MoviesPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tollywood62dc840b-a67c-458f-8340-6d6bfd31bd7a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tollywood62dc840b-a67c-458f-8340-6d6bfd31bd7a-415x250-IndiaHerald.jpgదిల్ రాజు బ్యాన‌ర్‌లో శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్ర‌స్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ ప‌నులు కొనసాగుతున్నాయి. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం మెగా అభిమానులు ఎంత‌లా ఎదురు చూస్తున్నారో అంతే ఆతృత‌గా శంకర్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సినిమా టెక్నీషియన్ ఎంపిక చేయడంతో పాటు న‌టీ న‌టుల‌ను కూడా సెలెక్ట్‌ చేస్తున్నారు. అయితే ఈ భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ ను అతిత్వరలో ప్రారంభించేందుకు TOLLYWOOD{#}dil raju;Okkadu;Ram Charan Teja;ram pothineni;king;Industry;India;Telangana Chief Minister;shankar;Audience;News;Cinemaసీఎంగా క‌న‌బ‌డ‌నున్న మెగా హీరో..?సీఎంగా క‌న‌బ‌డ‌నున్న మెగా హీరో..?TOLLYWOOD{#}dil raju;Okkadu;Ram Charan Teja;ram pothineni;king;Industry;India;Telangana Chief Minister;shankar;Audience;News;CinemaMon, 19 Jul 2021 12:01:09 GMTదిల్ రాజు బ్యాన‌ర్‌లో శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్ర‌స్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ ప‌నులు కొనసాగుతున్నాయి. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం మెగా అభిమానులు ఎంత‌లా ఎదురు చూస్తున్నారో అంతే ఆతృత‌గా శంకర్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సినిమా టెక్నీషియన్ ఎంపిక చేయడంతో పాటు న‌టీ న‌టుల‌ను కూడా సెలెక్ట్‌ చేస్తున్నారు.

 అయితే ఈ భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ ను అతిత్వరలో ప్రారంభించేందుకు సినిమా మేకర్స్‌ పని చేస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఇదే సమయంలో ఈ సినిమా గురించి రోజుకో వార్త సినిమా వ‌ర్గాల్లో చక్కర్లు కొడుతోంది. శంకర్ సినిమా అంటే సోషల్ మెసేజ్ ఉంటుందని ప్రేక్షకులు నమ్ముతారు. ఇదే విధంగా ఈ సినిమా కూడా సోష‌ల్ ఫాంట‌సీగా వ‌స్తుంద‌ని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి మెసేజ్ ను కూడా ఇవ్వ‌బోతున్న‌ట్టు స‌మాచారం.  

శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ యువ ముఖ్య‌మంత్రిగా కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకే ఒక్కడు సినిమా త‌ర‌హా రామ్ చ‌ర‌ణ్ సినిమా క‌థ‌ ఉంటుందని ప్రచారం సాగుతోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న ఈ సినిమా చరణ్ పాత్ర యువతను ఆకట్టుకునే విధంగా ఉంటుందని తెలుస్తోంది. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ కు ఇది ఒక ప్రత్యేకమైన సినిమా నిలువ‌బోతున్న‌ట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న విధంగా చూస్తే రామ్‌చ‌ర‌ణ్‌ను సీఎంగా చూపిస్తే ఇది మరోక్క క‌మ‌ర్షియ‌ల్ సినిమాగా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

   ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన ఓ వ్య‌క్తి ప్ర‌భుత్వ ఉద్యోగంలో చేస్తున్న మంచి ప‌నుల వ‌ల్ల అనూహ్యంగా ముఖ్యమంత్రి అవుతాడ‌నే కోణంలో ఈ సినిమా స్టోరీ ఉండ‌నున్న‌ట్టు దిల్ రాజు కాంపౌండ్ నుంచి స‌మాచారం అందుతోంది. ఈ సినిమాను తెలుగు, త‌మిళ్ భాష‌ల్లోనే కాకుండా పాన్ ఇండియా సినిమాగా నిర్మించ‌బోతున్నారు. పాన్ ఇండియా సినిమాగా విడుద‌ల కావ‌డంతో పాటు భారీగా వ‌సూళ్ల‌ను సాధిస్తుంద‌నే న‌మ్మ‌కాన్ని ఆ సినిమా మేక‌ర్స్ వ్య‌క్తం చేస్తున్నారు. శంక‌ర్ సినిమా అంటే ఏండ్లుగా షూటింగ్ కొన‌సాగుతుంద‌నే టాక్ ఉన్న నేప‌థ్యంలో రామ్‌చ‌ర‌ణ్ సినిమా త్వ‌రగా పూర్తి చేస్తార‌నే స‌మాచారం ఉంది.



రామ్, రామ్ చరణ్.. ఇద్దరు ఒకే కథను చేయట్లేదు కదా!!

బర్త్ డే స్పెషల్: ఒక ఇంజనీర్ ఇండియన్ చార్లీ చాప్లిన్ ఎలా ?

ఇంట్లో నుంచి ఏ వయసులో సిల్క్ పారిపోయిందో తెలుసా ?

మిల్కీ బ్యూటీకి ఫోన్‌ చేసిన మెగా హీరో..?

జులై 19: చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనలు..

ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడు షో అప్పుడేనా ప్రారంభం అయ్యేది?

ఆదిత్య 369 నుంచి స్పెషల్ వీడియో.!

వైకాపా నిరుద్యోగులకి జాబ్ ఇచ్చారు..మరి రాష్ట్ర నిరుద్యోగులకు.. ?

ఓపెన్ ఆఫర్ ఇచ్చి.. షాకింగ్ కామెంట్స్ చేసిన శృంగార తార..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>