Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో వార‌సుల హ‌వా న‌డుస్తుంది. చిరంజీవి, నాగార్జున వార‌సులు ఇప్ప‌టికే తెలుగు తెర‌పై సంద‌డి చేస్తుండ‌గా, బాల‌కృష్ణ వార‌సుడి ఎంట్రీపై కొన్నాళ్లుగా ఆస‌క్తిక‌ర వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే మోక్ష‌జ్ఞ‌ను గ్రాండ్‌గా లాంచ్ చేయాల‌ని బాల‌య్య ఇన్ని రోజులు పెండింగ్‌లో పెట్ట‌గా, తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఆదిత్య 369 సీక్వెల్ చిత్రంతో త‌న వార‌సుడు వెండితెర‌కు ప‌రిచ‌యం కానున్నాడని కొద్ది రోజుల క్రితం ప్ర‌క‌టించాడు. Balakrishna{#}Balakrishna;Akkineni Nagarjuna;adhithya;Chitram;Father;Telugu;Cinema;Heroమోక్షజ్ఞ ఎంట్రీ ఆ సినిమాతోనేనా?మోక్షజ్ఞ ఎంట్రీ ఆ సినిమాతోనేనా?Balakrishna{#}Balakrishna;Akkineni Nagarjuna;adhithya;Chitram;Father;Telugu;Cinema;HeroMon, 19 Jul 2021 23:43:00 GMTప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో వార‌సుల హ‌వా న‌డుస్తుంది. చిరంజీవి, నాగార్జున వార‌సులు ఇప్ప‌టికే తెలుగు తెర‌పై సంద‌డి చేస్తుండ‌గా, బాల‌కృష్ణ వార‌సుడి ఎంట్రీపై కొన్నాళ్లుగా ఆస‌క్తిక‌ర వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే మోక్ష‌జ్ఞ‌ను గ్రాండ్‌గా లాంచ్ చేయాల‌ని బాల‌య్య ఇన్ని రోజులు పెండింగ్‌లో పెట్ట‌గా, తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఆదిత్య 369 సీక్వెల్ చిత్రంతో త‌న వార‌సుడు వెండితెర‌కు ప‌రిచ‌యం కానున్నాడని కొద్ది రోజుల క్రితం ప్ర‌క‌టించాడు.

మోక్షజ్ఞ ఎంట్రీ నభూతోనభవిష్యతి అన్న చందంగా ఉండాలన్నది బాలకృష్ణ ప్లాన్. అందుకు తగ్గట్టే ఇప్పటికే కథను కూడా లాక్ చేసి టైటిల్ ని ఫిక్స్ చేసేశారు. తన తండ్రి ఎన్టీఆర్ ‘తాతమ్మకల’ అనే సినిమాలో మొదట తనకు అవకాశం ఇచ్చి ఎలా మెళుకువలు నేర్పించారో తాను కూడా తన కొడుకుకు ఫస్ట్ మూవీ కోసం అలాంటి మెళుకువలు నేర్పిస్తానని గతంలోనే బాలకృష్ణ తెలిపారు.


ఆదిత్య 369 చిత్రం జూలై 18న‌30 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకోగా, తాజాగా సీక్వెల్ విష‌యాలు కూడా వెల్ల‌డించారు బాల‌య్య‌. ఆదిత్య 369 సీక్వెల్ పనులు సాగుతున్నాయని చెప్పిన ఆయ‌న “ఆదిత్య 369 ప్రధాన కథాంశం ఇప్పటికే లాక్ అయ్యింది. నేను ఇప్పుడు స్క్రిప్ట్ ను అభివృద్ధి చేస్తున్నాను. సీక్వెల్ పేరు ఆదిత్య 999 మాక్స్. ఇదే మోక్షజ్ఞ తొలి చిత్రం అవుతుంది అని బాలయ్య పేర్కొన్నారు.

ఆదిత్య 999 మాక్స్ 2023లో మాత్రమే విడుదల కానుందని నందమూరి హీరో అన్నారు. అంటే మోక్షు సినిమా కోసం మరో రెండేళ్లు వేచి చూడాల్సి ఉంటుందన్నమాట. అయితే ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం ఎవ‌రు వ‌హిస్తారు అనే దానిపై క్లారిటీ లేదు. బాల‌య్య‌నే డైరెక్ట్ చేయ‌నున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ ఇందులో క్లారిటీ లేదు.

ఆదిత్య 999 మాక్స్ అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందనుంది. 2022లో ప్రారంభం కానున్న ఈ చిత్రం 2023లో విడుదలవుతుది. ఇందులో మోక్షజ్ఞ సూపర్ హీరో తరహా పాత్రలో కనిపించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. బాల‌య్య కూడా ఇందులో ఓ ముఖ్య పాత్ర పోషించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.


రామ్ మూవీలో విలన్ గా ఆ యంగ్ హీరో

రైలుపట్టాలపై కారు నడిపిన దొంగ.. నెట్టింటా వైరల్..

త్రివిక్రంకు మూడు నెలలు టార్గెట్ పెడుతున్న మహేష్..!

ధనుష్ ఆ విషయంలో మహేష్ ని బీట్ చేయగలడా..?

చావు కబురు చల్లగా చెప్పిన సిద్ధార్థ్‌!

సినిమాలను వదిలేస్తా అని వెక్కి వెక్కి ఏడ్చిన సాయి పల్లవి.. అసలేం జరిగిందంటే..?

శంకర్ ఛాన్స్ ఇచ్చాడు సరే తమన్ నిలబెట్టుకుంటాడా..?

బాలీవుడ్ లో అడుగుపెట్టనున్న బన్నీ?

బండ్ల గణేష్ నిర్మాతగా స్టార్ హీరో మూవీ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>