MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/soundaryad5077e9d-c634-4e1f-80f4-2af9f2e4e972-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/soundaryad5077e9d-c634-4e1f-80f4-2af9f2e4e972-415x250-IndiaHerald.jpg1972, జూలై 18వ తేదీన సత్యనారాయణ, మంజుల దంపతులకు కర్ణాటక, కోలార్ జిల్లా, ముల్బాగల్ లోని గంజిగుంటే గ్రామంలో జన్మించిన సౌందర్య అసలు పేరు సౌమ్య. ఆమె నటనపై ఆసక్తితో డాక్టర్ చదువుని మధ్యలోనే వదిలేశారు. బెంగళూరులోని ఒక ప్రముఖ కాలేజీలో ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న రోజుల్లోనే ఆమె సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. సౌందర్య తండ్రి కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో నిర్మాతగా, దర్శకుడిగా, రచయితగా పనిచేశారు. సౌందర్య తన ప్రాథమిక విద్య బెంగళూరులోనే పూర్తిచేశారు. ఆమె తండ్రి సినిమా ఇండస్ట్రీలో కొనసాగేవారు కాబట్టి soundarya{#}manjula;Soundarya;Doctor;Cinema;Kannada;vidya;Father;cinema theater;Sangeetha;hamsalekha;Music;Heroine;Mantra;Telugu;sree;Rajani kanth;collegeసౌందర్య గురించి మీకు తెలియని నిజాలు..!సౌందర్య గురించి మీకు తెలియని నిజాలు..!soundarya{#}manjula;Soundarya;Doctor;Cinema;Kannada;vidya;Father;cinema theater;Sangeetha;hamsalekha;Music;Heroine;Mantra;Telugu;sree;Rajani kanth;collegeSun, 18 Jul 2021 12:00:00 GMTమంజుల దంపతులకు కర్ణాటక, కోలార్ జిల్లా, ముల్బాగల్ లోని గంజిగుంటే గ్రామంలో జన్మించిన సౌందర్య అసలు పేరు సౌమ్య. ఆమె నటనపై ఆసక్తితో డాక్టర్ చదువుని మధ్యలోనే వదిలేశారు. బెంగళూరులోని ఒక ప్రముఖ కాలేజీలో ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న రోజుల్లోనే ఆమె సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. సౌందర్య తండ్రి కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో నిర్మాతగా, దర్శకుడిగా, రచయితగా పనిచేశారు. సౌందర్య తన ప్రాథమిక విద్య బెంగళూరులోనే పూర్తిచేశారు.

ఆమె తండ్రి సినిమా ఇండస్ట్రీలో కొనసాగేవారు కాబట్టి ఆయన ఇంటికి చాలా మంది సినీ ప్రముఖులు వచ్చేవారు. ఆ సమయంలో సౌందర్య ని చూసి సినిమాల్లో బాలనటిగా నటింపజేయాలంటూ తండ్రిని అడిగేవారట. కానీ సత్యనారాయణ మాత్రం బాల్య వయసులో ఉన్న తన కూతురిని సినిమాల దరిదాపులకు కూడా వెళ్ళనివ్వనని తేల్చి చెప్పేవారట. కానీ కూతురికి సినిమాల పట్ల మిక్కిలి ఇష్టము ఉండటంతో ఆమెను తనతోపాటు షూటింగ్స్ కి తీసుకు వెళ్లేవారట.

