EditorialLAXMANeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/human-freedom-in-the-shackles-of-government6b0e0caa-33a2-4185-abee-3da249bc9bf4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/human-freedom-in-the-shackles-of-government6b0e0caa-33a2-4185-abee-3da249bc9bf4-415x250-IndiaHerald.jpgరాజ్యాంగం కల్పించిన భావప్రకటన, స్వేచ్ఛ వంటివాటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హరిస్తున్నాయా? అంటే జరుగుతున్న పరిణామ క్రమాన్నిబట్టి అవుననే చెప్పవచ్చు. సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతున్న వేళా .. ఈ మధ్యకాలం రాజకీయ నాయకులు నుంచి సీనియర్ జర్నలిస్ట్ లకు వరకు అందుకున్న ఒకేఒక రాగం.. మా ఫోన్ హ్యాకింగ్ కు గురౌతున్నాయన్న పదం. నిజంగా ఫోన్లను ట్యాపింగ్ చేయవచ్చా? ఫోనుల్లో ఉన్న సమాచారాన్ని యూజర్ అనుమతి లేకుండా, అసలు వారికి తెలియకుండానే తెఫ్ట్ జరిగిద్దా? అంటే జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే అవుననే HUMAN FREEDOM IN THE SHACKLES OF GOVERNMENT{#}Telugu Desam Party;Israel;Survey;News;central government;INTERNATIONAL;zero;AB Venkateswararao;Hanu Raghavapudi;Apple;Smart phone;WhatsApp;India;mediaప్రభుత్వాల కబంధ హస్తాల్లో మానవుని స్వేచ్ఛప్రభుత్వాల కబంధ హస్తాల్లో మానవుని స్వేచ్ఛHUMAN FREEDOM IN THE SHACKLES OF GOVERNMENT{#}Telugu Desam Party;Israel;Survey;News;central government;INTERNATIONAL;zero;AB Venkateswararao;Hanu Raghavapudi;Apple;Smart phone;WhatsApp;India;mediaMon, 19 Jul 2021 18:24:45 GMTరాజ్యాంగం కల్పించిన భావప్రకటన, స్వేచ్ఛ వంటివాటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హరిస్తున్నాయా? అంటే జరుగుతున్న పరిణామ క్రమాన్నిబట్టి అవుననే చెప్పవచ్చు.
సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతున్న వేళా .. ఈ మధ్యకాలం  రాజకీయ నాయకులు నుంచి సీనియర్ జర్నలిస్ట్ లకు వరకు అందుకున్న ఒకేఒక రాగం.. మా ఫోన్ హ్యాకింగ్ కు గురౌతున్నాయన్న పదం. నిజంగా ఫోన్లను ట్యాపింగ్ చేయవచ్చా? ఫోనుల్లో ఉన్న సమాచారాన్ని యూజర్ అనుమతి లేకుండా, అసలు వారికి తెలియకుండానే  తెఫ్ట్ జరిగిద్దా? అంటే జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. టెక్నికల్ గా ఇది ఎలా సాధ్యపడుతోంది? దేని ఆధారంతో ట్యాపింగ్ జరుతోందని అన్న దాని గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఇజ్రాయిల్ ఎన్ఎస్ఓ( NSO)రూపొందించిన పెగసాస్ గురించి తెలుసుకోవాలి. దీనినే స్పైవేర్ అనికూడా పిలుస్తారు. అసలు ఈ పెగసాస్ ఎలా పనిచేస్తోంది? పెగసాస్ సెల్ ఫోన్స్ ను ఏవిధంగా ప్రభావితం చేస్తుందో చూద్దాం..

