CookingSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/cooking/81/india-herald-special-curry510242d1-b58f-401b-b3d4-6808a96464f2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/cooking/81/india-herald-special-curry510242d1-b58f-401b-b3d4-6808a96464f2-415x250-IndiaHerald.jpgగోంగూర అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. పుల్ల పుల్లగా తినడానికి చాలా టేస్టీ గా ఉంటుంది. గోంగూరతో మనం ఎన్నో రకాల కాంబినేషన్స్ వండుతాము కదా. అయితే ఇప్పుడు ఇండియా హెరాల్డ్ వారు చెప్పే గోంగూర ఎగ్ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతో రుచికరంగా ఉంటుంది. ఒకసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ కావాలని మీరే అంటారు. మరి గోంగూర ఎగ్ రెసిపీకి కావలిసిన పదార్ధాలు ఏంటో ఒకసారి చూద్దామా. ! కావలిసిన పదార్ధాలు : 150 నుండి 200 గ్రాములు గోంగూర 6 గుడ్లు 2 పెద్ద ఉల్లిపాయలు 6 లేదా 7 పచ్చి మిరప కాయలు ½ tsp పసుపindia herald- special curry{#}Egg;Yevaru;Manam;India;Onion;Gas Stove;oil;Ginger;Dhaniya Powderగోంగూర - ఎగ్ కాంబినేషన్ అదరహో ..!గోంగూర - ఎగ్ కాంబినేషన్ అదరహో ..!india herald- special curry{#}Egg;Yevaru;Manam;India;Onion;Gas Stove;oil;Ginger;Dhaniya PowderSun, 18 Jul 2021 12:00:00 GMTఇండియా హెరాల్డ్ వారు చెప్పే గోంగూర ఎగ్ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతో రుచికరంగా ఉంటుంది. ఒకసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ కావాలని మీరే అంటారు. మరి గోంగూర ఎగ్ రెసిపీకి కావలిసిన  పదార్ధాలు ఏంటో ఒకసారి చూద్దామా. !

కావలిసిన పదార్ధాలు :

150 నుండి 200 గ్రాములు గోంగూర

6 గుడ్లు

2 పెద్ద ఉల్లిపాయలు

6 లేదా 7 పచ్చి మిరప కాయలు

½ tsp పసుపు

ఉప్పు తగినంత

2 నుండి ౩ tbsp కారం

1 tsp ధనియాల పొడి

2 ఏలకులు

4 లవంగాలు

1 అంగుళం దాల్చిన చెక్క

నూనె సరిపడా

౩ ఎండు మిరప కాయలు

1 కప్పు నీళ్ళు

తయారీ విధానం :

ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో కోడి గుడ్లు వేసి ఉడకబెట్టండి.  గోంగూరను నీటితో శుభ్రంగా కడగండి.. తరువాత ఒక బాండీ స్టవ్ మీద పెట్టి కొద్దిగా నూనె పోసి అందులో పచ్చిమిరపకాయ ముక్కలు,  గోంగూర వేసి మెత్తగా అయ్యే వరకు వేపండి. గోంగూర మెత్తగా అయిన తరువాత పొయ్యి ఆఫ్ చేసి గోంగూర మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి బాగా మెత్తగా కాకుండా ఒక మాదిరిగా పేస్ట్ చేసుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక కడాయిలో నూనె వేడి చేసి అందులో రెండు ఏలకులు, నాలుగు లవంగాలు,కొద్దిగా దాల్చినచెక్క, ఎండు మిరప కాయలు వేసి మంచి వాసన వచ్చే దాక వేపుకోండి.  ఇప్పుడు అందులో సన్నగా బారుగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కలు వేయండి. తరువాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వరసగా వేయండి.తరువాత ఉడికించుకున్న కోడి గుడ్లుకు చాకుతో అక్కడక్కడా గాట్లు పెట్టి వాటిని కూడా బాండీలో వేయండి. ఒక ఐదు నిముషాలు వేగిన తరువాత గోంగూర పేస్ట్ వేసి కొద్దిగా నీళ్ళు పోసి బాగా కలపాలి.కారం కొద్దిగా ఎక్కువగా వేసుకోండి. ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి. నూనె పైకి కనిపించే అంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి.




ఇండియా - శ్రీలంక సిరీస్.. గెలుపు మనదే?

గోంగూర - ఎగ్ కాంబినేషన్ ఎప్పుడన్నా ట్రై చేసారా.?

ఆఫర్స్ లేక.. అదే దిక్కు అంటున్న స్టార్ కమెడియన్ ?

ఎన్టీఆర్ సినిమా కి ఆ టచ్ ఇవ్వనున్న కొరటాల శివ!!

ఏ వయసు వారు ఎంత సమయం నిద్రపోవాలో తెలుసా?

ప్రభాస్ డెడికేషన్ తెలిపే రెండు ఉదాహరణలు..!

రేవంత్ కు షర్మిల ఇంత సీరియస్ వార్నింగ్ ఇచ్చారా...?

టోక్యో ఒలంపిక్స్.. వారికి నో క్వారంటైన్?

మనీ : హోమ్ లోన్ కి ఏ బ్యాంకు ఎంత వడ్డీ.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>