PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb087d0fc-9b6b-4531-b086-8948c596ee59-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb087d0fc-9b6b-4531-b086-8948c596ee59-415x250-IndiaHerald.jpgఅయిన‌ప్ప‌టికీ.. కేడ‌ర్‌లో ప‌ట్టు స‌డ‌ల‌కుండా.. వ్య‌వ‌హ‌రించ‌డం.. న‌వీన్‌ను నాయ‌కుడిగా నిల‌బెట్టింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న వైసీపీకి మ‌ద్ద‌తుదారుగా మారారు. జ‌గ‌న్ ప‌ట్ల ఎంతో ఆద‌రాభిమానాలు చూపించే న‌వీన్‌.. పార్టీలో ఎన్ని ఒడిదుడుకులు వ‌చ్చినా.. ప‌ట్టు వ‌ద‌ల‌కుండా.. కొన‌సాగుతున్నారు. దీంతో జ‌గ‌న్ ఆయ‌న‌కు 2014లో పోటీ చేసే అవ‌కాశం క‌ల్పించారు అయితే.. వ‌రుస‌గా ఆయ‌న మూడోసారి కూడా ప‌రాజ‌యం పాల‌య్యారు. ఇక‌, గ‌త ఎన్నిక‌ల స‌మ‌యానికి న‌వీన్‌కు వ్య‌తిరేకంగా కొంద‌రు కీల‌క నేత‌లు చ‌క్రంతిప్ప‌డంతో ఆయ‌న‌కు టికెట్ మిJagan Ysrcp{#}Hindupuram;Congress;Y. S. Rajasekhara Reddy;MP;Andhra Pradesh;TDP;CM;Partyనాడు అన్యాయం చేసిన నేత‌ను గుర్తించిన జ‌గ‌న్‌..!నాడు అన్యాయం చేసిన నేత‌ను గుర్తించిన జ‌గ‌న్‌..!Jagan Ysrcp{#}Hindupuram;Congress;Y. S. Rajasekhara Reddy;MP;Andhra Pradesh;TDP;CM;PartySun, 18 Jul 2021 19:20:00 GMTఅనంత‌పురం జిల్లాల‌లో ఎన్నాళ్లుగానే గుర్తింపు కోసం ఎదురు చూస్తున్న కీలక నాయ‌కుడు.. న‌వీన్ నిశ్చ‌ల్‌కు తాజాగా జ‌రిగిన నామినేటెడ్ ప‌ద‌వుల కూర్పులో మంచి పొజిష‌నే ద‌క్కింది. హిందూపురం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన న‌వీన్ నిశ్చ‌ల్‌.. పార్టీలో యాక్టివ్‌గా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో కీల‌క నేత‌గా ఎదిగిన నిశ్చ‌ల్‌.. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మ‌ద్ద‌తు దారుగా చెప్పుకొంటారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు 2004, 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఇక్క‌డ నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవ‌కాశం ఇచ్చింది. అయితే.. ఆయా ఎన్నిక‌ల్లో న‌వీన్ విజ‌యం సాధించ‌లేక పోయారు. కేవ‌లం 7 వేలు, 8 వేల ఓట్ల తేడాతో ఆయ‌న ప‌రాజ‌యం పాల‌య్యారు.

