PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp-targets-vijayasaireddy-on-ramateerdham31d2ecb1-35d4-40c7-bc49-0e45feef845e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp-targets-vijayasaireddy-on-ramateerdham31d2ecb1-35d4-40c7-bc49-0e45feef845e-415x250-IndiaHerald.jpgకేంద్ర ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిరాయింపుల నిరోధక చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విజయసాయిరెడ్డి... రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని చాలా విషయాల్లో నిలదీస్తామన్నారు. శరద్ యాదవ్ విషయంలో నోటీసులు ఇచ్చిన వారం రోజుల్లోనే అనర్హత వేటు వేసిన అంశాన్ని గుర్తు చేసిన విజయసాయిరెడ్డి... రఘురామ కృష్ణంరాజు విషయంలో మాత్రం దుర్మార్గంగVijaysai{#}Kanumuru Raghu Rama Krishnam Raju;Supreme Court;court;central government;prema;Parliment;Prime Minister;Love;Andhra Pradesh;TDP;YCPకేంద్రం తీరు సరిగ్గా లేదన్న విజయసాయిరెడ్డికేంద్రం తీరు సరిగ్గా లేదన్న విజయసాయిరెడ్డిVijaysai{#}Kanumuru Raghu Rama Krishnam Raju;Supreme Court;court;central government;prema;Parliment;Prime Minister;Love;Andhra Pradesh;TDP;YCPSun, 18 Jul 2021 18:05:00 GMTకేంద్ర ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిరాయింపుల నిరోధక చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ తరఫున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విజయసాయిరెడ్డి... రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని చాలా విషయాల్లో నిలదీస్తామన్నారు. శరద్ యాదవ్ విషయంలో నోటీసులు ఇచ్చిన వారం రోజుల్లోనే అనర్హత వేటు వేసిన అంశాన్ని గుర్తు చేసిన విజయసాయిరెడ్డి... రఘురామ కృష్ణంరాజు విషయంలో మాత్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు.

11 నెలల క్రితం అనర్హత పిటిషన్ వేస్తే... ఇప్పుడు స్పీకర్ నిద్ర లేచారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఉద్ధేశ పూర్వకంగానే కాలయాపన చేస్తున్న ప్రభుత్వం... కావాలని కొద్ది రోజుల క్రితం పిటిషన్ లో లోపాలున్నాయని... వాటిని సరిచేయాలని తమకు తిప్పి పంపారన్నారు. కేంద్రం మొద్దు  నిద్ర పోతోందంటూ వ్యాఖ్యానించిన విజయసాయిరెడ్డి.... అనర్హత పిటిషన్ కు సంబంధించి సుప్రీం కోర్టు గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను గుర్తు చేశారు. అత్యున్నత న్యాయస్థానం మార్గదర్శకాల ప్రకారం చట్టంలో మార్పులు చేయాలని కోరిన విషయాన్ని కూడా విజయసాయి ప్రస్తావించారు. మూడు నుంచి ఆరు నెలల కాలంలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ స్పష్టంగా ఉన్నప్పటికీ.... బీజేపీకి అనుకూలంగా ఉన్న వారిపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వ వైఖరి చాలా దుర్మార్గంగా ఉందన్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. కేంద్రం అవలంభిస్తున్న ద్వంద్వ ప్రమాణాలను మార్చుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోందని... ప్రధానమంత్రి ఆవాస యోజన కింద మౌలిక వసతుల కల్పనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 11 వేల కోట్ల రూపాయలు వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రస్తావిస్తామన్నారు. రాష్ట్రానికి రావాల్సిన హక్కులపై కేంద్రాన్ని పార్లమెంట్ లోనే నిలదీస్తామని వార్నింగ్ ఇచ్చారు విజయసాయిరెడ్డి. టీడీపీ ఎంపీలు రాజీనామాలు చేయడం వల్ల పెద్దగా ఒరిగేది ఏం లేదంటూ ఎద్దేవా చేశారు.





కౌంట్ డౌన్ మొదలైంది... ఏపీలో అక్క‌డ ఉప ఎన్నిక త‌ప్ప‌దా ?

ఈ ఒక్క ప‌నితో జ‌గ‌న్ క్రెడిబిలిటీ పెరిగిందా ?

వైసీపీ క్లీన్‌స్వీప్ చేసిన జిల్లాలో టీడీపీకి లీడింగ్...!

సొమ్ము ఒకడిది.. సోకు ఒకడిది... ఆదే ఏపీ స్పెషల్

ఏపీ ప్రభుత్వ పనితీరుకు అరుదైన గుర్తింపు

నటి సుమలత గురించి ఈ విషయాలు తెలుసా.. ?

దేశంలోనే తొలి స్మార్ట్ కరెంటు పోల్.. ఫీచర్లు తెలిస్తే అవాక్కవుతారు..!

కేసీఆర్ కు "లవ్ యూ" చెప్పిన కమెడియన్?

బిజెపి ని టార్గెట్ చేసిన విజయసాయి...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>