Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-0bca0da4-8f50-452b-83bf-81708ebcc4eb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-0bca0da4-8f50-452b-83bf-81708ebcc4eb-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టీమిండియా జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది. అయితే ఇక ఈ పర్యటనలో భాగంగా వన్డే, టి20 సిరీస్ లు ఆడాల్సి ఉంది. అయితే మొదటి నుంచి శ్రీలంక భారత్ మధ్య జరగబోయే సిరీస్లకు కరోనా వల్ల అవాంతరాలు ఏర్పడుతూనే ఉన్నాయి. చివరికి ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని నేడు టీమ్ ఇండియా శ్రీలంక మధ్య వన్డే మ్యాచ్ ప్రారంభం అయింది. ఈ మొదటి వన్డే మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం మ్యాచ్ హోరాహోరీగా జరుగుతుంది. అయితే ప్రస్తుతం టీమిండియాకు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కాకుండా కొCricket {#}VIRAT KOHLI;Sri Lanka;Shikhar Dhawan;Coronavirus;INTERNATIONAL;Indiaకెప్టెన్ గబ్బర్ ను.. ఊరిస్తున్న రికార్డులు?కెప్టెన్ గబ్బర్ ను.. ఊరిస్తున్న రికార్డులు?Cricket {#}VIRAT KOHLI;Sri Lanka;Shikhar Dhawan;Coronavirus;INTERNATIONAL;IndiaSun, 18 Jul 2021 17:20:00 GMTప్రస్తుతం టీమిండియా జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది. అయితే ఇక ఈ పర్యటనలో భాగంగా వన్డే, టి20 సిరీస్ లు ఆడాల్సి ఉంది. అయితే మొదటి నుంచి శ్రీలంక భారత్ మధ్య జరగబోయే సిరీస్లకు కరోనా వల్ల అవాంతరాలు ఏర్పడుతూనే ఉన్నాయి. చివరికి ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని నేడు టీమ్ ఇండియా శ్రీలంక మధ్య  వన్డే మ్యాచ్ ప్రారంభం అయింది.  ఈ మొదటి వన్డే మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం మ్యాచ్ హోరాహోరీగా జరుగుతుంది.  అయితే ప్రస్తుతం టీమిండియాకు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కాకుండా కొత్త కెప్టెన్ శిఖర్ ధావన్ సారధ్య బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.



 మొన్నటి వరకు శిఖర్ ధావన్ జట్టులో కీలక ఆటగాడిగా స్టార్ ఓపెనర్ గా మాత్రమే కొనసాగాడు  ఇక ఇప్పుడు ఏకంగా జట్టుకు కెప్టెన్ గా మారిపోయాడు. అయితే ఇప్పటికే మీడియాతో మాట్లాడిన శిఖర్ ధావన్ జట్టును ఎంతో సమన్వయంతో ముందుకు తీసుకు వెళతాను అంటూ ప్రకటించారు.  జట్టులోని ప్రతి ఆటగాడిని ఎంతగానో ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తాను అంటూ చెప్పుకొచ్చారు శిఖర్ ధావన్. ఇక శిఖర్ ధావన్ కెప్టెన్సీ ఎలా ఉండబోతుందో అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మొదటి వన్డే మ్యాచ్లో కొన్ని అరుదైన రికార్డును కెప్టెన్ గబ్బర్ ను ఊరిస్తున్నాయి.



 ఇక మొదటి వన్డే మ్యాచ్లో శిఖర్ ధావన్ అద్భుతంగా రాణించాడు అంటే కెప్టెన్ హోదాలో అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకుంటాడు. మొదటి వన్డే మ్యాచ్లో అంతర్జాతీయ క్రికెట్లో 10000 పరుగులు మైలురాయిని అందుకునేందుకు శిఖర్ ధావన్ కొంచెం దూరంలో ఉన్నాడు. మరో 35 పరుగులు చేస్తే చాలు పది వేల పరుగుల మైలురాయిని ఆదుకుంటాడు. అంతే కాకుండా వన్డేలలో  ఏకంగా ఆరు వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాడు. కేవలం 23 రన్స్ చేస్తే చాలు ఇక ఈ ఘనత సాధిస్తాడు. ఈ రికార్డు  సాధిస్తే కోహ్లీ తర్వాత రెండవ స్థానంలో ఆరు వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలుస్తాడు శిఖర్ ధావన్. మరి ప్రస్తుతం ఒకవైపు జట్టు బాధ్యతలను ఒత్తిడిని తట్టుకుని శిఖర్ధావన్ రెండు రికార్డును కొల్ల కొడతాడా లేదా అన్నది చూడాలి మరి.



బన్నీ ఇమేజ్ అక్కడ కూడా పెరుగుతోంది గా!!

ప్రభాస్, త్రివిక్రమ్ ఇప్పట్లో సాధ్యమయ్యేనా!!

టీమిండియా- శ్రీలంక వన్డే : గబ్బర్ కు ఓపెనింగ్ జోడి అతడే?

క్రీడాస్ఫూర్తి అంటే ఇదే.. రనౌట్ కు అవకాశం ఉన్నా వదిలేసాడు?

జూనియ‌ర్ ఎన్టీఆర్ స్థాయి వేర‌బ్బా..??

లాక్ డౌన్ లోనూ అండగా నిలిచింది మేమే!

అప్పుడు 750.. ఇప్పుడు రోజుకి లక్షల్లో పారితోషకం తీసుకుంటున్న విజయ్ సేతపతి

'నారప్ప' ఓటీటీ రిలీజ్ కి ధనుష్ సినిమాకి సంబంధం ఏంటీ..?

లైగర్ సినిమా ఆలస్యం కావడానికి కారణం ఇదే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>