PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rs-1-crore-gift-to-tirumala-goda37a6fce-9eda-42c5-a374-a65913e19c79-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rs-1-crore-gift-to-tirumala-goda37a6fce-9eda-42c5-a374-a65913e19c79-415x250-IndiaHerald.jpgతిరుమల శ్రీవారికి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ రూపాల్లో భక్తులు తమ కానుకలు సమర్పించుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ కు చెందిన ప్రసాద్ అనే భక్తుడు శ్రీవారికి రూ.1.8కోట్లు విలువ చేసే నందకాన్ని సమర్పించుకున్నారు. టీటీడీ సిబ్బంది ఆయన్ను సత్కరించారు. Rs 1 crore gift to tirumala god{#}sree;thirtha;Tirupati;surya sivakumar;Silver;prasad;Hyderabadశ్రీవారికి రూ.1.8కోట్ల విలువైన కానుక..!శ్రీవారికి రూ.1.8కోట్ల విలువైన కానుక..!Rs 1 crore gift to tirumala god{#}sree;thirtha;Tirupati;surya sivakumar;Silver;prasad;HyderabadMon, 19 Jul 2021 12:20:42 GMTతిరుమల శ్రీవారికి హైదరాబాద్ కు చెందిన భక్తుడు ప్రసాద్ రూ.1.8కోట్ల విలువైన స్వర్ణ నందకాన్ని విరాళంగా అందజేశారు. ఈ ఉదయం ప్రసాద్ దంపతులు స్వామిని దర్శించుకొని ఆభరణాన్ని బహుకరించారు. స్వర్ణ నందకం కోసం 6.5కేజీల బంగారాన్ని వినియోగించినట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా దాతలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు  అభినందించారు. రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం చేసి.. తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

అప్పట్లో అన్నమయ్య.. శ్రీవారికి శ్రీ మహావిష్ణువు నందకాన్ని అందించారు. ఆ తరహాలోనే తాము శ్రీవారికి స్వర్ణ నందకాన్ని అందించినట్టు తెలిపారు. ఈ నందకం తమిళనాడులోని కోయంబత్తూరులో రూపొందింది. ప్రస్తుతం స్వామి వారికి ఉన్న సూర్య కఠారి కొలతలతో ఈ నందకాన్ని తయారు చేయించారు భక్తుడు ప్రసాద్.  

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరునికి కానుకలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతుంటాయి. నగదు, నగల రూపంలో భక్తులు తమ భక్తిని చాటుకుంటుంటారు. అందుకే ఆయన వైభోగంతో భక్తులకు దర్శనమిస్తుంటారు. అలా ఆయన్ను చూసి భక్తి పారవశ్యంలో మునిగిపోతుంటారు భక్తులు. రోజుకు కోట్లాది రూపాయల సొమ్ము ఆయన ఖాతాలో చేరిపోతూ ఉంటుంది. అంతేకాదు మొక్కుబడులు పెద్ద ఎత్తున వస్తాయి. బంగారాన్ని శ్రీవారికి సమర్పించుకుంటారు. తలనీలాలతో కోట్లాది ఆదాయం ఆయన నిధికి చేరుతుంది. మరోవైపు కొందరు భక్తులయితే.. శ్రీవారి సన్నిధికి చేరేందుకు వాహనాలు.. అక్కడ ఉచితంగా భోజన సదుపాయం అందుతున్న సందర్భంగా.. బియ్యం, ఇతర సామాగ్రి కూడా అందిస్తుంటారు.

శ్రీవారికి బంగారమే కాదు.. వెండి ఆభరణాలు వజ్ర వైడుర్యాలు కూడా సమర్పించుకుంటూ ఉంటారు. మరికొందరైతే తమ విలువైన భూములను కూడా ఇస్తారు. ఇలా రకరకాలుగా కానుకలు సమర్పించి శ్రీవారిపై తమ భక్తిని చాటుకుంటున్నారు భక్తులు.

మొత్తానికి శ్రీవారికి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. తమ ఇష్టదైవానికి విలువైన కానుకలు ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తమ కోరికలు తీరితే.. అది సమర్పిస్తాం.. ఇది సమర్పిస్తామని.. మొక్కుకుంటున్నారు. ఆ కోరిక తీరగానే ఇలా శ్రీవారికి సమర్పించుకుంటున్నారు.



 







సూర్య కాదు.. బోయపాటి తో మరో తమిళ హీరో?

సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్న '6 టీన్స్' హీరో ?

కార్తీ ని గుర్తుపట్టని స్టార్ హీరో..!

శ్రీవారికి రూ.1.8కోట్ల విలువైన కానుక

బర్త్ డే స్పెషల్: ఒక ఇంజనీర్ ఇండియన్ చార్లీ చాప్లిన్ ఎలా ?

మిల్కీ బ్యూటీకి ఫోన్‌ చేసిన మెగా హీరో..?

ఆ సినిమా సీక్వెల్ షూటింగ్ అప్పటి నుండే ?

మీ పళ్ళు పచ్చగా ఉన్నాయా? అయితే ఇలా చెయ్యండి..

మంగ్లీ బోనాల పాటలో ఆ పదాలు ఉన్నాయా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>