SpiritualityVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/spirituality9d63314b-7b88-455b-ab17-541bdf2f72db-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/spirituality9d63314b-7b88-455b-ab17-541bdf2f72db-415x250-IndiaHerald.jpgభగవంతుడు అయినటువంటి శివుడ్ని మన దేశంలో ఎక్కువమంది భక్తులు కొలుస్తుంటారు. అయితే ఆ శివుని గురించి మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఎక్కువగా వినిపించేది. శివుడు ఎవరు? శివుని యొక్క తల్లి తండ్రులు ఎవరు? మరి ఇప్పుడు చూద్దాం. పరమేశ్వరుడు ఆది దేవుడు. spirituality{#}Trimurtulu;Mantra;AdiNarayanaReddy;vishnu;lord siva;Shiva;Yevaruశివుడికి మూడో కన్ను ఎలా వచ్చిందో తెలుసా ?శివుడికి మూడో కన్ను ఎలా వచ్చిందో తెలుసా ?spirituality{#}Trimurtulu;Mantra;AdiNarayanaReddy;vishnu;lord siva;Shiva;YevaruSun, 18 Jul 2021 08:32:40 GMTభగవంతుడు అయినటువంటి శివుడ్ని మన దేశంలో ఎక్కువమంది భక్తులు కొలుస్తుంటారు. అయితే ఆ శివుని గురించి మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఎక్కువగా వినిపించేది. శివుడు ఎవరు? శివుని యొక్క తల్లి తండ్రులు ఎవరు? మరి ఇప్పుడు చూద్దాం. పరమేశ్వరుడు ఆది దేవుడు. రుగ్వేదంలో ఆయన్ని రుద్రుడు అని పిలుస్తారు. శూన్యమే శివుడు. శివ అనగా స్వఛ్చమైనది, నిర్మలమైన అలా ఆ శూన్యమే శివరూపం. శూన్యంలో నుండి పుట్టినదే విశ్వం. ఈ సృష్టికి మూలమైన పరమ శివుడు ఆది దేవుడిగా పిలువబడుతున్నాడు, పూజలందుకుంటున్నాడు. ఆదిదేవుడు అనుటకు గల  తాత్వికమైన వివరణ కూడా ఉంది. ఆ శూన్యం ఆకారం దిద్దుకుంటే కనిపించే రూపమే శివుడు. ఇక నీలకంఠుడు ఎలా జన్మించారు అనగా .. ఒక సమయంలో విష్ణువు అలాగే సృష్టికర్త బ్రహ్మ మన ఇరువురిలో ఎవరు గొప్ప అన్నవిషయం గురించి చర్చించుకుంటూ ఉంటారు. ఇరువురి నడుమ కాస్త వివాదం చోటుచేసుకుంటుంది. 

అలా వారిరువురు  వివాదంలో ఉండగా ఉన్నట్టుండి శూన్యం నుండి ఒక పెద్ద స్తూపం కోటి కాంతుల తేజస్సుతో వారి మధ్య ఒక పెద్ద స్తూపం పడుతుంది. శివునికి మరో రూపమే ఆ స్తూపం వారి నడుమ జన్మించిన వారే పరమ శివుడు.  వాస్తవానికి ఇదంతా ఒక విష్ణు మాయట. వారితో సమనమైంటువంటి శక్తిని ఉద్భవించేందుకు చేసినమాయే ఈ వివాదము అని పురాణాలలో చెప్పబడింది. పురాణం ప్రకారం సృష్టికి మూలమైన ఆదిపరాశక్తి తన మంత్ర బలంతో త్రిమూర్తులైన... బ్రహ్మ, విష్ణువు, శివుడ్ని సృష్టించింది అని ప్రతీతి. అనంతరం ఆదిపరాశక్తి త్రిమూర్తులలో ఎవరైనా ఒకరు తనను వివాహం చేసుకోవాల్సిందిగా ఆజ్ఞాపించిందట. అయితే తొలుత ముగ్గురు త్రిమూర్తులు అందుకు నిరాకరించి ఆమె ఆజ్ఞను వ్యతిరేకించగా ఆదిశక్తి ఆగ్రహానికి గురై తనని వివాహం చేసుకోకపోతే తన మూడో కన్నుతో భస్మము చేస్తానని శపించబోతుండగా నీలకంఠుడు ఆ మూడవ నేత్రం తనకు ఇస్తే వివాహం చేసుకుంటానని అడుగగా మాత తన మూడో కంటిని శివునికి ఇచ్చింది.

అయితే మూడవకన్నుని పొందిన శివుడు తన త్రినేత్రంతో ఆగ్రహంతో ఊగిపోతున్న ఆదిపరాశక్తిని భస్మం చేశారని...అలా బస్మమైన ఆదిపరాశక్తి బూడిదను మూడు భాగాలుగా విబజించి ఒక భాగాన్ని పార్వతిగా, మరో భాగాన్ని లక్ష్మిగా , ఇంకో భాగాన్ని సరస్వతిగా సృష్టించారు అని పురాణాలు చెబుతున్నాయి. దీని ద్వారా ఆగ్రహం అనే అజ్ఞానాన్ని భస్మం చేస్తే శాంతం ఉద్భవిస్తుంది అని ప్రపంచానికి చాటి చెప్పిన లోక కళ్యాణంగా ఈ ఘట్టాన్ని భావిస్తారు.



KGF చాప్టర్ 2 క్లైమాక్స్.. సీట్లలో ఎవరు కూర్చోరట..!

టెన్షన్ పుట్టిస్తున్న యంగ్ టైగర్..

ఎన్టీఆర్ -కొరటాల శివ సినిమాలో యంగ్ హీరో?

ఎన్టీఆర్ 30వ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోయిన్స్?

ఎన్టీఆర్, కొరటాల సినిమాలో మరో నటుడు..?

పౌరాణిక పాత్రల్లో ఆదరగిట్టిన బాలనటులు

కన్ను గీటిందో లేదో.. ప్రేక్షక లోకం దాసోహమంది..!!

శిల్పాశెట్టితో పోటీ ప‌డుతున్న ర‌కుల్‌..?

పెళ్లి పీటలమీద విడిపోయిన జంటలు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>