అయిన‌ప్ప‌టికీ.. కేడ‌ర్‌లో ప‌ట్టు స‌డ‌ల‌కుండా.. వ్య‌వ‌హ‌రించ‌డం.. న‌వీన్‌ను నాయ‌కుడిగా నిల‌బెట్టింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న వైసీపీకి మ‌ద్ద‌తుదారుగా మారారు. జ‌గ‌న్ ప‌ట్ల ఎంతో ఆద‌రాభిమానాలు చూపించే న‌వీన్‌.. పార్టీలో ఎన్ని ఒడిదుడుకులు వ‌చ్చినా.. ప‌ట్టు వ‌ద‌ల‌కుండా.. కొన‌సాగుతున్నారు. దీంతో జ‌గ‌న్ ఆయ‌న‌కు 2014లో పోటీ చేసే అవ‌కాశం క‌ల్పించారు అయితే.. వ‌రుస‌గా ఆయ‌న మూడోసారి కూడా ప‌రాజ‌యం పాల‌య్యారు. ఇక‌, గ‌త ఎన్నిక‌ల స‌మ‌యానికి న‌వీన్‌కు వ్య‌తిరేకంగా కొంద‌రు కీల‌క నేత‌లు చ‌క్రంతిప్ప‌డంతో ఆయ‌న‌కు టికెట్ మిస్స‌యింది.

దీంతో ఎన్నిక‌ల‌కు ముందు.. ఒకింత హ‌ల్‌చ‌ల్ చేసినా.. పార్టీ నిల‌బెట్టిన అభ్య‌ర్థికి మ‌ద్ద‌తుగా నిల‌చారు. ఇక‌, అప్ప‌టి నుంచి కూడా పార్టీలో ఆయ‌న‌కు గుర్తింపు లేద‌నే టాక్ వినిపించింది. హిందూపురం నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్‌గా ఉన్న‌ప్ప‌టికీ.. ఎంపీ హ‌వాతో ఆయ‌న వాయిస్ ఎక్క‌డా వినిపించ‌లేదు. ఈ స‌మ‌యంలో తాజాగా ప్ర‌క‌టించిన నామినేటెడ్ ప‌ద‌వుల్లో.. రాష్ట్ర‌స్థాయి ప‌ద‌వి అయిన‌.. ఏపీ ఆగ్రోస్ డెవ‌ల‌ప్‌మెంట్ చైర్మ‌న్ ప‌ద‌విని న‌వీన్‌కు ఇచ్చారు.

ఇది రాష్ట్ర‌స్థాయిలో మంచి పోస్టేన‌ని.. ముఖ్యంగా సీఎం జ‌గ‌న్ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న‌ రైతు భ‌రోసా కేంద్రాల‌తో అనుసంధాన‌మైన శాఖ‌గా దీనికి పేరుంది. ఈ క్ర‌మంలో న‌వీన్‌కు మంచి ప‌ద‌వి ద‌క్కింద‌నే టాక్ వినిపిస్తోంది.దీనిపై న‌వీన్ హ‌ర్షం వ్య‌క్తం చేస్తూనే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ద‌క్కించుకున్న టీడీపీ ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌య్య‌ను ఓడించ‌డ‌మే త‌న ల‌క్ష్యమ‌ని అంటుండ‌డం గ‌మ‌నార్హం.





బాల‌య్య ప్ర‌త్య‌ర్థి న‌వీన్‌కు ఏపీ ఆగ్రోస్ డెవ‌ల‌ప్‌మెంట్ చైర్మ‌న్ ప‌ద‌వి ..!

రుచిగా ఉందని ఒకేసారి ఆ బాటిల్స్ ని తాగేసిన హీరో అర్జున్

జ‌గ‌న్ ఎంత ప‌నిచేశాడు... పార్టీకి దెబ్బ కొడుతుందా ?

గంట ముందే రావాలంటూ మోదీ వార్నింగ్

జ‌గ‌న్ ద‌గ్గ‌ర పంతం నెగ్గించుకున్న వైసీపీ నేత‌లు..!

నామినేటెడ్ ప‌ద‌వుల్లో తూర్పు గోదావ‌రికి ప్రాధాన్యం ?

మహిళా కోటా అంటూ జ‌గ‌న్ భ‌లే దెబ్బేశాడే ?

సొంత పార్టీ వాళ్ల‌నే మోసం చేసిన చంద్రబాబు... ?

కేంద్రం తీరు సరిగ్గా లేదన్న విజయసాయిరెడ్డి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>