PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpfb17b7a5-e1b5-4fc4-b760-14aef3ce1067-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ysrcpfb17b7a5-e1b5-4fc4-b760-14aef3ce1067-415x250-IndiaHerald.jpgఇప్పుడు నామినేటెడ్ ప‌ద‌వుల్లోనూ పెద్దిరెడ్డి త‌న వ‌ర్గానికే ప్రాధాన్యం ఇచ్చుకున్నార‌ని అంటున్నారు. జిల్లాలో ఐదుగురు వైసీపీ నేతలకు రాష్ట్రస్థాయి నామినేటెడ్‌ పదవులు లభించాయి. మదనపల్లె వైసీపీలో కీలక నేతగా వున్న మున్సిపల్‌ మాజీ వైస్‌ ఛైర్‌పర్సన్‌ షమీమ్‌ అస్లామ్‌కు ఏపీ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ పదవిని అధిష్ఠానం కట్టబెట్టింది. వైసీపీలోకి వచ్చింది మొదలు పెద్దిరెడ్డిని నమ్ముకున్నందుకు ఎట్టకేలకు న్యాయం జరిగింది. YSRCP{#}AdiNarayanaReddy;Srisailam;Prajarajyam Party;Punganur;Madanapalle;Nagari;bhavana;Minister;YCP;Andhra Pradesh;Partyవైసీపీలో ఆ మంత్రి పంజా విసిరారుగా...!వైసీపీలో ఆ మంత్రి పంజా విసిరారుగా...!YSRCP{#}AdiNarayanaReddy;Srisailam;Prajarajyam Party;Punganur;Madanapalle;Nagari;bhavana;Minister;YCP;Andhra Pradesh;PartySun, 18 Jul 2021 20:06:00 GMTసీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి త‌న స‌త్తా చాటుకున్నార‌ని అంటున్నారు చిత్తూరుజిల్లా రాజ‌కీయ పండితులు. ఆది నుంచి కూడా అంటే.. పార్టీ అధికారంలో లేన‌ప్పుడు కూడా జిల్లాపై ప‌ట్టున్న పెద్దిరెడ్డి.. తాజాగా జ‌రిగిన నామినేటెడ్ ప‌ద‌వుల పందేరంలో త‌న వ్యూహాన్ని ప‌క్కాగా అమ‌లు చేశారు. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ త‌న వ‌ర్గానికి కొత్త‌వారైన‌ప్ప‌టికీ.. అసెంబ్లీలో పోటీ చేసేలా చ‌క్రం తిప్పి.. టికెట్లు ఇప్పించుకున్నారు. శ్రీకాళ‌హ‌స్తి, పూత‌ల‌ప‌ట్టు, ప‌ల‌మ‌నేరు త‌దిత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో పెద్దిరెడ్డి వ‌ర్గ‌మే హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

ఇప్పుడు నామినేటెడ్ ప‌ద‌వుల్లోనూ పెద్దిరెడ్డి త‌న వ‌ర్గానికే ప్రాధాన్యం ఇచ్చుకున్నార‌ని అంటున్నారు. జిల్లాలో ఐదుగురు వైసీపీ నేతలకు రాష్ట్రస్థాయి నామినేటెడ్‌ పదవులు లభించాయి. మదనపల్లె వైసీపీలో కీలక నేతగా వున్న మున్సిపల్‌ మాజీ వైస్‌ ఛైర్‌పర్సన్‌ షమీమ్‌ అస్లామ్‌కు ఏపీ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ పదవిని అధిష్ఠానం కట్టబెట్టింది. వైసీపీలోకి వచ్చింది మొదలు పెద్దిరెడ్డిని నమ్ముకున్నందుకు ఎట్టకేలకు న్యాయం జరిగింది.

వైసీపీ మైనార్టీ విభాగ అధ్యక్షుడైన ఖాదర్‌ బాషా వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌గా నియమితులయ్యారు. పుంగనూరు నుంచీ గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలిచిన ఖాదర్‌ బాషా తర్వాత పెద్దిరెడ్డి అనుచరుడిగా మారారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనే ఈయనకు సముచిత పదవి దక్కిందన్న భావన అక్కడి ముస్లిం మైనారిటీ వర్గాల్లో వినిపిస్తోంది. నగరి నియోజకవర్గం నిండ్ర మండలానికి చెందిన రెడ్డివారి చక్రపాణిరెడ్డికి శ్రీశైలం ఆలయ ట్రస్టు బోర్డు ఛైర్మన్‌గా అవకాశం వచ్చింది.

ఈయన మాజీ మంత్రి రెడ్డివారి చెంగారెడ్డి సోదరుడి కుమారుడు. ఆ నియోజకవర్గ వైసీపీలో కీలక నేతగా వుంటూ మంత్రి పెద్దిరెడ్డి వెన్నంటి నడుస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయానికి ప్రాతినిధ్యం వహించే అదృష్టం దక్కింది. వాస్తవానికి ఈయన కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి ఆశించినా దానికి తీసిపోని పదవే వచ్చినట్టయింది. ఇలా మొత్తంగా జిల్లాలో పెద్దిరెడ్డి త‌న హ‌వాను నిల‌బెట్టుకున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.



మేమంటే అంత చిన్న‌చూపా?

నామినేటెడ్ ప‌ద‌వుల్లో పెద్దిరెడ్డి వ‌ర్గానికే ఎక్కువ ప‌ద‌వులు ?

హుజూరాబాద్‌లో అప్పుడే పంప‌కాలు... ఆ గిఫ్ట్‌లు ఇవే ?

నాడు అన్యాయం చేసిన నేత‌ను గుర్తించిన జ‌గ‌న్‌..!

రుచిగా ఉందని ఒకేసారి ఆ బాటిల్స్ ని తాగేసిన హీరో అర్జున్

జ‌గ‌న్ ఎంత ప‌నిచేశాడు... పార్టీకి దెబ్బ కొడుతుందా ?

గంట ముందే రావాలంటూ మోదీ వార్నింగ్

జ‌గ‌న్ ద‌గ్గ‌ర పంతం నెగ్గించుకున్న వైసీపీ నేత‌లు..!

మహిళా కోటా అంటూ జ‌గ‌న్ భ‌లే దెబ్బేశాడే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>