MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/akkineni-akhil-new-movie-4bf0c95c-cdb9-4a16-b800-41be07835dd1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/akkineni-akhil-new-movie-4bf0c95c-cdb9-4a16-b800-41be07835dd1-415x250-IndiaHerald.jpgఅక్కినేని అఖిల్ కు అర్జంట్ గా హిట్ కావాలి. లేకపోతే చాలా కష్టం. వరుసగా సినిమాలకు సైన్ చేస్తున్నాడే గానీ.. ఏ సినిమా తనను సక్సెస్ బాట పట్టిస్తుందో తెలియదు. అందుకే సినిమాల్లో అదృష్టం వెతుక్కుంటున్నాడు ఈ కుర్రహీరో. మరి ఫ్లాప్ డైరెక్టర్ తో ప్లాన్ చేస్తున్న ఓ సినిమా ఎంత వరకు లక్ తీసుకొస్తుందో చూడాలి. akkineni akhil new movie {#}akhil akkineni;surender reddy;Geetha Arts;Varasudu;cinema theater;Love;Cinema;Directorఫెయిల్యూర్ డైరెక్టర్ తో సినిమా వర్కవుట్ అవుతుందా..?ఫెయిల్యూర్ డైరెక్టర్ తో సినిమా వర్కవుట్ అవుతుందా..?akkineni akhil new movie {#}akhil akkineni;surender reddy;Geetha Arts;Varasudu;cinema theater;Love;Cinema;DirectorTue, 20 Jul 2021 09:01:11 GMTఅక్కినేని వారసుడు అఖిల్ లక్ కోసం ఎదురు చూస్తున్నాడు. వరుస సినిమాలు చేస్తూ తన టాలెంట్ ఏంటో ప్రేక్షకుల ముందు నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటి వరకు తాత, తండ్రి, అన్న.. నడిచిన బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నాడు. ఇంత వరకు హిట్ కొట్టని ఈ కుర్ర హీరో.. హిట్ ట్రాక్ ఎక్కేందుకు తెగ కష్టపడుతున్నాడు. కొత్త కొత్తగా ట్రై చేస్తూ ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేపుతున్నాడు.

అక్కినేని అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుదల తేదీ ఇప్పటి వరకు తెలియదు. కానీ ఈ లోపే తెరకెక్కాల్సిన చిత్రాల లిస్ట్ పెరిగిపోతోంది. తాజాగా ఈ జాబితాలోకి మరో సినిమా వచ్చి చేరింది.  వరుసగా ఓటమి చవిచూసిన దర్శకుడితో అఖిల్ ప్రాజెక్ట్ ఉంటుందట.  హీరోగా అఖిల్ ఇంకా నిరూపించుకోలేదు. కథల ఎంపికలో ఖచ్చిమైన డెసిషన్ లు తీసుకోలేకపోతున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో తీసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుదలపై ఇంకా స్పష్టతలేదు. ఇదిలా ఉంటే సురేందర్ రెడ్డితో మరో యాక్షన్ సినిమాకు సిద్ధమైపోయాడు.  ఈ డైరెక్టర్ గత చిత్రాల మేకింగ్ పరిశీలిస్తే ఎంతో స్టయిలిష్ గా ఉంటుంది. ఆ లుక్ కు ఏమాత్రం తీసిపోని విధంగా అఖిల్ తో యాక్షన్ ప్యాక్ విత్ లవ్ ఫ్లేవర్ ను దించుతానని నాగ్ కు మాట ఇవ్వడంతో సినిమాకు ఒకే చెప్పాడు.

అక్కినేని వారసుడు తాజాగా సురేందర్ రెడ్డి సినిమా అయ్యే వరకు ఆగలేకపోతున్నాడు. పోటీలో తాను ఎక్కడ వెనక పడిపోతానో అనే భయంలో ఉన్నాడు. దీనికి తోడు ప్రాజెక్టుల ఎంపికలో అఖిల్ మరింత లేట్ చేస్తున్నాడనే టాక్ ఉంది. అందుకే సినిమా సినిమాకు గ్యాప్ ఎక్కువగా ఉండకూడదని  భావిస్తున్నాడట. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయన హను రాఘవపూడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ థియేటర్ లేదా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది.  ఆ సినిమా వచ్చాక అఖిల్ కంటూ ఖచ్చితంగా ఓ ఇమేజ్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.  ఎందుకంటే ఆ సినిమాను స్వయానా గీతా ఆర్ట్స్ నిర్మించింది. గతంలో చైతూను కూడా గాడిలో పెట్టింది గీతా బ్యానరే. కాబట్టి అఖిల్ ఫ్యూచర్ పై కొంత కాన్ఫిడెంట్ గాన ఉంది అక్కినేని ఫ్యామిలీ.

 



వరుసగా దూసుకుపోతున్న రష్మీక.. సమంత, కాజల్..?

తరుణ్ భాస్కర్ ఎదురు చూపులతోనే సరిపెడుతున్నాడే..!!

షూటింగ్ లో గాయపడ్డ స్టార్ హీరోయిన్... తలకు గాయం!

స్విట్జ‌ర్లాండ్‌లో తొలి తెలుగు సినిమా షూటింగ్‌... మెగాస్టార్‌దే ఆ క్రెడిట్ ?

అంతరిక్షంలోకి అమెజాన్ మాజీ చీఫ్ జెఫ్ బెజోస్...

చిరంజీవిని మెగాస్టార్‌ను చేసింది ఆ సినిమాయే ?

ఎండీ సీటు నుంచి ఎందుకు తప్పుకున్నారో..?

వెంకీ నటించిన రీమేక్ సినిమాలెన్నో తెలుసా?

సురేష్ బాబు మాటలకు అర్థాలు వెతుకుతున్న ఎగ్జిబ్యూటర్స్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>