ్లే విషయంలో యువజంట మాదిరిగా ఆ వృద్ధజంట మాటా మాటా అనుకున్నారంట. ఇక చివరికి ఆ కుటుంబం పెద్ద దిక్కుని కోల్పోవాల్సి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం, కోళ్లపర్రు గ్రామనికి చెందిన కనుమూరి విజయరామరాజు ఆయన భార్య సరళాదేవి రెండేళ్లుగా గొల్లలకోడేరులోని సంజన్ ఆపార్ట్ మెంట్స్ లో నివాసం ఉంటున్నారు. అయితే విజయరామరాజు మొదటిభార్య చనిపోవడంతో 20 ఏళ్ల క్రితం తెలంగాణలోని ములుగు జిల్లా వాజేడు మండలానికి చెందిన సరళాదేవిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇక కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు అవుతున్నాయి..

ఇక ముఖ్యంగా భార్య సరళాదేవి ఆమె బంధువుల ఇంటికి వెళ్లడం నచ్చని విజయరామరాజు ఇదే విషయంపై తరచూ ఆమెతో గొడవ పడుతుండేదంట. ఈ తరుణంలో సోమవారం ఇద్దరి మధ్య మరోసారి గొడవ తలెత్తింది. ఇక ఇద్దరూ ఒకర్ని ఒకరు తిట్టుకున్నారు. చివరికి మసాలా దినుశులు నూరుకునే కలంపత్రంపై ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. కాగా.. సరళాదేవి తీవ్రంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడిన విజయరామరాజు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సరళా దేవి.. ఫ్లాట్ తరుపు తీసే ఓపిక లేకపోవడంతో తన దగ్గరున్న సెల్ ఫోన్ తో విజయరామరాజు మొదటి భార్య కుమారుడు వెంకటరామరాజుకు ఫోన్ చేసి జరిగిన విషయం తెలిపింది. ఇక కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా.. విజయరామరాజు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అలాగే సరళాదేవి ఆస్పత్రిలో ఉండగా ఆమె కోలుకున్న తర్వాత అసలేం జరిగిందనేది తెలియదని పోలీసులు తెలిపారు.



"శిల్పాశెట్టి పాపం..." అన్న పూనం పాండే

పెద్ద స్కెచ్ తోనే వస్తున్న ప్రవీణ్ కుమార్

ప్రియాంక చోప్రా వైవాహిక జీవితానికి మూడేళ్లు..

తెలంగాణా పోలీసులకు కొత్త సవాల్... చుక్కలు చూపిస్తున్న దొంగ పోలీసులు...?

కరోనాతో జంతువులకు కూడా ముప్పే.. పిల్లులలో ఎక్కువ ప్రభావం..?

పోర్నోగ్రఫీ కేసులో శిల్పాశెట్టి ప్రమేయముందా?

కేసీఆర్ కూడా తక్కువేం కాదన్న రేవంత్

ఆడవాళ్ళ జడ వెనుక ఇన్నీ రహస్యాలు ఉన్నాయా....?

గుంటూరులో దారుణం, 7 నెలల పాపను రేప్ చేసి...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>