PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/parlamcs ent pi-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/parlamcs ent pi-415x250-IndiaHerald.jpgఓ వైపు కరోనా సెకండ్ వేవ్... మరోవైపు సెంచరీ దాటేసిన పెట్రో ధరలు... ఇక ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర ధరలు.... ఇన్ని సమస్యల మధ్య నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ఉభయ సభలు కొలువుతీరనున్నాయి. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ఎగువ సభ స్టార్ అవుతుంది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అధ్యక్షతన పెద్దల సభ సమావేశం కానుంది. ముందుగా కొత్త మంత్రుల పరిచయ కార్యక్రమం ఉంటుందని ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. రెండేళ్ల తర్వాత కేంద్ర మంత్రివర్గాన్ని పునర్ Parliament{#}Om Birla;Parliment;Telangana Rashtra Samithi TRS;Aqua;MP;oxygen;polavaram;Polavaram Project;YCP;media;venkaiah naidu;Prime Minister;Andhra Pradesh;Coronavirus;central government;Telangana;Teluguసభ సజావుగా సాగేనా..సభ సజావుగా సాగేనా..Parliament{#}Om Birla;Parliment;Telangana Rashtra Samithi TRS;Aqua;MP;oxygen;polavaram;Polavaram Project;YCP;media;venkaiah naidu;Prime Minister;Andhra Pradesh;Coronavirus;central government;Telangana;TeluguMon, 19 Jul 2021 08:13:00 GMTఓ వైపు కరోనా సెకండ్ వేవ్... మరోవైపు సెంచరీ దాటేసిన పెట్రో ధరలు... ఇక ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర ధరలు.... ఇన్ని సమస్యల మధ్య నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ఉభయ సభలు కొలువుతీరనున్నాయి. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ఎగువ సభ స్టార్ అవుతుంది. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అధ్యక్షతన పెద్దల సభ సమావేశం కానుంది. ముందుగా కొత్త మంత్రుల పరిచయ కార్యక్రమం ఉంటుందని ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. రెండేళ్ల తర్వాత కేంద్ర మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించారు ప్రధాని మోదీ.

అయితే పార్లమెంట్ లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధం అవుతున్నాయి. ప్రధానంగా కరోనా సెకండ్ వేవ్ ను అంచనా వేయడంలో కేంద్రం విఫలమైనట్లుగా ఇంటర్ నేషనల్ మీడియా దుమ్మెత్తి పోసింది కూడా. ఆక్సిజన్ కొరత, ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన, మరణాల సంఖ్య పెరగడం వంటి అంశాలపై కేంద్రం పూర్తిగా విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తాయి కూడా. ఈ అంశాన్నే ప్రధాన ఎజెండాగా విపక్షాలు పార్లమెంట్ కు వస్తున్నాయి. సెకండ్ వేవ్ అంచనా వేయకుండా.... రాజకీయాలకే కేంద్రం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందంటున్నారు. అభివృద్ధి మంత్రం జపించే ప్రధాని మోదీ... చివరికి ఆక్సిజన్ కోసం విదేశాల సాయం కోరాల్సి వచ్చిందనేది విపక్షాల ఆరోపణ.

ఇక అంతర్రాష్ట్ర జలవివాదాలు తారాస్థాయిలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల జల జగడం అంశం హాట్ హాట్ టాపిక్ గా ఉంది. కేంద్ర జల్ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై తెలంగాణ సర్కార్ గుర్రుగా ఉంది. ఈ విషయాన్ని కూడా పార్లమెంట్ సమావేశాల్లోనే తేల్చుకోవాలని టీఆర్ఎస్ ఎంపీలు ఉన్నారు. ఇక రుణ పరిమితి, పోలవరం నిధుల కేటాయింపు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాలపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రంపై ఘాటు విమర్శలు చేస్తోంది. ఈ అంశాలన్ని కూడా పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలు ప్రస్తావించనున్నారు. అదే సమయంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారంపై లోక్ సభ  స్పీకర్ చర్యలు తీసుకోకపోవడంపై ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు కూడా. ఇన్ని సమస్యల మధ్య పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా సాగుతాయా లేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.



ఆ హీరో నుంచి మరొక అప్డేట్..!

ఈటల ఓటమి ఖాయం..మరో స్కెచ్‌ వేసిన కేసీఆర్‌ ?

ఏంటి కేంద్ర కేబినెట్ లో ఆ స‌హాయ మంత్రి విదేశియుడా..?

వరుస లాక్‌డౌన్లు.. ఆంక్షలతో దేశమంతా కష్టపడి కరోనాను కట్టడి చేస్తే.. ఇప్పుడు దాని ఫలితం లేకుండా పోతోంది. కరోనా పట్ల జనంలో తగ్గిన భయం.. విచ్చలవిడితనం.. మరోసారి కరోనాకు రెడ్ కార్పెట్ పరిచి మరీ స్వాగతం పలుకుతున్నాయా అనిపిస్తోంది.

తరుణ్ భాస్కర్ కు షాక్ ఇచ్చిన వెంకటేష్ కామెంట్స్ !

మంత్రులు, జర్నలిస్టుల ఫోన్ల హ్యాక్‌?: మోదీ మెడకు మరో గుదిబండ?

దర్శనానికి వెళ్లి నల్లమల అడవుల్లో చిక్కుకున్న 100మంది భక్తులు?

డబ్బులు ఎగ్గొట్టే సంస్థను ఏరికోరి తెచ్చిన వైసీపీ..

నేటి నుంచే పార్లమెంట్ సెషన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>