PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/heavy-rain53a93df4-c462-42b0-ab36-250fa2dad225-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/heavy-rain53a93df4-c462-42b0-ab36-250fa2dad225-415x250-IndiaHerald.jpgకరువు జిల్లా అనంతపురం తడిసి ముదైంది. అసలు నీటి చుక్క కూడా లేని వాగులు ఇప్పుడు పొంగిపొర్లుతున్నాయి. ఏళ్లుగా బీడుబారిన భూములు... వానజల్లుతో పులకించిపోయాయి. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో అనంతపురం జిల్లాలోని వాగులు, వంకలు జలకళను సంతరించుకున్నాయి. వాన చినుకు పడితే చాలనుకునే అన్నదాత సంబరాలు చేసుకుంటున్నారు. ఏకంగా మూడేళ్లకు సరిపడా నీరు చెరువుల్లో చేరిందంటున్నారు రైతన్నలు. Heavy Rain{#}Ananthapuram;Hindupuram;Kadiri;yogi;Aqua;District;Varshamకరువు సీమపై వరుణుడి దయకరువు సీమపై వరుణుడి దయHeavy Rain{#}Ananthapuram;Hindupuram;Kadiri;yogi;Aqua;District;VarshamSun, 18 Jul 2021 14:01:14 GMTకరువు జిల్లా అనంతపురం తడిసి ముదైంది. అసలు నీటి చుక్క కూడా లేని వాగులు ఇప్పుడు పొంగిపొర్లుతున్నాయి. ఏళ్లుగా బీడుబారిన భూములు... వానజల్లుతో పులకించిపోయాయి. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో అనంతపురం జిల్లాలోని వాగులు, వంకలు జలకళను సంతరించుకున్నాయి. వాన చినుకు పడితే చాలనుకునే అన్నదాత  సంబరాలు చేసుకుంటున్నారు. ఏకంగా మూడేళ్లకు సరిపడా నీరు చెరువుల్లో చేరిందంటున్నారు రైతన్నలు.

అనంతపురం జిల్లాను భారీ వర్షం ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి చేసింది. జిల్లాలోని కదిరి, పుట్టపర్తి, హిందూపురం నియోజకవర్గాల్లో ఎన్నడూ లేనంత వర్షం కురిసింది. కదిరి పట్టణంలోనే రికార్డు స్థాయిలో ఏకంగా 26.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కదిరి పట్టణాన్ని అనుకున్న ఉన్న మద్దిలేరు వాగుకు వరద నీరు పోటెత్తింది. వాగు ఉధృతికి పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. రాత్రి కురిసిన వర్షానికి కదిరి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇంటి ముందు పార్క్ చేసిన బైకులు తెల్లారే సరికి ఎక్కడో తేలాయి.

భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల్లోని పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది. అటు హిందూపురంలో పరిస్థితి కూడా సేమ్ ఇలానే ఉంది. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. చిత్రావతి రిజర్వాయర్ పొంగిపొర్లుతోంది. ఇప్పటికే ప్రాజెక్టు రెండు గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. కదిరి చుట్టుపక్కల ఉన్న వాగులు పొంగిపొర్లడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. యోగి వేమన జలాశయం 3 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. కనీవినీ ఎరుగని వానతో పట్టణ వాసులు ఇబ్బందులు పడుతుంటే... అన్నదాతలు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. కదిరి పట్టణంలో అధికారులు యుద్ధప్రాతిపధికన చర్యలు చేపట్టారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని అధికారులు భరోసా ఇచ్చారు.





పవన్ కళ్యాణ్ కు కొత్త పేరు పెట్టిన బండ్ల గణేష్..!

చక్రం సినిమా డిజాస్టర్ అవ్వడానికి కారణం..

తొలి వన్డేకు వరుణ గండం

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అప్పలనాయుడు ఆధిక్యం తగ్గిందా?

అక్కడ టీడీపీని నిలబెట్టాల్సింది పవనేనా...?

జగన్ ఆ ‘ఆరు’ ఫిక్స్ చేస్తారా?

దారంతో తండ్రి మూతి కుట్టి.. కాళ్లూ చేతులు కట్టి.. రైల్వే ట్రాక్‌పై పడేసిన కొడుకు..!!

ఉద్యోగులకు షాక్.. ఇకనుంచి జీన్స్, టీ షర్ట్ నిషేధం?

ఒక్క గంటలో 2 కిలోల బరువు తగ్గిన మహిళ.. అదెలా సాధ్యమైందంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>