MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/rajendara-prasad-birthday-specialb568a5a6-5589-4b67-8254-39b6d5bca931-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/rajendara-prasad-birthday-specialb568a5a6-5589-4b67-8254-39b6d5bca931-415x250-IndiaHerald.jpgజీవితంలో ఎంతోమంది ఏదో అవ్వాలనుకుని ఇంకేదో అవుతుంటారు. అలా మన నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఒక ఇంజనీర్ గా ఉండి, అటువైపు వెళ్లకుడినా సినిమాలపై మక్కువతో సినిమా రంగాన్నీ తాం వృత్తిగా ఎంచుకున్నాడు. మరి ఇంజనీర్ నుండి చార్లీ చాప్లిన్ స్థాయికి ఎలా ఎదిగాడో ఒకసాగారి చూద్దాం. ఈయన తెలుగు తెరకు దక్కిన ఒక ఆణిముత్యం.RAJENDRA PRASAD BIRTHDAY SPECIAL{#}NTR;charlie;prasad;trivikram srinivas;engineer;Chennai;rajendra prasad;babu rajendra prasad;Comedy;Telugu;job;Sangeetha;Cinema;Indianబర్త్ డే స్పెషల్: ఒక ఇంజనీర్ ఇండియన్ చార్లీ చాప్లిన్ ఎలా ?బర్త్ డే స్పెషల్: ఒక ఇంజనీర్ ఇండియన్ చార్లీ చాప్లిన్ ఎలా ?RAJENDRA PRASAD BIRTHDAY SPECIAL{#}NTR;charlie;prasad;trivikram srinivas;engineer;Chennai;rajendra prasad;babu rajendra prasad;Comedy;Telugu;job;Sangeetha;Cinema;IndianMon, 19 Jul 2021 12:00:00 GMTరాజేంద్ర ప్రసాద్ ఒక ఇంజనీర్ గా ఉండి, అటువైపు వెళ్లకుండా సినిమాలపై మక్కువతో సినిమా రంగాన్ని తన వృత్తిగా ఎంచుకున్నాడు. మరి ఇంజనీర్ నుండి చార్లీ చాప్లిన్ స్థాయికి ఎలా ఎదిగాడో ఒకసాగారి చూద్దాం. ఈయన తెలుగు తెరకు దక్కిన ఒక ఆణిముత్యం. హీరోగా, హాస్య నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా సినిమా పరిశ్రమపై తన ముద్ర వేశాడు. బీటెక్ పట్టా పట్టుకుని ఉద్యోగం కోసం వెళ్లగా అక్కడ తిరస్కరించడంతో తిరిగి ఇంటికి చేరుకున్న రాజేంద్రప్రసాద్ ఒకసారి అన్నగారు ఎన్టీఆర్ ని కలిశారు. ఎన్టీఆర్ మరియు రాజేంద్ర ప్రసాద్ ఒకే ఊరి వాస్తవ్యులు వీరిది నిమ్మకూరు. వీరి మధ్య కాస్త బంధుత్వం కూడా ఉంది. అయితే నటుడిని అవ్వాలనుకుంటున్నాను అన్న విషయాన్ని రాజేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ తో చెప్పగా, ఆయన నవ్వి నీకు సెట్ కాదు బాగా చదువుకున్నావ్. చక్కగా ఉద్యోగం చేసుకో అన్నారట.

అయితే పక్కనే ఉన్న ఆయన సోదరుడు త్రివిక్రమ్ రావు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేర్పిస్తే యాక్టింగ్ నేర్చుకుంటాడులే, ఒకసారి ప్రయత్నిస్తే తప్పేముంది అని అలా అక్కడ ఛాన్స్ ఇప్పించారు. అలా మద్రాసు వెళ్లి యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో చేరిన రాజేంద్ర ప్రసాద్ నటనలో మెళకువలు నేర్చుకుని, యాక్టింగ్ లో గోల్డ్ మెడల్ సాధించి తన ప్రతిభను, పట్టుదలను నిరూపించుకున్నారు. అలా సినీ రంగ ప్రవేశానికి తొలి అడుగులు పడ్డాయి. నటుడిగా ఎటువంటి పాత్రలను ఎన్నుకోవాలని దానిపై సందిగ్దత ఏర్పడింది. అప్పటికే ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలో అగ్రపథంలో దూసుకుపోతున్నారు. ఇలా ఆలోచిస్తూ ఉండగా, ఒకసారి చెన్నై లో ఒక షో చూడడానికని ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళాడు. అందులో చార్లీ చాప్లిన్ పాత్ర ఎంతగానో ఆకట్టుకోవడంతో, కామెడీ హీరోగా కొనసాగాలని నిర్ణయించుకున్నాడు.

రాజేంద్ర ప్రసాద్ సినిమాలంటే కడుపుబ్బ నవ్వుకోవచ్చు. కష్టాలన్నీ మరచిపోవచ్చు అన్నంతగా తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. ఎన్నో సినిమాలలో కథానాయకుడిగా మెప్పించిన రాజేంద్ర ప్రసాద్ ఇప్పుడు వయసుకు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ తన మార్క్ కి ఏ మాత్రం  తగ్గకుండా క్రేజ్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ రోజు ఆయన జన్మదినం సందర్భంగా ఈ విషయాలను మనము గుర్తు చేసుకోవడం జరిగింది. ఈయన ఇండియన్ చార్లీ చాప్లిన్ గా అందరి చేత ప్రశంసలందుకున్నాడు...


సీఎంగా క‌న‌బ‌డ‌నున్న మెగా హీరో..?

పెదనాన్న బాటలో వరుణ్ తేజ్.. సహాయం విలువ..

రామ్, రామ్ చరణ్.. ఇద్దరు ఒకే కథను చేయట్లేదు కదా!!

ఇంట్లో నుంచి ఏ వయసులో సిల్క్ పారిపోయిందో తెలుసా ?

వెంకటేష్ కూతురి మాటలకు ఫిదా అవుతున్న నెటిజన్లు..?

మిల్కీ బ్యూటీకి ఫోన్‌ చేసిన మెగా హీరో..?

జులై 19: చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనలు..

ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడు షో అప్పుడేనా ప్రారంభం అయ్యేది?

ఆదిత్య 369 నుంచి స్పెషల్ వీడియో.!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>