ఇజ్రాయిల్ ఎన్ఎస్ వో సంస్ధ రూపొందించిన పెగసాస్ ను సైబర్ ఆయుధంగా భధ్రత పరిశోధకులు అభివర్ణిస్తుంటారు. ఈ పెగసాస్ ను ప్రపంచ వ్యాప్తంగా భారత్ తో సహా అన్ని దేశాలు విరివిగా వినియోగిస్తున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ పెగసాస్ ద్వారా ప్రస్తుతం ఉగ్రకార్యకలపాలను, దేశానికి పొంచిన ఉన్న ప్రమాదాలు, జీరో క్రైం, ప్రభుత్వాలకు తలెత్తె ముప్పు వంటివాటి నుంచి భద్రతను కట్టుదిట్టం చేయాడానికి 2016 నుంచి ఈ పెగసాస్ స్పైవేర్ ను కొన్ని దేశాల వారు వినియోగిస్తున్నారు. అయితే కొన్ని జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్ధలు, స్వచ్ఛంధ సర్వే సంస్ధలు వెల్లడించిన నివేదికల ప్రకారం భారత్ తో సహా మరో 10 దేశాల్లో పెగసాస్ ద్వారా మానవహక్కులను నిలువున హరిస్తున్నారని బహిర్గతమవుతున్నాయి. పైగా ఈ పెగసాస్ విరివిగా వినియోగిస్తూ రాజకీయ నాయకులు, సీనియర్ జర్నలిస్టులు, సామాజిక ఉద్యమకారులకు సంబంధించిన లక్షలాదిమంది వాడే స్మార్ట్ ఫోన్స్ నుంచి డేటాను సంగ్రహించడానికి ఈ స్పైవేర్ ను వినియోగిస్తున్నారని ఆరోణలు మిన్నంటుతున్నాయి. తద్వారా అత్యంత అధునాతన సాంకేతికను అప్డేట్ చేసుకుంటూ ముందుకుపోతున్న ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ సంస్ధ (ఎన్ఎస్ఓ) కొంత అపకీర్తిని మూటకట్టుకుంటుదని వాదనలు లేకపోలేదు.

పెగసాస్ ను విరివిగా వాడుతున్న దేశాల్లో మానవ హక్కుల ఉల్లంఘన పెద్దఎత్తున జరుగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  కొన్ని దర్యాప్తు సంస్ధల విశ్లేషణలు ద్వారా పెగసాస్ సోకిన ఫోన్ ల డేటా ఏవిధంగా చోరికి గురౌతుందో ఆధారాలతో సహా బహిర్గతం చేస్తున్నాయి. 2016 ప్రారంభంలో పెగసాస్ విసృంఖలుగా తన స్పైవేర్ ను విస్తరించుకుంటుపోతున్న తరుణంలో తమ సర్వర్లును పటిష్టం చేసుకోవడంలో గూగుల్, వాట్సప్, ఆపిల్ వంటి దిగ్గజ సంస్ధలు నిమగ్నమైనప్పటికీ, పెగసాస్ దాడిని తట్టుకోలేక సరెండర్ అయిన పరిస్ధితులు కూడా లేకపోలేదు. దిగ్గజ సాంకేతిక నిపుణలకు ఒక అడుగు ముందుంటూ.. ఆయా సంస్ధలే పెనుసవాళ్లు విసురుతూ తన స్వాఫ్ట్వేర్ ను అప్డేట్ చేసుకుంటూ ఇజ్రాయెల్ ఎన్ఎస్ఓ ముందుకు పోయిందని సాంకేతిక నిపుణులు వివరిస్తున్నారు.

తొలినాళ్లల్లో పెగసాస్ ను స్మార్ట్ ఫోన్స్ లోకి చొప్పించాలంటే స్పియర్ - ఫిషింగ్ లింక్ ద్వారా ఒక బోగస్ టెక్ట్ సందేశాన్ని మెసెజ్స్ లేదా మెయిల్ పంపుతారు. ఆ లింక్ ను క్లిక్ చేయ్యగానే ఫోన్ ఆటోమెటిక్ గా హ్యాక్ అవుతోంది. అయితే ప్రస్తుతం గడిచిన ఐదేళ్ల అనేక రకాలుగా పెగసాస్ ను ఆధునీకరించారు. ఇప్పుడు కొత్తపద్దతి ద్వారా ఎటువంటి లింక్స్ ను ఫోనులకు పంపించాల్సిన పనిలేకుండా ఫోన్స్ ను ట్రాప్ చేసేలా సాఫ్ట్వేర్ ను అభివృద్ధి పరిచారు. దీనినే జీరో- క్లిక్ దాడి అని సైబర్ నిపుణులు పిలుస్తారు.  2019 లో జరిగిన అతిపెద్ద సైబర్ దాడిని ఇందుకు ఉదాహరణ గా చెప్పుకొవచ్చు. ఒక్క వాట్సప్ కాల్ ద్వారా 1400 ఫోన్లకు ఈ పెగసాస్ ను చొప్పించబడిందని వాట్సప్ అప్పట్లో ఆరోపించింది. దీనిపై అమెరికాలో ఎన్ఎస్ఓ గ్రూప్ పై కేసు కూడా పెట్టింది వాట్సప్. సాఫ్ట్వేర్ కంపెనీలు, సామాజీక మాధ్యమాలు, ప్రచార సంస్ధల్లో భద్రత లోపాలను కనిపెట్టి, అందులో పెగసాస్ ను చొప్పించి సమాచారాన్ని వ్యక్తుల ప్రమేయం లేకుండా ఏవిధంగా చోరికి గురౌతుందో అన్న విషయాలను పలు అంతర్జాతీయ దర్యాప్తు సంస్ధలు నివేధికలిచ్చాయి.  అమ్నెస్టీ ఇంటర్నేషనల్ చేసిన సర్వేల్లో పెగసాస్ ఫోన్ లోకి ఎంటర్ కాగానే వినియోగదారుడి నుంచి ఎటువంటి ఆదేశాలు ఇవ్వకుండానే ఫోన్ లోని ఇమేజేస్, మెసేజ్స్ కాపీ - పెస్ట్ వంటివి ఆటోమ్యాటిక్ గా  జరిగిపోతాయని చెప్పుకొచ్చింది. అలానే ఫోన్ వినియోగదారుడు ప్రస్తుతం ఎక్కడున్నాడు, గతంలో ఏఏ ప్రదేశాల్లో తిరిగాడు అన్న సమాచారాన్ని ఎంతో ఖచ్చితత్వంతో అందిస్తోంది. అంతేకాక ఫోన్లో వాడుతున్న సోషల్ మీడియా మేసేజ్ లన్నీంటిని ట్రాక్ చేసి సమాచాన్ని బదిలీ చేస్తోంది.

