PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/shiv-nadar-resighn-managing-director-post2045db5e-e1f2-45b7-9492-bac96a4eaa5c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/shiv-nadar-resighn-managing-director-post2045db5e-e1f2-45b7-9492-bac96a4eaa5c-415x250-IndiaHerald.jpgహెచ్ సీఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ ఎండీగా రాజీనామా చేశారు. నాడార్ ఇక ముందు ఛైర్మన్ ఎమిరిటస్, వ్యూహాత్మక సలహాదారుగా బాధ్యతలు వహించనున్నారు. ఐదేళ్ల పాటు ఈ పదవుల్లో శివ్ నాడార్ ఉంటారు. ప్రస్తుతం ఆయన వయసు 76సంవత్సరాలు. shiv nadar resighn managing director post{#}Kumaar;software;June;september;Directorఎండీ సీటు నుంచి ఎందుకు తప్పుకున్నారో..?ఎండీ సీటు నుంచి ఎందుకు తప్పుకున్నారో..?shiv nadar resighn managing director post{#}Kumaar;software;June;september;DirectorTue, 20 Jul 2021 08:20:00 GMTహెచ్ సీఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ మేనజింగ్ డైరెక్టర్ పదవి నుండి వైదొలిగారు. ప్రస్తుతం ఆయన వయసు 76సంవత్సరాలు. నాడార్ ఇకపై ఛైర్మన్ ఎమిరిటస్, వ్యూహాత్మక సలహాదారుగా వ్యవహరించనున్నారు. కొత్త పదవుల్లో ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు. సీఈఓగా ఉన్న సి.విజయ్ కుమార్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తించనున్నారు. గతేడాది జులైలో నాడార్ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకోగా.. ఆయన కుమార్తె రోష్నీ నాడార్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించారు.

1976వ సంవత్సరంలో శివ్ నాడార్ తన వ్యాపార సామ్రాజాన్ని స్థాపించారు. ఏడు మందితో కలిసి హెచ్ సీఎల్ గ్రూప్ కు పునాది వేశారు. శివ్ నాడార్ ఆధ్వర్యంలో 45ఏళ్ల పాటు కంపెనీ రన్ అయింది. స్వదేశీ కంప్యూటర్లను మన వినియోగదారులకు అందించి ఆదరణ పొందింది హెచ్ సీఎల్. సాఫ్ట్ వేర్ రంగంలో తిరుగులేని కంపెనీగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. అంతేకాదు 1994లో విద్యాసంస్థలను స్థాపించి ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఇంతవరకు 7వేల 400కోట్ల రూపాయలను ఖర్చు చేసింది.

ఇక కంపెనీ నికర లాభం విషయానికొస్తే... జూన్ 9.9శాతం పెరుగుదలతో రూ.3.214కోట్ల రూపాయలు సాధించింది. అదే గతేడాది అయితే రూ.2,925కోట్ల రూపాయల నికర లాభాన్ని సొంతం చేసుకుంది. ఇక ఆదాయం విషయానికొస్తే రూ.17వేల 841కోట్ల రూపాయల నుంచి 12.5శాతం ఎగబాకి రూ.20వేల 925కోట్లను సంపాదించుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రెండెంకల వృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోంది హెచ్ సీఎల్.

మరోవైపు నిరుద్యోగులకు హెచ్ సీఎల్ మంచి ఆఫర్ ప్రకటిస్తోంది. ఈ సంవత్సరం దాదాపు 22వేల మందికి యువతకు ఉపాధి కల్పించనున్నట్టు సంస్థ వెల్లడించింది. 22వేలు కూడా దాటొచ్చని తెలిపింది. తొలి విడతగా సెప్టెంబర్ లో 6వేల మందిని తీసుకోనున్నట్టు వెల్లడించింది. అంతేకాదు ఎంప్లాయిస్ అందరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు హెచ్ సీఎల్ ప్రకటించింది. ఇప్పటికే 74శాతం కంప్లీట్ అయినట్టు తెలిపింది.  





‘సలార్’ సినిమా నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

పెరిగిన బెంజ్ ఈక్యూసి ఎలక్ట్రిక్ ఎస్ యూవి..

నారప్ప : రివ్యూ

రామ్ మూవీలో విలన్ గా ఆ యంగ్ హీరో

బండ్ల గణేష్ నిర్మాతగా స్టార్ హీరో మూవీ ?

నితిన్ 'మ్యాస్ట్రో' కూడా ఓటిటిలోనే.. ఎప్పుడో తెలుసా..?

అనుమానం భార్యపై...కానీ కన్నబిడ్డలను ఏం చేశాడంటే..!

హవ్వ.. సామాన్యుడిపై పెట్రోల్ మోదీ.. మోదీ.. మోదీ సర్కార్ ?

ఆ డ్రెస్ వేసుకుని 50 రోజులు ఉన్నా...హీరో వెంకటేష్ ఎమోషనల్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>