PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ktr3f36cda9-2ca0-453e-b6c3-a767855ffe2f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ktr3f36cda9-2ca0-453e-b6c3-a767855ffe2f-415x250-IndiaHerald.jpgకేంద్ర ప్రభుత్వం ఏటా ఎన్నో ఉద్యోగాలు భర్తీ చేస్తుంటుంది. వీటిలో కొన్ని యూపీఎస్సీ ద్వారా.. మరికొన్ని ఎస్ఎస్‌సీ బోర్డు ద్వారా భర్తీ చేస్తుంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలన్నీ అయితే ఇంగ్లీష్‌లోనో.. లేకుంటే హిందీలోనో రాయాల్సి ఉంటుంది. అంతే తప్ప.. స్థానిక భాషల్లో ప్రశ్నాపత్రాలు ఉండవు. దక్షిణాది వారికి హిందీ పెద్దగా రాదు. దీని వల్ల ప్రత్యేకించి దక్షిణ భారత విద్యార్థులు ఎక్కువగా నష్టపోతున్నారు. జాతీయ స్థాయి నియామక సంస్థలైన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, రైల్వే నియామక సంస్థ, భారతీయ రిజర్వు బ్KTR{#}students;KTR;local language;Government;police;Letter;Hindi;central government;Ministerకేటీఆర్‌ కృషి ఫలిస్తే.. దక్షిణాది నిరుద్యోగులకు పండగే..?కేటీఆర్‌ కృషి ఫలిస్తే.. దక్షిణాది నిరుద్యోగులకు పండగే..?KTR{#}students;KTR;local language;Government;police;Letter;Hindi;central government;MinisterMon, 19 Jul 2021 10:00:00 GMTకేంద్ర ప్రభుత్వం ఏటా ఎన్నో ఉద్యోగాలు భర్తీ చేస్తుంటుంది. వీటిలో కొన్ని యూపీఎస్సీ ద్వారా.. మరికొన్ని ఎస్ఎస్‌సీ బోర్డు ద్వారా భర్తీ చేస్తుంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలన్నీ అయితే ఇంగ్లీష్‌లోనో.. లేకుంటే హిందీలోనో రాయాల్సి ఉంటుంది. అంతే తప్ప.. స్థానిక భాషల్లో ప్రశ్నాపత్రాలు ఉండవు. దక్షిణాది వారికి హిందీ పెద్దగా రాదు.  దీని వల్ల ప్రత్యేకించి దక్షిణ భారత విద్యార్థులు ఎక్కువగా నష్టపోతున్నారు. జాతీయ స్థాయి నియామక సంస్థలైన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, రైల్వే నియామక సంస్థ, భారతీయ రిజర్వు బ్యాంకు, ప్రభుత్వరంగ సంస్థ బ్యాంకులు, యూపీఎస్సీ ఇతర పరీక్షలను కేవలం ఇంగ్లీష్,  హిందీ భాషల్లో నిర్వహించడం దక్షిణాది వారికి నష్టం చేస్తోంది.


ఇప్పుడు ఈ విషయంపై మంత్రి కేటీఆర్ దృష్టిసారించారు. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌, ఇతర నియామక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే అన్నిరకాల పోటీ పరీక్షలకు ప్రాంతీయ భాషల్లో పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు మంత్రి కేటీ రామారావు కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్రసింగ్‌కు కేటీఆర్లేఖ రాశారు.


తెలుగు సహా ఇతర భాషల్లోనూ యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌, ఇతర నియామక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే అన్నిరకాల పోటీ పరీక్షలు నిర్వహించాలని కేటీఆర్ కోరారు. ప్రస్తుత విధానంలో  ప్రాంతీయ భాషలను అనుమతించకపోవడం వల్ల కొన్ని రాష్ట్రాల అభ్యర్థులు ఉద్యోగాలను పొందలేకపోతున్నారని మంత్రి కేటీఆర్‌ తన లేఖలో తెలిపారు. ఇటీవల కేంద్ర సాయుధ పోలీసు పోలీసు బలగాల ద్వారా కానిస్టేబుల్‌ నియామకాలు, ఎన్‌ఐఏ, ఎస్‌ఎస్‌ఎఫ్‌, అసోం రైఫిల్‌మెన్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్‌లో హిందీ, ఇంగ్లీష్‌లోనే పరీక్షలు రాయాలనే రూల్ పెట్టారు.


ఈ విషయాన్ని కేటీఆర్ తన లేఖలో ప్రస్తావించారు. ఇలాంటి నిబంధనల వల్ల హిందీయేతర రాష్ట్రాల విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతోందన్నారు. అందుకే హిందీ, ఆంగ్లంతో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్షలు నిర్వహించాలని మంత్రి కేటీఆర్‌ తన లేఖలో కోరారు. జాతీయ స్థాయి నియామకాలకు  12 ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహించాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం అమలు కావడం లేదని గుర్తు చేశారు.



నేడే ఈట‌ల పాద‌యాత్ర షురూ.. !

వాహన దారులకు గుడ్ న్యూస్..?

రేవంత్‌ రెడ్డి హౌస్‌ అరెస్ట్‌..!

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌, ఇతర నియామక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే అన్నిరకాల పోటీ పరీక్షలకు ప్రాంతీయ భాషల్లో పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని మంత్రి కేటీఆర్ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు మంత్రి కేటీ రామారావు కేంద్రానికి లేఖ రాశారు.

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌, ఇతర నియామక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే అన్నిరకాల పోటీ పరీక్షలకు ప్రాంతీయ భాషల్లో పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని మంత్రి కేటీఆర్ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు మంత్రి కేటీ రామారావు కేంద్రానికి లేఖ రాశారు.

ఈటల ఓటమి ఖాయం..మరో స్కెచ్‌ వేసిన కేసీఆర్‌ ?

సభ సజావుగా సాగేనా..

అల్లు అర్జున్ ఏం చేసిన ఒక్క లెక్క ఉంటుంది.. !?

ఏంటి కేంద్ర కేబినెట్ లో ఆ స‌హాయ మంత్రి విదేశియుడా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>