అయితే సౌందర్య టెన్త్ క్లాస్ పూర్తయిన తర్వాత వేసవి సెలవుల్లో ఒకరోజు తన తండ్రితో కలిసి డబ్బింగ్ థియేటర్ కి వెళ్లారట. అక్కడే సంగీత దర్శకుడు హంసలేఖ ఉన్నారట. సంగీతం అందించడమే కాదు ఆయన సినిమాలకు కథ రాయటం, డైరెక్ట్ చేయడం వంటివి కూడా చేసేవారు. అప్పటికే ఆయన గాంధర్వ అనే ఒక కన్నడ సినిమా చేస్తున్నారు. సౌందర్య డబ్బింగ్ థియేటర్ కి వచ్చినప్పుడు హంసలేఖ చూశారు. సౌందర్య చాలా అందంగా ఉందని ఆమెను తన సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటింపజేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. దీంతో ఆయన సత్యనారాయణ ని బాగా బతిమాలాడారు కానీ సౌందర్య ఇష్టం లేదన్నట్టు సైగ చేశారట. దీంతో అప్పటికప్పుడు సత్యనారాయణ హంసలేఖ కి మాట ఇవ్వలేకపోయారు. ఇంటికి వచ్చిన తర్వాత సౌందర్య మామయ్య అత్తయ్య కుటుంబ సభ్యులందరూ ఈ సినిమాలో నటించడానికి చాలా సున్నితంగా చెప్పారట. ఆ క్రమంలోనే హంసలేఖ మళ్లీ సౌందర్య ఇంటికి వచ్చి బతిమిలారట. దీంతో సౌందర్య సినిమాల్లో నటించడానికి ఒప్పుకున్నారు.
సినిమా చూసిన దర్శకులందరూ కూడా సౌందర్య అందం, అభినయానికి మంత్ర ముగ్ధులయ్యారు. ఆమెను తమ సినిమాల్లో హీరోయిన్ గా పెట్టుకోవాలని బాగా తపనపడ్డారు. ఐతే చాలా అవకాశాలు వస్తుండటంతో ఆమె పలు సినిమాల్లో నటించి కొంత కాలంలోనే అగ్ర తారగా ఎదిగారు. ఆమె "మనవరాలి పెళ్లి" అనే తెలుగు చిత్రంలో మొట్టమొదటి సారిగా కనిపించారు. త్రిపురనేని శ్రీ ప్రసాద్ కూడా ఆమెకు సూపర్ స్టార్ కృష్ణ సరసన నటించే అవకాశం కల్పించారు. ఆమె రైతుభారతం సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. అయితే సౌందర్యకి సినిమాలపై ఎక్కువగా ఆసక్తి ఉండకపోయేది.
డాక్టర్ కావాలని.. సినిమాల వల్ల తన చదువు పాడవుతుందని ఆమె బాధపడేవారట. కానీ తండ్రి నటించాలని కోరడంతో ఆమె ఒక్క షరతుతో సినిమాలు చేయడానికి అంగీకరించారట. అదేంటంటే తన చదువుకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని.. ప్రతి రోజు కాలేజీకి వెళ్ళిన తర్వాతనే సినిమా షూటింగ్ లలో పాల్గొంటానని కరాఖండిగా చెప్పారట. దీంతో సత్యనారాయణ కాలేజీ అయిపోగానే ఆమెను కారులో పిక్ అప్ చేసుకొని షూటింగ్ కి తీసుకెళ్లేవారు. అయితే ఆమెకు సినిమా ఇండస్ట్రీలో ఎనలేని పాపులారిటీ దక్కడంతో.. మెడిసిన్ ఫీల్డ్ ని వదిలేయాలో సినిమా ఫీల్డ్ వదిలేయాలో నిర్ణయం తీసుకోలేక చాలా రోజులు బాధ పడ్డారట. ఇక చివరికి సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగాలని నిశ్చయించుకొని డాక్టర్ చదివును ఆపివేశారు. 


విజయ్ దేవరకొండ, సుకుమార్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ?

మెగా హీరో సినిమాలో ఇలియానా ?

అయ్యప్పనుం రీమేక్ లో విబేధాలు.. ఆయనపై వేటు తప్పదా!!

వెంకటేష్ - సౌందర్య జంటగా వచ్చిన సినిమాలు..

నిండు కుండల్లా ఏపీ తెలంగాణ ప్రాజెక్ట్ లు.. !

మొదటి రోజు షూటింగ్ కి వచ్చి ఏడ్చేసిన సౌందర్య

బాలయ్యకి కౌంటర్ ఇచ్చిన నాగబాబు..!!

రష్మిక డైరీలో పుష్ప పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

బాలయ్య సినిమాకు 30 ఏళ్ళు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>