MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan528555b2-29c1-4f9f-ae57-3d8685d9294f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan528555b2-29c1-4f9f-ae57-3d8685d9294f-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న రామ్ చరణ్ తన తదుపరి చిత్రం ఇంత భారీ రేంజ్ లో చేయడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. పాన్ ఇండియా స్టార్ అయ్యే విధంగా ఆయన ఈ సినిమాల ఎంపిక చేశాడని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత కూడా ఆయన భారీ రేంజ్ లోనే సినిమాలు చేయడానికి డిసైడ్ అయ్యారు. ఇప్పటికే బాలీవుడ్ ఎంట్రీ కూడా చేసిన రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ కావడానికి పెద్ద గా కram charan{#}Alluri Seetha Rama Raju;Darsakudu;srinivas;Alluri Sitarama Raju;Chitram;Pawan Kalyan;Ram Charan Teja;ram pothineni;shankar;Heroine;RRR Movie;Traffic police;Director;Tollywood;bollywood;Mass;India;Rajamouli;Tamil;Cinemaరామ్, రామ్ చరణ్.. ఇద్దరు ఒకే కథను చేయట్లేదు కదా!!రామ్, రామ్ చరణ్.. ఇద్దరు ఒకే కథను చేయట్లేదు కదా!!ram charan{#}Alluri Seetha Rama Raju;Darsakudu;srinivas;Alluri Sitarama Raju;Chitram;Pawan Kalyan;Ram Charan Teja;ram pothineni;shankar;Heroine;RRR Movie;Traffic police;Director;Tollywood;bollywood;Mass;India;Rajamouli;Tamil;CinemaMon, 19 Jul 2021 12:00:00 GMT
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న రామ్ చరణ్ తన తదుపరి చిత్రం ఇంత భారీ రేంజ్ లో చేయడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. పాన్ ఇండియా స్టార్ అయ్యే విధంగా ఆయన ఈ సినిమాల ఎంపిక చేశాడని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత కూడా ఆయన భారీ రేంజ్ లోనే సినిమాలు చేయడానికి డిసైడ్ అయ్యారు. ఇప్పటికే బాలీవుడ్ ఎంట్రీ కూడా చేసిన రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ కావడానికి పెద్ద గా కష్ట పడాల్సిన అవసరం లేదు.

మరోవైపు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.  మాస్ చిత్రాల దర్శకుడిగా తమిళం లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న లింగుస్వామి తొలిసారి రామ్ తో సినిమా చేస్తుండడం తో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పోలీస్ ఆఫీసర్ గా  ఈ సినిమా లో కనిపించబోతున్నాడట. రామ్ నుంచి ఎటువంటి సినిమా ను ఆశిస్తున్నారో లింగుస్వామి కూడా అలాంటి మాస్ ప్యాక్డ్ సినిమా ను ప్రేక్షకులను అందించబోతున్నారు. ఉప్పెన సినిమా తో ప్రేక్షకులను అలరించిన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా చిట్టూరీ సిల్వర్ బ్యానర్ పై చిట్టూరీ శ్రీనివాస్ ఈ సినిమాను భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నాడు. 

ఇదిలా ఉంటే ఈ సినిమా సెట్స్ లో ఇటీవలే దర్శకుడు శంకర్ సందడి చేసిన విషయం తెలిసిందే. ఇద్దరు తమిళ దర్శకులు కావడంతో లింగస్వామి ని కలవడానికి శంకర్ సినిమా టీమ్ ను సర్ప్రైజ్ చేశాడు.  ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాల కథలు ఒకేలా ఉన్నాయనీ టాక్ వినిపిస్తుంది. రామ్ చరణ్ తేజ్ శంకర్ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తుండగా, రామ్ కూడా లింగు స్వామి సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఒకటి పొలిటికల్ నేపథ్యంలోని సినిమా కాగా మరొక దాంట్లో రామ్ పోలీస్ అధికారి గా కనిపించబోతున్నాడు అని అంటున్నారు. నేపథ్యాలు వేరైనా ఇద్దరి లక్ష్యాలు ఒకటేనట.  ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో ఈ సినిమా ల కథపై చర్చ జరుగుతుంది. మరి ఈ సినిమాలు వస్తే గాని కథలు ఏవిధంగా ఉన్నాయో చెప్పలేము. 





సీఎంగా క‌న‌బ‌డ‌నున్న మెగా హీరో..?

బర్త్ డే స్పెషల్: ఒక ఇంజనీర్ ఇండియన్ చార్లీ చాప్లిన్ ఎలా ?

ఇంట్లో నుంచి ఏ వయసులో సిల్క్ పారిపోయిందో తెలుసా ?

మిల్కీ బ్యూటీకి ఫోన్‌ చేసిన మెగా హీరో..?

జులై 19: చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనలు..

ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడు షో అప్పుడేనా ప్రారంభం అయ్యేది?

ఆదిత్య 369 నుంచి స్పెషల్ వీడియో.!

ఓపెన్ ఆఫర్ ఇచ్చి.. షాకింగ్ కామెంట్స్ చేసిన శృంగార తార..!

వావ్..1028 రోజుల తర్వాత తొలిసారి టీమిండియా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>