ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viralf49dd494-a964-4e2e-ad3e-df1b36dbf251-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viralf49dd494-a964-4e2e-ad3e-df1b36dbf251-415x250-IndiaHerald.jpgఓ దొంగ కారును దొంగిలించి దాన్ని ఎత్తుకెళ్లడమే కాకుండా నేరుగా దాన్ని రైల్వే స్టేషన్‌లోకి తీసుకెళ్లాడు. అయితే అతడు రైల్వే ప్లాట్‌ఫాంపై ఆ కారుని నడపలేదు. ఏకంగా రైలు పట్టాల పైనే దూసుకెళ్లాడు. పోలీసులను తెగ ముప్పుతిప్పలు పెట్టాడు. యూకేలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.లండన్‌లోని చెషుంట్ రైల్వే స్టేషన్‌లో రైలు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులకు రైలు పట్టాల మీద రేంజ్ రోవర్ కారు కనిపించింది. హాలీవుడ్ సినిమా రేంజిలో రైల్వే ట్రాక్ మీద పరుగులు పెడుతున్న ఆ కారును చూసి ప్రయాviral{#}Cinema;police;Hollywood;Car;Thief;Donga;Athaduరైలుపట్టాలపై కారు నడిపిన దొంగ.. నెట్టింటా వైరల్..రైలుపట్టాలపై కారు నడిపిన దొంగ.. నెట్టింటా వైరల్..viral{#}Cinema;police;Hollywood;Car;Thief;Donga;AthaduMon, 19 Jul 2021 23:00:00 GMTదొంగ కారును దొంగిలించి దాన్ని ఎత్తుకెళ్లడమే కాకుండా నేరుగా దాన్ని రైల్వే స్టేషన్‌లోకి తీసుకెళ్లాడు. అయితే అతడు రైల్వే ప్లాట్‌ఫాంపై ఆ కారుని నడపలేదు. ఏకంగా రైలు పట్టాల పైనే దూసుకెళ్లాడు. పోలీసులను తెగ ముప్పుతిప్పలు పెట్టాడు. యూకేలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.లండన్‌లోని చెషుంట్ రైల్వే స్టేషన్‌లో రైలు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులకు రైలు పట్టాల మీద రేంజ్ రోవర్ కారు కనిపించింది. హాలీవుడ్ సినిమా రేంజిలో రైల్వే ట్రాక్ మీద పరుగులు పెడుతున్న ఆ కారును చూసి ప్రయాణికులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అది కలా నిజమా  లేదా ఏదైనా సినిమా షూటింగా? అని అనుకునే లోపు పోలీసులు ఆ కారును వెంబడిస్తూ కనిపించారు. అది నిజమైన ఘటనేనని ఓ దొంగ కారును దొంగతనం చేసి పట్టాలపైకి దూసుకెళ్లాడనే సంగతి తెలిసి అక్కడ అందరూ కూడా షాకయ్యారు.

కొద్ది నిమిషాల తర్వాత ఆ దొంగ ఆ కారును ట్రాక్ మీదే వదిలేసి పారిపోయాడు. చివరికి పోలీసులు అతడిని చేజ్ చేసి చివరకు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆ సమయంలో రైలు రాకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.లేకపోతే అక్కడ పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది.ఆ కారు ఇక ట్రాక్ మీదకు రాగానే రైల్వే అధికారులు దెబ్బకి అప్రమత్తయ్యారు. వెంటనే అక్కడ రైళ్లను ఎక్కడికక్కడ నిలిపేశారు. దీంతో రైళ్ల రాకపోకలకు కొంచెం అంతరాయం ఏర్పడింది. కారును ట్రాక్ మీద నుంచి తొలగించిన తర్వాతే రైలు సేవలను కొనసాగించారు.ఇక ఆ దొంగ రైల్వే ట్రాక్ మీద దూసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోని సుమారు 2.8 మిలియన్ మందికి పైగా వీక్షించారు. ఇక వైరల్ అవుతున్న ఆ వీడియోను మీరు కూడా చూసేయండి మరి.



రామ్ మూవీలో విలన్ గా ఆ యంగ్ హీరో

ధనుష్ ఆ విషయంలో మహేష్ ని బీట్ చేయగలడా..?

సినిమాలను వదిలేస్తా అని వెక్కి వెక్కి ఏడ్చిన సాయి పల్లవి.. అసలేం జరిగిందంటే..?

శంకర్ ఛాన్స్ ఇచ్చాడు సరే తమన్ నిలబెట్టుకుంటాడా..?

బాలీవుడ్ లో అడుగుపెట్టనున్న బన్నీ?

ఇంకా పోలీస్ స్టేష‌న్‌లోనే విద్యార్థి సంఘాల నేత‌లు

బండ్ల గణేష్ నిర్మాతగా స్టార్ హీరో మూవీ ?

భర్త చనిపోవటంతో మామ ఆస్తిపై కన్నేసిన కోడలు..చివరకి..!

నితిన్ 'మ్యాస్ట్రో' కూడా ఓటిటిలోనే.. ఎప్పుడో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>