ఇలా ఉగ్రవాదులు, నేరస్తుల యాక్టీవిటిస్ పై ప్రయోగిస్తే జాతీ ప్రయోజనాలకు ఎంతాగానో దోహదపడతాయి. అంతేకానీ సామాన్య ప్రజలు, ప్రతిపక్ష రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులపై దీనిని ప్రయోగించడం ఎంతవరకు సబబు అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. చట్ట ప్రకారం చూస్తే ఫోన్ ట్యాపింగ్ నేరం,స్వేచ్చను హరిచడం అని కూడా అంటారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇజ్రాయెల్ అధునాతన పరిజ్ఞాన్ని వినియోగించి ఎంతో మంది ఫోన్లను ట్యాపింగ్ చేస్తోందని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. అందుకు నిదర్శనమే తెలుగుదేశం ప్రభుత్వం హయంలో ఏబీ వెంకటేశ్వరరావు వాడిని తెఫ్టింగ్ టెక్నాలజీ! దీనిపై అప్పట్లో కేసు కూడా నమోదైయిన సంగతి విధితమే. ఇలా ప్రభుత్వాలను, వ్యక్తులను, అంతర్జాతీ నిఘా సంస్ధలను నిందిచడంకన్నా మన జీవితాలు ఎప్పుడో స్మార్ట్ ఫోన్లకు దారపోశామని, మన ప్రతి కదలికలు, ముఖ్యమైన వ్యక్తిగత సమాచారం అంతా ఎప్పుడో హ్యాకింగ్ గురైందని మెంటల్ గా ఫిక్స్ అవ్వడం మంచిదని భావించకతప్పదు. కాకుంటే నిఘానీడ పేరుతో ప్రభుత్వాలు చేస్తున్న గూఢచర్యం సామాన్య ప్రజానీకానికి శాపంగా మారకూడదు. ఇటువంటి సంకేతికత స్వార్ధ ప్రయోజనాల వినియోగించబడితే ఎంత ప్రమాదకరమో వినియోగించిన వారికే మున్ముందు బోధపడతోందని అభిప్రాయాలు లేకపోలేదు.



మొదటి బంతి సిక్సర్.. అసలు సీక్రెట్ బయట పెట్టిన ఇషాన్ కిషన్?

ప్రభుత్వ కబంధ హస్తాల్లో మానవుని స్వేచ్ఛ!

డీపీఆర్ ఇవ్వడానికి మేం రెడీ: తెలంగాణా

నన్ను చంపడానికి మంత్రి కుట్ర.. ఈటెల షాకింగ్ కామెంట్స్?

నన్ను చంపడానికి మంత్రి కుట్ర.. ఈటెల షాకింగ్ కామెంట్స్?

బాలకృష్ణ పై సంచలన వ్యాఖ్యలు చేసిన జోష్ రవి..!

కేంద్ర ప్ర‌భుత్వం వీళ్ల ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తోందా... సంచ‌ల‌న నిజాలు ?

స్టార్ కమెడియన్ డైరక్టర్ గా మరోసారి ప్రయత్నం..!

రష్మీ, సుధీర్ పెళ్లి స్కిట్ చేస్తే ఎంత తీసుకుంటారో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - LAXMAN]]>