PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/if-you-look-at-the-photo-taken-by-siddiqui-382e28e5-f88b-4379-941e-db54cbb50bdd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/if-you-look-at-the-photo-taken-by-siddiqui-382e28e5-f88b-4379-941e-db54cbb50bdd-415x250-IndiaHerald.jpgతాలిబన్ల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఫోటో జర్నలిస్ట్ సిద్ధిఖీ తీసిన ఓ చిత్రం ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది. సెకండ్ వేవ్ లో ప్రాణాలు కోల్పోయిన వారి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్న సమయంలో తీసిన ఫోటో చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. దూరం నుంచి చూస్తే ఏదో చలిమంటలు లాగా కనిపించినా.. కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే కానీ అక్కడ దహన సంస్కారాలు జరుగుతున్నాయని అర్థం కాదు. Danish Siddiqui photo{#}India;Prime Minister;Coronavirus;Chitram;media;Cinemaఇవి చలి మంటలు కావు.. సిద్ధిఖీ తీసిన ఆ ఫోటో పరిశీలిస్తే.!ఇవి చలి మంటలు కావు.. సిద్ధిఖీ తీసిన ఆ ఫోటో పరిశీలిస్తే.!Danish Siddiqui photo{#}India;Prime Minister;Coronavirus;Chitram;media;CinemaMon, 19 Jul 2021 10:29:09 GMTఆప్గనిస్తాన్ లో ఇటీవల తాలిబన్లకు..ఆఫ్ఘాన్ సైనికులకు మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఈ పోరులో మన దేశానికి చెందిన ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్ధిఖీ ప్రాణాలు కోల్పోయారు. ఇరువురి మధ్య జరుగుతున్న పోరును చిత్రీకరించేందుకు వెళ్లి మరణించారు. ముంబైలో నివాసముండే డానిష్ సిద్ధిఖీ వయసు 40సంవత్సరాలు. ఈయన పులిట్జర్ అవార్డును అందుకున్నారు కూడా. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ అయిన రాయ్ టర్స్ కు ఫోటో జర్నలిస్ట్ గా పనిచేస్తున్న ఆయన ఇటీవల ఆఫ్ఘనిస్థాన్ స్పెషల్ ఫోర్సెస్ తో ఉంటూ తాజా పరిస్థితులను న్యూస్ ఏజెన్సీకి అందిస్తున్నారు.

అయితే జులై 16వ తేదీన గురువారం.. అఫ్ఘాన్ సైన్యానికి... తాలిబన్లకు మధ్య భీకర పోరు జరిగింది. తాలిబన్లను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు సైనికులు ప్రయత్నం చేస్తుండగా.. తాలిబన్లు సోల్జర్స్ పై ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ ఘటన కందహార్ ప్రావిన్స్ లోని స్పిన్ బోల్డాక్ సమీపంలో జరిగింది. అంతకు ముందు సిద్ధిఖీ.. తాను తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నానని ప్రకటించాడు. అలా చెప్పీ చెప్పక ముందే ఆయన మృతివార్త మీడియా సంస్థలను కలిచివేసింది. సిద్ధిఖీ మృతిపై ఆప్ఘాన్ ప్రధాని సైతం సంతాపం వ్యక్తం చేశారు.

అంతేకాదు సిద్థిఖీ ప్రాణాలు కోకోల్పోవడంపై భారత్ విచారం వ్యక్తం చేసింది. వారి కుటుంబానికి సానుభూతి ప్రకటించింది. ఈ విషయాన్ని భారత విదేశీ వ్యవహారల కార్యదర్శి ఐక్యరాజ్య సమితిలో వెల్లడించారు. ఆయన మరణాన్ని వ్యతిరేకిస్తూ  దేశవ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలు కూడా జరిగాయి.

మరోవైపు కరోనా సెకండ్ వేవ్ లో.. సిద్ధిఖీ తీసిన ఓ చిత్రం ఇపుడు కన్నీరు తెప్పిస్తోంది. కరోనా మృతులు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్న ఘటనను తన ఫోటోలో బంధించారు సిద్ధిఖీ. అంత్యక్రియల మైదానంపై నుంచి తీసిన ఈ ఛాయాచిత్రాన్ని చూసిన ఎవరైనా.. అతడికి ఫోటోలు తీయడంలో ఎంత ప్రతిభ ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు సిద్ధిఖీలో సామాజిక స్పృహ కూడా ఎక్కువే.  



అందంతో కి'లేడీ' వల.. ఏకంగా కమిషనర్ ని రంగంలోకి

శాకుంతలం కోసం అందుకు సిద్ధమైన సమంత..!

ప్రారంభమైన సదరన్ క్యాంపులు.. బారులు తీరుతున్న దివ్యాంగులు?

విజృంభించిన భారత ఆర్మీ.. ఇద్దరు ఉగ్రవాదులు హతం?

నాతో సెల్ఫీ కావాలంటే 100 కట్టాల్సిందే.. మంత్రి షాకింగ్ ప్రకటన?

కొడుకు కేంద్ర మంత్రి.. తల్లిదండ్రులు దినసరి కూలీలు?

భారీ సినిమాలను కలవర పెడుతున్న ఓవర్సీస్ మార్కెట్ !

వెంకీతో అంత వీజీ కాదు!!

రాజేంద్ర ప్రసాద్ భార్య ఎవరో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>