PoliticsSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan05b29efa-2ecc-4598-8dd3-7e0191d97539-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan05b29efa-2ecc-4598-8dd3-7e0191d97539-415x250-IndiaHerald.jpgతాంబూలాలు ఇచ్చేశాం అన్నట్లుగా ఏపీలో అతి పెద్ద నామినేటెడ్ పదవుల జాతర సాగిపోయింది. జగన్ పదవులు ఇచ్చేశారు. దాదాపుగా ఈ పదవులు అన్నీ కూడా లెక్క కడితే వేయికి పైగానే ఉంటాయి. అంటే వైసీపీలో ఉన్న ఇంత పెద్ద రాజకీయ నిరుద్యోగాన్ని జగన్ ఒక్క దెబ్బకు తీర్చేశారు అన్న మాట. jagan{#}festival;Raccha;Minister;TDP;Jagan;Partyజగన్ పదవులు ఇచ్చేశారు కానీ... ?జగన్ పదవులు ఇచ్చేశారు కానీ... ?jagan{#}festival;Raccha;Minister;TDP;Jagan;PartySun, 18 Jul 2021 21:00:00 GMTతాంబూలాలు ఇచ్చేశాం అన్నట్లుగా ఏపీలో అతి పెద్ద నామినేటెడ్ పదవుల జాతర సాగిపోయింది. జగన్ పదవులు ఇచ్చేశారు. దాదాపుగా ఈ పదవులు అన్నీ కూడా లెక్క కడితే వేయికి పైగానే ఉంటాయి. అంటే వైసీపీలో ఉన్న ఇంత పెద్ద రాజకీయ నిరుద్యోగాన్ని జగన్ ఒక్క దెబ్బకు తీర్చేశారు అన్న మాట.

అంతవరకూ బాగానే ఉంది. మరి వీరికి ఆఫీసులు, జీతాలు, మౌలిక సదుపాయాలు అన్నీ కూడా చూడాలి కదా. పదవులు ఇచ్చేస్తే కుదురుతుందా. నిధులు విధులు లేని పదవులు ఎందుకు. మరి ఈ పోస్టులలో ఉన్న వారికి అన్నీ సమకూర్చే ఆర్ధిక  స్తోమత ప్రభుత్వానికి ఉందా అన్నదే ఇపుడు చర్చ. ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకే డబ్బులు లేక అప్పులు తెస్తున్నారు. అలాంటిది ఈ రాజకీయ ఉద్యోగాలకు జీతాలు ఎక్కడ నుంచి తెస్తారు అన్నదే పెద్ద చర్చగా ఉంది.

మరో వైపు చూస్తే సామాజిక న్యాయం అంటూ జగన్ పదవులు పంచి బాగానే  పేరు తెచ్చుకున్నారు. బీసీలకు 56 కార్పోరేషన్లు ఏర్పాటు చేశారు. మరి వారికే ఇప్పటిదాకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని గగ్గోలు పెడుతున్నారు. వారికి కూడా జీతాలు గొప్పగా ప్రకటించారు. కానీ కూడా ఈ రోజుకీ  ఇవ్వలేదని టాక్. మరిపుడు ఈ పెద్ద పదవులలో ఉన్న వారికి కూడా జీతాలు ఇవ్వకపోతే మాకెందుకీ పదవులు అంటూ రచ్చ బయల్దేరినా   ఆశ్చర్యపోనక్కరలేదని అంటున్నారు. మొత్తానికి చూస్తే అపుడే ఏం అయింది ముందుంది పండుగ అంటున్నారు టీడీపీ నేతలు. దీని మీద మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామక్రిష్ణుడు మాట్లాడుతూ పదవులు ఇచ్చారు కానీ  వారి జీతాల కొరకు అప్పులు తెస్తారా అంటూ ఎకసెక్కమాడారు. మరి చూడాలి కొత్త ఉద్యోగాలకు ఏ రకమైన ఆర్ధిక న్యాయం జరుగుతుందో. ఏది ఏమైనా ముందు పదవులు దొరికాయి. ఆ సంబరంలో పార్టీ నేతలు ఫుల్ ఖుషీగా ఉన్నారు.







మేమంటే అంత చిన్న‌చూపా?

తాంబూలాలు ఇచ్చేశాం అన్నట్లుగా ఏపీలో అతి పెద్ద నామినేటెడ్ పదవుల జాతర సాగిపోయింది. జగన్ పదవులు ఇచ్చేశారు. దాదాపుగా ఈ పదవులు అన్నీ కూడా లెక్క కడితే వేయికి పైగానే ఉంటాయి. అంటే వైసీపీలో ఉన్న ఇంత పెద్ద రాజకీయ నిరుద్యోగాన్ని జగన్ ఒక్క దెబ్బకు తీర్చేశారు అన్న మాట.

వైసీపీలో ఆ మంత్రి పంజా విసిరారుగా...!

తెలుగుదేశం పార్టీ మరీ అలా అయిపోయిందా అంటే సమాధానం మాత్రం చెప్పడం కష్టమే. టీడీపీ ఉమ్మడి ఏపీలో బలమైన పార్టీ. నాలుగు దశాబ్దాల హిస్టరీ ఉన్న పార్టీ. పైగా టీడీపీ ఏకంగా 22 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. ఇక మిగిలిన కాలం అంతా ప్రధాన ప్రతిపక్షంగా ఉంది.

టీడీపీ విలీనం అవాల్సిందేనా... ?

హుజూరాబాద్‌లో అప్పుడే పంప‌కాలు... ఆ గిఫ్ట్‌లు ఇవే ?

సచివాలయ ఉద్యోగులకు రేపటి నుంచి రియల్ సినిమా

నాడు అన్యాయం చేసిన నేత‌ను గుర్తించిన జ‌గ‌న్‌..!

రుచిగా ఉందని ఒకేసారి ఆ బాటిల్స్ ని తాగేసిన హీరో అర్జున్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>