మరో వారం కర్ఫ్యూ పొడగింపు, జన సమూహాలపై ఆంక్షలు కంటిన్యూ : సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. 2 వేల పైచిలుకు కేసులు వస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా వైరస్ గురించి సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మరో వారం పాటు రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగించాలని నిర్ణయించారు. ఇప్పటికీ ఓ మోస్తరు సంఖ్యలో కేసులు వస్తుండటంతో కర్ఫ్యూను మరికొన్ని రోజులు పొడిగిస్తున్నట్టు తెలిపారు.
రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని వివరించారు. జనసమూహాలపై ఆంక్షలు కొనసాగుతాయని సీఎం జగన్ స్పష్టం చేశారు. కొవిడ్ నిబంధనలు, మార్గదర్శకాలు కచ్చితంగా పాటించేలా చూడాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సమర్థవంతమైన మేనేజ్ మెంట్ ద్వారా ఎక్కువమంది ప్రజలకు టీకాలు వేయగలిగామని కామెంట్ చేశారు. కచ్చితమైన నిర్వహణ ద్వారా దాదాపు 11 లక్షల వ్యాక్సిన్ డోసులు ఆదా చేసినట్టు వివరించారు. ఐదేళ్ల లోపు పిల్లలు ఉన్న తల్లులు అందరికీ 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, కొవిడ్ టాస్క్ ఫోర్స్ సభ్యులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే.