PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/trsfeec9ff3-e823-4122-ae2a-32d7cfaf5bfa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/trsfeec9ff3-e823-4122-ae2a-32d7cfaf5bfa-415x250-IndiaHerald.jpg తెలంగాణ‌లోని హెచ్ఎండీఏ, నియోపోలిస్‌ సంయుక్తంగా నిర్వ‌హించిన‌ కోకాపేట్‌, ఖానామెట్ భూముల వేలం మై హోం సంస్థ‌కు లాభం చేకూరేలా ఉందా..? అనే అనుమానాలను ప‌లువురు లేవెత్తుతున్నారు. ఈ వేలం ద్వారా జాతీయ కంపెనీలు తెలంగాణ‌లోకి వ‌స్తాయ‌ని ప్ర‌భుత్వం అనేక క‌మిటీల‌ను కూడా వేసింది. కానీ ఒక్క జాతీయ కంపెనీ మిన‌హా అన్ని తెలంగాణ కంపెనీలే వేలంలో పాల్గొన‌డం రియ‌ల్ ఎస్టేట్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. రాష్ట్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల కోకాపేట్, ఖానామెట్ ప‌రిధిలోని దాదాపు 50 ఎక‌రాలను వేలం వేసింది. దీని ద్వారా 2000 కోట్ల‌నtrs{#}Telanganaభూముల వేలం `మై హోం` ల‌బ్దికేనా..?భూముల వేలం `మై హోం` ల‌బ్దికేనా..?trs{#}TelanganaSun, 18 Jul 2021 09:12:15 GMT  తెలంగాణ‌లోని హెచ్ఎండీఏ, నియోపోలిస్‌ సంయుక్తంగా నిర్వ‌హించిన‌ కోకాపేట్‌, ఖానామెట్ భూముల వేలం మై హోం సంస్థ‌కు లాభం చేకూరేలా ఉందా..? అనే అనుమానాలను ప‌లువురు లేవెత్తుతున్నారు. ఈ వేలం ద్వారా జాతీయ కంపెనీలు తెలంగాణ‌లోకి వ‌స్తాయ‌ని ప్ర‌భుత్వం అనేక క‌మిటీల‌ను కూడా వేసింది. కానీ ఒక్క జాతీయ కంపెనీ మిన‌హా అన్ని తెలంగాణ కంపెనీలే వేలంలో పాల్గొన‌డం రియ‌ల్ ఎస్టేట్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

  రాష్ట్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల కోకాపేట్, ఖానామెట్ ప‌రిధిలోని దాదాపు 50 ఎక‌రాలను వేలం వేసింది. దీని ద్వారా 2000 కోట్ల‌ను స‌మ‌కూర్చుకుంది రాష్ట్ర ప్ర‌భుత్వం. ఎక‌రం 25 కోట్ల చొప్పున బిడ్ ను నిర్ణ‌యించింది.  అయితే ఈ వేలంలో 31.2 కోట్ల నుంచి 61.2 కోట్ల వ‌ర‌కు ఒక ఎక‌రం ప‌లికింది. కాక‌పోతే కోకాపేట‌లోని 50 ఎక‌రాల్లోని 8 ప్లాట్ల‌లో ఎన్ని కంపెనీలు ఆక్ష‌న్ లో పాల్గోన్నాయో అనే విష‌యాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం గోప్యంగా ఉంచింది.


ఏ వేదిక‌లోనైనా భాగ్య‌న‌గ‌రాన్ని అంత‌ర్జాతీయ సిటీగా ప్ర‌భుత్వం చెప్పుకొచ్చింది. కానీ వేలంలో ఒక్క అంత‌ర్జాతీయ కంపెనీ కూడా పాల్గొన‌కుండా కేవ‌లం లోక‌ల్ కంపెనీలు మాత్రమే పాల్గొన‌డం గ‌మ‌నార్హం.  కోకాపేట‌లోని 8 ప్లాట్ల లో నిర్వ‌హించిన వేలంలో 2ప్లాట్లు మై హోం సంస్థ‌కు చెందిన కంపెనీలు ద‌క్కించుకున్న‌ట్టు తెలుస్తోంది. మాదాపూర్‌లో మై హోం కు చెందిన కంపెనీలు ఉన్నాయి. దీంతో ఈ భూముల వేలం మై హోం సంస్థ‌కు ల‌బ్ది చేకూర్చ‌డం కోస‌మేనా.. అనే అనుమానాలు ఇప్పుడు చ‌ర్చ‌నీయంశంగా మారింది.


 మై హోం పేరుతోనే కాకుండా ఇత‌ర పేర్ల‌తో ఆ సంస్థ కింద ఉన్న ఇత‌ర కంపెనీలు ఈ వేలంలో భూములు ద‌క్కించుకోవ‌డం గ‌మ‌నార్హం. ప్రెస్టెజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక్క‌టే నాన్ లోక‌ల్ కంపెనీగా ఈ వేలంలో ఉంది.  మిగ‌తా కంపెనీలు ఎందుకు వేలంలో భాగం కాలేదోన‌న్న విష‌యం రియ‌ల్‌ రంగంతో పాటు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

 భూముల వేలంలో అంత హ‌డావుడి, ఆర్భాటం నిర్వ‌హించిన తెలంగాణ ప్ర‌భుత్వం. జాతీయ, అంత‌ర్జాతీయ కంపెనీలు వేలంలో పాల్గోనేలా చేయ‌డంలో విఫ‌ల‌మ‌యింద‌నే విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. కేవ‌లం కొన్ని కంపెనీల‌కు మాత్ర‌మే లాభం చేకూర్చేలా ఈ వేలం ఉంద‌నే మాట‌లు కూడా విన‌బ‌డ‌తున్నాయి. కొంద‌రు మాత్రం భూముల వేలం ద్వార తెలంగాణ‌కు న‌ష్ట‌మే త‌ప్ప లాభం లేద‌ని అంటున్నారు.









అంటే అన్నాడంటారు గానీ... కెసీఆర్ తపన అర్థం చేసుకోరే మాస్టారూ...?

రేపటి నుండే థియేటర్లు ఓపెన్... శుభారంభం ఇస్తాయా ?

సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్?

హుజురాబాద్ ఉపఎన్నికతో ఉపయోగం లేదు.. పోటీ చెయ్యం : షర్మిల

జగన్ చేసిన పనికి.. మోడీ దగ్గర అడుక్కునే పరిస్థితి వచ్చింది?

టీడీపీ... కేరాఫ్ లీడర్స్

టీడీపీ ఉంటుందా... పోతుందా...

కేసీఆర్ సర్కార్ కు హైకోర్ట్ షాక్...?

ఎట్ట‌కేల‌కు స్పందించిన బాబు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>