MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgరజినీ కాంత్ అల్లుడు అరుదైన ఘనత సాధించారు. మామను మించిన అల్లుడిగా పేరు సంపాదించుకుంటున్నారు. తాజాగా 10 మిలియన్ల మంది ఫాలోవర్స్ ను సంపాదించుకొని.. ఏ హీరోకు సాధ్యం కానిది సుసాధ్యం చేసుకున్నారు. రోజురోజుకూ అభిమానుల్లో ఆదరణను పొందుతున్న ఈ హీరో కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ లలో నటిస్తూ తన సత్తా చాటుతున్నారు. hero dhanush 10million followers{#}Akshay Kumar;Chakram;history;Hollywood;dhanush;surya sivakumar;Kollywood;Tamil;Tollywood;Hero;Director;Cinema;you tubeరజినీకాంత్ అల్లుడి వెంట కోటి మంది..!రజినీకాంత్ అల్లుడి వెంట కోటి మంది..!hero dhanush 10million followers{#}Akshay Kumar;Chakram;history;Hollywood;dhanush;surya sivakumar;Kollywood;Tamil;Tollywood;Hero;Director;Cinema;you tubeMon, 19 Jul 2021 08:00:00 GMTతమిళ స్టార్ హీరో ధనుష్‌ తమిళ హీరోల్లో ఏ హీరోకు సాధ్యం కాని అరుదైన ఘనత సాధించారు. ఆయనకు దేశంలో ఏ మాత్రం క్రేజ్ ఉందో బట్టబయలయింది. ఇప్పటికే తమిళనాట రికార్డుల సునామీతో పాటు మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌,  విజయ్‌, అజిత్‌, సూర్య హీరోలుండగా వాళ్లందరినీ మించిపోయారు. సోషల్ మీడియాలో పది మిలియన్స్ ఫాలోవర్స్ ని దాటేసి.. తనకు తిరుగులేదని నిరూపించుకుంటున్నారు.  

ఇంత ఘనత సాధించిన మొట్టమొదటి నటుడిగా ధనుష్ రికార్డు సాధించాడు. ధనుష్ కు తమిళనాట విపరీతమన అభిమానులున్నారు. ధనుష్ లో నటనే కాదు దర్శకత్వం వహించగలడు.. పాటలు రాయగలడు.. పాట పాడగలడు..నిర్మాత కూడా అంటే సర్వకళావల్లభుడు. ఇప్పటికే మారి 2సినిమాలోని రౌడీ బేబీ పాట అందరి చెవుల్లో ఇప్పటికీ మార్మోగుతోంది. యూట్యూబ్ లో అయితే 10మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించుకొని చరిత్ర సృష్టించింది. ఇప్పటిదాకా తమిళ సినీ ఏ చరిత్రలో ఏ పాట కూడా ఇంతటి ఘనత సాధించలేదు.  

హీరో ధనుష్ కోలీవుడ్ లోనే కాదు.. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ లలో కూడా నటిస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నారు. ఇలా ఆయన సినిమాలను ఆదరించే వారి సంఖ్య పెరిగిపోయింది. అలా కోట్ల మంది ఫాలోవర్స్ వచ్చి చేరారు. #10MillionFollowersForDhanush అనే అనే హ్యాష్‌ట్యాగ్‌ను పోస్ట్ చేస్తున్నారు. ధనుష్ ప్రస్తుతం నరేన్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇది ఆయకు 43వ చిత్రం. ఈ సినిమా త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకోబోతోంది. ధనుష్ బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తో కలిసి అట్రాంగి రేలో నటించారు. ఇక టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ ఖమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ధనుష్.. తన కెరీర్ ను తానే మలుచుకున్నారు. చూడటానికి అందంగా లేకపోయినా.. తన నటనతో ప్రేక్షకుల మనసు గెలుచున్నారు. ఇప్పుడు తిరుగులేని హీరోగా సినీ ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్నారు.



 





ఆ హీరో నుంచి మరొక అప్డేట్..!

అల్లు అర్జున్ ఏం చేసిన ఒక్క లెక్క ఉంటుంది.. !?

తరుణ్ భాస్కర్ కు షాక్ ఇచ్చిన వెంకటేష్ కామెంట్స్ !

అభిన‌య‌శ్రీ‌తో ఆ పాట తీయడానికి సుకుమార్ ఒప్పుకోలేదంట..!!

ఒకే బాటలో ఆ స్టార్ హీరోలు..!?

టీవీ : రష్మీ తండ్రి వాళ్లను వదిలి వెళ్ళడానికి కారణం..

బొమ్మరిల్లు సినిమా ఆ ఇద్దరిలో ఒకరు చేసుంటే..!

ఒకే ఫ్రేమ్ లో మెగా కోడలు ఉపాసన, శ్రీజ, మహేష్ భార్య నమ్రత.. నెట్టింట్లో హల్చల్..!!

గీతా ఆర్ట్స్ లో అన్నాయ్ మూవీ.. 3 పార్టుల్లో సినిమా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>