PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/coronaviruscf1ae1a0-58ac-4098-959e-2ecfa369a39b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/coronaviruscf1ae1a0-58ac-4098-959e-2ecfa369a39b-415x250-IndiaHerald.jpgకరోనా కాస్త తగ్గిందని.. అన్ని లాక్‌డౌన్ నిబంధనలు సడలించి కొన్ని రోజులైనా కావడం లేదు.. అప్పుడే బ్యాడ్‌ న్యూస్ వినిపిస్తున్నాయి. ప్రపంచాన్ని కొత్త కరోనా వేరియంట్లు చుట్టుముడుతున్నాయన్న వార్తలు భయం గొలుపుతున్నాయి. కరోనా వేరియంట్ల విజృంభణతో ప్రపంచ వ్యాప్తంగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. క్రమంగా మరణాల పెరుగుదల కూడా పెరగడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. మెున్నటి దాకా వైరస్‌ను సమర్థవంతంగా అణిచివేసిన దేశాలు సైతం పెరుగుతున్న కేసులతో సతమతమవుతున్నాయి. ఏ దేశంలోనూ మహమ్మారి ముగింపునకు రాలేదని ఏకంగా ప్రపంచcoronavirus{#}oxygen;News;Coronavirusబాబాయ్.. కరోనా.. మళ్లీ పంజా విప్పుతోంది..?బాబాయ్.. కరోనా.. మళ్లీ పంజా విప్పుతోంది..?coronavirus{#}oxygen;News;CoronavirusSun, 18 Jul 2021 23:00:00 GMTకరోనా కాస్త తగ్గిందని.. అన్ని లాక్‌డౌన్ నిబంధనలు సడలించి కొన్ని రోజులైనా కావడం లేదు.. అప్పుడే బ్యాడ్‌ న్యూస్ వినిపిస్తున్నాయి. ప్రపంచాన్ని కొత్త కరోనా వేరియంట్లు చుట్టుముడుతున్నాయన్న వార్తలు భయం గొలుపుతున్నాయి. కరోనా వేరియంట్ల విజృంభణతో ప్రపంచ వ్యాప్తంగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. క్రమంగా మరణాల పెరుగుదల కూడా పెరగడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.


మెున్నటి దాకా  వైరస్‌ను సమర్థవంతంగా అణిచివేసిన దేశాలు సైతం పెరుగుతున్న కేసులతో  సతమతమవుతున్నాయి. ఏ దేశంలోనూ మహమ్మారి ముగింపునకు రాలేదని ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. కరోనాలో ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్న కొత్త రకం వైరస్‌లు దాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. కొత్త వేరియంట్లతో కరోనాను  నిలువరించడాన్ని మరింత కష్టమవుతోంది. ప్రమాదకరమైన కొత్త వేరియంట్ల ఉద్ధృతి వాటిని నివారించేందుకు  సవాలుగా మారుతోంది.


కరోనా విషయంలో ఆఫ్రికా దేశాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అక్కడ ఇప్పుడు మరోసారి పరిస్థితి అదుపుతప్పుతోంది. వారం వ్యవధిలో ఆఫ్రికా ఖండంలో వైరస్ మరణాలు 43 శాతం పెరిగాయి. రువాండాలో మళ్లీ లాక్‌ డౌన్ విధించారు. గతంలో కఠిన ఆంక్షల ద్వారా కాస్త కరోనాను నియంత్రించినా.. ఇప్పుడు కరోనా విజృంభిస్తోంది. దక్షిణాకొరియాలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. అమెరికాలోనూ గత మూడు వారాలతో పోలిస్తే రోజూవారీ కేసులు రెట్టింపయ్యాయి.  


మరో ఆసియా దేశం ఇండోనేసియాను కరోనా చుట్టేస్తోంది. ఇండోనేషియాలో కొత్తగా.... 50 వేలకు పైగా కేసులు వెలుగుచూశాయి.ఈ దేశంలో వైరస్ వ్యాప్తి భారత్‌ను అధిగమించింది. ఇప్పటికే సైనిక తిరుగుబాటుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మయన్మార్ ప్రజలకు కరోనా కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అతి పెద్ద నగరమైన  యంగూన్‌లో ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. అటు అర్జెంటినాలో కొవిడ్‌ మరణాల సంఖ్య లక్ష దాటింది. రష్యాలోనూ ఈ వారంలో అత్యధిక రోజువారీ కేసులు నమోదయ్యాయి. మొత్తం మీద ప్రపంచంలో ఎటు చూసినా మరోసారి కరోనా విజృంభణే కనిపిస్తోంది.





హడలు పుట్టించిన 11 అడుగుల పాము....

కరోనా కాస్త తగ్గిందని.. అన్ని లాక్‌డౌన్ నిబంధనలు సడలించి కొన్ని రోజులైనా కావడం లేదు.. అప్పుడే బ్యాడ్‌ న్యూస్ వినిపిస్తున్నాయి. ప్రపంచాన్ని కొత్త కరోనా వేరియంట్లు చుట్టుముడుతున్నాయన్న వార్తలు భయం గొలుపుతున్నాయి. కరోనా వేరియంట్ల విజృంభణతో ప్రపంచ వ్యాప్తంగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. క్రమంగా మరణాల పెరుగుదల కూడా పెరగడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.

అల్లుఅర్జున్ పుష్ప రెండవ భాగంలో మరో స్టార్ హీరోయిన్?

యూజిసి అకడమిక్ పూర్తి వివరాలివే..

అనుమానాస్పదంగా సచివాలయం ఉద్యోగి మృతి..!

మరోసారి ఫోన్ ట్యాపింగ్ కలకలం

మినీ స్టూడియోల కాన్సెప్ట్ తో ప్రముఖ నిర్మాత... ?

పాన్ ఇండియా పేరుతో బాగా పెంచేశారు... ?

గంట ముందే రావాలంటూ మోదీ వార్నింగ్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>