MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/soundarya-birthday-specialf662004f-7030-4a26-9a84-bffa7f98ca12-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/soundarya-birthday-specialf662004f-7030-4a26-9a84-bffa7f98ca12-415x250-IndiaHerald.jpgసౌమ్య గా సినీ పరిశ్రమకు వచ్చి ప్రేక్షకుల మనసు గెలుచుకుని సౌందర్యగా మారిన అధ్బుతమైన నటి సౌందర్య. నటిగానే కాకుండా మానవతావాదిగా కీర్తి ప్రతిష్టలు పొందిన అందాల ధృవ తార సౌందర్య. తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ఉన్నతమైన గుర్తింపు పొందిన నటులలో సౌందర్య కూడా ఒకరు. SOUNDARYA BIRTHDAY SPECIAL{#}kirti;Dhruva;jeevitha rajaseskhar;Silver;Soundarya;Industry;Telugu;Heroine;Tollywood;Newsసౌందర్య బయోపిక్... ఆ పాత్రలో నటించేది ఎవరో తెలుసా?సౌందర్య బయోపిక్... ఆ పాత్రలో నటించేది ఎవరో తెలుసా?SOUNDARYA BIRTHDAY SPECIAL{#}kirti;Dhruva;jeevitha rajaseskhar;Silver;Soundarya;Industry;Telugu;Heroine;Tollywood;NewsSun, 18 Jul 2021 14:00:00 GMTసౌమ్య గా సినీ పరిశ్రమకు వచ్చి ప్రేక్షకుల మనసు గెలుచుకుని సౌందర్యగా మారిన అధ్బుతమైన నటి సౌందర్య. నటిగానే కాకుండా మానవతావాదిగా కీర్తి ప్రతిష్టలు పొందిన అందాల ధృవ తార సౌందర్య. తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ఉన్నతమైన గుర్తింపు పొందిన నటులలో సౌందర్య కూడా ఒకరు. అందాల ప్రదర్శనకు అస్సలు ఒప్పుకోకుండా వెండి తెరపై తన సహజ సౌందర్యంతో, నటనతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసిన చాలా తక్కువమంది కథానాయకులలో ఈమె ముందుంటారు అనడంలో అతిశయోక్తి లేదు . అందులోనూ టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుని అందర్నీ ఆశ్చర్య పరిచింది. కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. అనతి కాలంలోనే ఉన్నత శిఖరాలను చేరుకున్న సౌందర్య జీవితం అందరికీ ఆదర్శం. హీరోయిన్స్ అంటే సాధారణంగా రకరకాల గాసిప్లు, రూమర్లు కోకొల్లలుగా వెల్లువెత్తుతుంటాయి. అలాంటి వాటికి సౌందర్య చాలా దూరం.
ఓ వైపు నటిగా కొనసాగుతూనే..మరో వైపు సామాజిక కార్యక్రమాల్లోనూ ఎప్పుడూ ముందుందేది. కుడి చేతితో చేసిన సాయం ఎడమ చేతికి కూడా  తెలియనంతగా ఎంతో సాధారణంగా ఉండేది. అడిగిన వారికే కాదు ..సాయం కోసం ఎదురు చూసే  వారి గురించి తన దృష్టికి వచ్చినా చాలు వారికి సాయం చేసి అండగా నిలబడిన గొప్ప మనిషి. స్టార్ హీరోయిన్ అన్న గర్వం ఎన్నడూ చూపలేదు. నిర్మాతల నుండి లైట్ మ్యాన్ ల వరకూ ప్రతి ఒక్కరికీ గౌరవం ఇస్తూ చిరునవ్వుతో పలకరించేది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో గొప్ప విషయాలు, విశేషాలు ఆమె జీవితంలో నిండి ఉంటాయి. జీవించింది తక్కువ కాలమే. కానీ, అందరికీ జీవితాంతం గుర్తుండిపోయేలా ఒక ప్రణాళిక ప్రకారం బ్రతికారు సౌందర్య.
ఊహించని విధంగా ఏప్రిల్ 17, 2004న హెలికాప్టర్ ప్రమాదం జరగడంతో మనల్ని వీడి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు సౌందర్య. ఈమె దేహం మనల్ని వీడి వెళ్లింది కానీ ఆమె చిరునవ్వు ఎప్పుడూ మనల్ని చిరుగాలిలా  పలకరిస్తూనే ఉంటుంది. ఈమె బయోపిక్ వస్తుందంటూ అప్పట్లో వార్తలు రాగా ఇప్పుడు అందుకు పునాదులు పడ్డట్టు సమాచారం. ఈమె జీవిత చరిత్రను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు ఈమె పుట్టిన రోజు సందర్భంగా ఆ బయోపిక్ గురించిన వివరాలు వెల్లడించనున్నారు అంటూ వార్తలు వినపడుతున్న నేపథ్యంలో ఈమె పాత్రకు ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టిని పరిశీలిస్తున్నట్లు టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.  కృతి చూడటానికి సౌందర్యను పోలి ఉండటంతో, అందులోనూ నటన పరంగానూ ఈమె మంచి పేరు తెచ్చుకోవడంతో కృతి అయితే సౌందర్య పాత్రకు సరిగ్గా నప్పుతుందని మేకర్స్ భావిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 


ఆయన పోటీ చేసినా నేను పోటీ చేసినా ఒకటే... !

రీఎంట్రీ ఇస్తున్న నిన్నటితరం "విష కన్య"

జాతిరత్నాలు సీక్వెల్‌: నవీన్ రెమ్యునరేషన్ తెలిస్తే గుండె ఆగుతుంది..!

మా టీమ్ లో కూడా గొడవలు ఉన్నాయి..కుండ బద్దలు కొట్టిన గెటప్ శ్రీను..!

సౌమ్య గా సినీ పరిశ్రమకు వచ్చి ప్రేక్షకుల మనసు గెలుచుకుని సౌందర్యగా మారిన అధ్బుతమైన నటి సౌందర్య. నటిగానే కాకుండా మానవతావాదిగా కీర్తి ప్రతిష్టలు పొందిన అందాల ధృవ తార సౌందర్య. తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ఉన్నతమైన గుర్తింపు పొందిన నటులలో సౌందర్య కూడా ఒకరు.

అనుష్క, నవీన్ ల సినిమా ఉందా లేదా.. క్లారిటీ లేదే!!

బస్ లో టికెట్ లేకుండా దొరికిపోయిన నటి జీవిత

ఆ భామ పనైపోయిందా.. ఎందుకీ గోల?

హీరోయిన్ అయింతీరుతానంటున్న ఫ్యామిలీ మ్యాన్ నర్సు.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>