PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/petrold8d70d48-9467-4619-8a92-9bc83f760872-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/petrold8d70d48-9467-4619-8a92-9bc83f760872-415x250-IndiaHerald.jpgపెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే సెంచరీ దాటేసిన పెట్రో మంట... రోజురోజుకూ పై పైకి పోతోంది. విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా... సామాన్యులు ఎంత ఇబ్బంది పడుతున్నా కూడా ఇంధన సంస్థలు మాత్రం ప్రతి రోజు పెట్రోల్, డీజిల్ ధరలను పైసా పైసా చొప్పున పెంచేస్తున్నాయి. ఎప్పుడో అమావాస్యకో.. పౌర్ణమికో ఓ పది పైసలు తగ్గిస్తున్నప్పటికీ.... తెల్లారే మళ్లీ బాదుడు మొదలవుతోంది. అటు గ్యాస్ బాదుడు కూడా ప్రతి 15 రోజులకు ఓ సారి పెరుగుతూనే ఉంది.Petrol{#}Narendra Modi;Diesel;oil;INTERNATIONAL;Petrol;Bharatiya Janata Party;Prime Ministerవైరల్ అవుతున్నపెట్రోల్ బంక్ ఫోటోలువైరల్ అవుతున్నపెట్రోల్ బంక్ ఫోటోలుPetrol{#}Narendra Modi;Diesel;oil;INTERNATIONAL;Petrol;Bharatiya Janata Party;Prime MinisterMon, 19 Jul 2021 16:12:12 GMTపెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే సెంచరీ దాటేసిన పెట్రో మంట... రోజురోజుకూ పై పైకి పోతోంది. విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా... సామాన్యులు ఎంత ఇబ్బంది పడుతున్నా కూడా ఇంధన సంస్థలు మాత్రం ప్రతి రోజు పెట్రోల్, డీజిల్ ధరలను పైసా పైసా చొప్పున పెంచేస్తున్నాయి. ఎప్పుడో అమావాస్యకో.. పౌర్ణమికో ఓ పది పైసలు తగ్గిస్తున్నప్పటికీ.... తెల్లారే మళ్లీ బాదుడు మొదలవుతోంది. అటు గ్యాస్ బాదుడు కూడా ప్రతి 15 రోజులకు ఓ సారి పెరుగుతూనే ఉంది. ఓ వైపు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ... దేశంలో పెట్రోల్ ధర మాత్రం... సామాన్యుడిని బుగ్గిపాలు చేస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధర 106 రూపాయలు దాటేసింది. గతంలో వంద రూపాయలకు రెండు లీటర్ల పెట్రోల్ కొట్టించుకున్న వారు... ఇప్పుడు ఒక లీటర్ కూడా రావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంధన బాదుడుతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సామాన్యులు.... పెట్రోల్ బంకుల్లో తమ నిరసనను విచిత్రంగా తెలియజేస్తున్నారు. ప్రతి పెట్రోల్ బంకులో కూడా ప్రధాని నరేంద్ర మోదీ పేరుతో ఫ్లెక్సీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలనేది రూల్. మోదీ నవ్వుతూ ఉన్న ఫోటోతో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఇప్పటికే అన్ని పెట్రోల్ బంకుల్లో ఉన్నాయి కూడా. పెట్రో మంటతో తీవ్ర ఆగ్రహంవ్యక్తం చేస్తున్న సామాన్యులు... సెంచరీ దాటిన పెట్రోల్ ధరపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాబోయ్ ఈ బాదుడు మాకొద్దు అంటూ... మోదీ ఫ్లెక్సీకి దండం పెడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. బాబోయ్ నీకు ఓటు వేసి తప్పు చేశామంటూ కొందరు పోస్టింగ్ చేస్తుంటే... విపక్షాలు మాత్రం బీజేపీ హటావో... దేశ్ కో బచావో అంటూ... ఆ ఫోటోలను ట్రోల్ చేస్తున్నారు. మరికొందరేమో... ఆదాయం తగ్గింది... ఖర్చు పెరిగిందంటున్నారు. ప్రజలకు ఇచ్చే సబ్సిడీని పెట్రోల్ రూపంలో పిండేస్తున్నారా మోదీ సార్ అంటూ సోషల్ మీడియాలో ఏకి పారేస్తున్నారు. ఏది ఏమైనా... ఎవరైనా ఒక ఫన్నీ ఫోటో పోస్ట్ చేస్తే... దాని వెనకే అలాంటి ఫోటోలు వచ్చేస్తున్నాయి ఈ సోషల్ మీడియాలో. దీనికి బీజేపీ సర్కార్ ఏ రకంగా సమాధానం చెప్తుందో చూడాలి మరి.



తెలంగాణ వివాదాస్పద ఐపీఎస్ అధికారి రాజీనామా ?

సిద్ధార్థ్ చ‌నిపోయ‌డంటూ వీడియో...షాకైన హీరో.. !

పాదయాత్రనా..! పంపకాల యాత్రనా..?

ప్రచారంకోసం మోదీ సెల్ఫ్ గోల్.. మరీ ఇంత దారుణంగానా..?

రాజ్యసభలో రగడ చేసిన వైసీపీ

పార్లమెంట్ లో అదే సీన్ రిపీట్

హుజురాబాద్ బరిలో కాంగ్రెస్ తరఫున మాజీ పోలీస్ ఆఫీసరేనా...?

రాజ్య‌స‌భ వెల్‌లోకి దూసుకెళ్లిన విజ‌య‌సాయిరెడ్డి

పంజాబ్ కాంగ్రెస్ లో రగడ తప్పదా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>