PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/teenmar-mallannab98b6f40-ec51-4331-88d8-2ab1ce33754c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/teenmar-mallannab98b6f40-ec51-4331-88d8-2ab1ce33754c-415x250-IndiaHerald.jpgతెలంగాణ తెలుగు దేశం పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. అసలు ఏపీలోనే తెలుగుదేశం పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటే.. ఇక తెలంగాణలో మరీ దారుణంగా ఉంది. ఏకంగా పార్టీ అధ్యక్షుడు ఎల్‌. రమణ టీఆర్ఎస్‌లో చేరడంతో ఇప్పుడు అధ్యక్షుడు లేని పార్టీగా మారింది. ఆ పదవిని భర్తీ చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అధ్యక్ష పదవి ఇస్తామని ఆఫర్ చేస్తున్నా.. చాలా మంది అబ్బే మాకొద్దు సుమా అని తప్పించుకుంటున్నారు. ఆ పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డికి అధ్యక్ష పదవి ఇద్దామనుకున్నారు.. కానీ.. ఆయన తనకు అంత భారం వద్దన్నteenmar-mallanna{#}ramana;Medchal;Thota Chandrasekhar;District;Sharmila;CBN;Telugu Desam Party;News;CM;Telangana;Partyటీటీడీపీరాష్ట్ర అధ్యక్షుడిగా తీన్మార్ మల్లన్న..? నిజమేనా..?టీటీడీపీరాష్ట్ర అధ్యక్షుడిగా తీన్మార్ మల్లన్న..? నిజమేనా..?teenmar-mallanna{#}ramana;Medchal;Thota Chandrasekhar;District;Sharmila;CBN;Telugu Desam Party;News;CM;Telangana;PartyMon, 19 Jul 2021 00:00:00 GMTతెలంగాణ తెలుగు దేశం పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. అసలు ఏపీలోనే తెలుగుదేశం పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటే.. ఇక తెలంగాణలో మరీ దారుణంగా ఉంది. ఏకంగా పార్టీ అధ్యక్షుడు ఎల్‌. రమణ టీఆర్ఎస్‌లో చేరడంతో ఇప్పుడు అధ్యక్షుడు లేని పార్టీగా మారింది. ఆ పదవిని భర్తీ చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అధ్యక్ష పదవి ఇస్తామని ఆఫర్ చేస్తున్నా.. చాలా మంది అబ్బే మాకొద్దు సుమా అని తప్పించుకుంటున్నారు.


పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డికి అధ్యక్ష పదవి ఇద్దామనుకున్నారు.. కానీ.. ఆయన తనకు అంత భారం వద్దన్నారు. ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలవైపు చంద్రబాబు చూస్తున్నారు. అయితే తీన్మార్ మల్లన్నకు చంద్రబాబు తెలంగాణ తెలుగు దేశం పార్టీ అధ్యక్ష పదవి ఆఫర్ చేసినట్టు వస్తున్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా తీన్మార్ మల్లన్నే ప్రకటించడం విశేషం. తీన్మార్ మల్లన్న గత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ అభ్యర్థికి చివరి వరకూ చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. చివరకు తీన్మార్ మల్లన్న ఓడిపోయినా గెలిచినంత పని చేశాడు.


గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో  గణనీయమైన ఓట్లు సాధించడంతో తీన్మార్ మల్లన్న రాజకీయ పార్టీల కళ్లలోనూ పడ్డాడు. అయితే తీన్మార్ మల్లన్న మాత్రం సొంతంగానే ముందుకు వెళ్లాలని నిర్ణయించు కున్నాడట. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండల పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్ లో తీన్మార్ మల్లన్న నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఈ విషయం ప్రకటించాడు. ఆగష్టు29 న గద్వాల్ జిల్లా అలంపూర్ జోగులాంబ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా  పాదయాత్ర ప్రారంభిస్తున్నట్టు తీన్మార్ మల్లన్న చెబుతున్నారు.


సీఎం కేసీఆర్ ను పదవి నుంచి దించేందుకు తమ పార్టీ లో చేరాలని తనకు ఆహ్వానాలు వచ్చాయని తీన్మార్ మల్లన్న చెబుతున్నాడు. తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి ఇస్తామన్నా వద్దన్నానని తీన్మార్ మల్లన్న ప్రకటించాడు. ఇక షర్మిల పార్టీపైనా విమర్శలు గుప్పించిన మల్లన్న
తెలంగాణలో పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల.. తన ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు ఎక్కడ ఉందో చెప్పాలని ప్రశ్నించాడు తీన్మార్ మల్లన్న.



ఇక బొత్స వర్గానికి చెక్ పెట్టడం కష్టమేనా...!

20 ఏళ్ల డేటింగ్ తరువాత పెళ్లి చేసుకున్న జంట...

హడలు పుట్టించిన 11 అడుగుల పాము....

బాబాయ్.. కరోనా.. మళ్లీ పంజా విప్పుతోంది..?

తీన్మార్ మల్లన్నకు చంద్రబాబు తెలంగాణ తెలుగు దేశం పార్టీ అధ్యక్ష పదవి ఆఫర్ చేసినట్టు వస్తున్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా తీన్మార్ మల్లన్నే ప్రకటించడం విశేషం.

ఒకే ఫ్రేమ్ లో మెగా కోడలు ఉపాసన, శ్రీజ, మహేష్ భార్య నమ్రత.. నెట్టింట్లో హల్చల్..!!

కుటుంబానికి రూ.10లక్షలు.. డైరెక్ట్ గా బ్యాంక్ ఖాతాలో..!

రూ.100 ఇస్తే దానికి ఓకే .. మహిళా మంత్రి ఆఫర్..!

ఆచార్య‌లో ఆ రెండు పార్టీల‌ను టార్గెట్ చేసిన మెగాస్టార్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>