PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/indian-army-offers-womensd1cf9d92-6d82-4645-aeb3-c5dc2770d68c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/indian-army-offers-womensd1cf9d92-6d82-4645-aeb3-c5dc2770d68c-415x250-IndiaHerald.jpgఇండియన్ ఆర్మీ మహిళలకు గొప్ప అవకాశం కల్పిస్తోంది. దాదాపు 100పోస్టులను రిలీజ్ చేసింది. ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచిస్తో్ంది. ఇంకేముందీ అమ్మాయిలు అప్లై చేసుకునేందుకు పరుగులు పెడుతున్నారు. దేశానికి తమ సేవలు అందించాలని ఆరాట పడుతున్నారు. indian army offers womens{#}Army;Application;Service;Government;policeజులై 20 చివరి తేదీ.. వెంటనే అప్లై చేసుకోండి..!జులై 20 చివరి తేదీ.. వెంటనే అప్లై చేసుకోండి..!indian army offers womens{#}Army;Application;Service;Government;policeSun, 18 Jul 2021 19:05:54 GMTభారత ఆర్మీలో చేరాలనుకునే మహిళలకు రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. 100మిలిటరీ పోలీసు ఉద్యోగాల కోసం జులై 20వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 17.5సంవత్సరాల వయసు నుంచి 21ఏళ్ల వయసున్న అమ్మాయిలు ఈ ఉద్యోగానికి అర్హులు. పదో తరగతిలో 45శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అప్లై చేసుకున్న వారికి తొలుత ఫిజికల్ టెస్ట్ నిర్వహిస్తారు. తర్వాత మెడికల్ స్టాండర్డ్స్, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. అంబాలా, లక్నో, జబల్ పూర్, బెల్గాం, పుణె, షిల్లాంగ్ లో రిక్రూట్ మెంట్ ర్యాలీలు జరుగనున్నాయి.

భారత దేశానికి సేవ చేసేందుకు పురుషులే కాదు మహిళలు కూడా తామున్నామంటూ ముందుకు వస్తున్నారు. భారతదేశ ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. తమ యవ్వన ప్రాయాన్ని దేశ సేవలో వినియోగించేందుకు సిద్ధమంటున్నారు. దేశ సరిహద్దుల్లో ఎండనకా.. వాననకా.. చలి అనకా.. కంటిమీద కునుకు తీయకుండా కాపలా కాసేందుకు తాము సైతం అంటున్నారు. బార్డర్ లో గస్తీ కాస్తూ ఉగ్రమూకల్ని ఏరి వేసేందుకు రెడీ అంటున్నారు అమ్మాయిలు.

దేశ సరిహద్దుల్లో ఇటు పాకిస్థాన్.. అటు చైనా నుండి ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుండటంతో ఇప్పటికే ఎంతో మంది జవాన్లు అమరులయ్యారు. దేశ రక్షణలో తమ ప్రాణాలు అర్పించి వీరులయ్యారు. అలాంటి వాళ్లను స్ఫూర్తిగా తీసుకుంటున్నారు మహిళలు. భారత ఆర్మీ సైనిక ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడగానే.. వేలాది మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. దేశాన్ని కాపాడటంలో తమ పాత్ర ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. భర్తను.. పిల్లలను.. తల్లిదండ్రులను వదిలి.. సరిహద్దుల్లో కాపలా కాస్తామంటున్నారు. అంతేకాదు అన్నీ కుదిరి సెలక్ట్ అయ్యాక కష్టతరమైన ట్రైనింగ్ పీరియడ్ ను దేశానికి సేవచేయాలనే కసితో పూర్తి చేసుకుంటున్నారు. ఏది ఏమైనా అమ్మాయిలకు గొప్ప అవకాశం వచ్చేసింది. ఆ ఉద్యోగాలను సాధించుకునే ప్రయత్నం చేస్తున్న వారికి ఆల్ ది బెస్ట్ చెబుదాం. భారత ఆర్మీలో సేవ చేయాలనుకునే వారు త్వరపడండి.









6వేల అడుగుల ఎత్తు నుంచి జారిపడ్డ యువతులు.. వీడియో వైరల్!

పరాయి మహిళపై కోరిక.. చివరికి ఎంత వరకు దారి తీసిందంటే?

ఏపీ ప్రభుత్వ పనితీరుకు అరుదైన గుర్తింపు

కేసీఆర్ కు "లవ్ యూ" చెప్పిన కమెడియన్?

బ్రేకింగ్: హైదరాబాద్ పర్యటనకు కెసీఆర్...?

మేము సిద్ధం, ఆయన సిద్ధమా?

భారత వాయు ద‌ళంలోకి `రోమియో`లు.. వాటి స్పీడ్‌తో శ‌త్రువులకు హ‌డ‌ల్‌..!

యూరప్ లో వరదల బీభత్సం..200 మంది మృతి.. !

వైరల్: సోనూ చేసిన ఆ పనికి నెటిజన్స్ ఫిదా.. అసలు మ్యాటర్ ఏమిటంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>