Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/selfie-007be050-1216-471f-87fa-a2c8bd84cdf9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/selfie-007be050-1216-471f-87fa-a2c8bd84cdf9-415x250-IndiaHerald.jpgనేటి రోజుల్లో మొత్తం స్మార్ట్ఫోన్ యుగం నడుస్తోంది.. కాదు కాదు సెల్ఫీ యుగం నడుస్తుంది.. ఒకప్పుడైతే ఎవరి దగ్గర మంచి కెమెరా క్వాలిటీ ఉన్న స్మార్ట్ఫోన్లు ఉండేవి కాదు.. ఇక అప్పట్లో ఫోటోలు అంటే కేవలం పెద్దపెద్ద కెమెరాలలో మాత్రమే ఉండేవి.. ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరి చేతిలో అద్భుతమైన ఫీచర్లతో కూడిన స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే నేటి రోజులలో జనాలు సెల్ఫీ లకు అలవాటు పడిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా ఇక ఆ క్షణాలని సెల్ఫీలో బంధించాలి అని ఇష్టపడుతున్నారు. అయితే నేటి జనరేషన్ లో జనాల్లోSelfie {#}Uttar Pradeshసెల్ఫీ తీసుకో బోతే.. ఎంత అనర్థం జరిగిపోయింది?సెల్ఫీ తీసుకో బోతే.. ఎంత అనర్థం జరిగిపోయింది?Selfie {#}Uttar PradeshSun, 18 Jul 2021 10:30:00 GMTనేటి రోజుల్లో మొత్తం స్మార్ట్ఫోన్ యుగం నడుస్తోంది..  కాదు కాదు  సెల్ఫీ యుగం నడుస్తుంది..   ఒకప్పుడైతే ఎవరి దగ్గర మంచి కెమెరా క్వాలిటీ ఉన్న స్మార్ట్ఫోన్లు ఉండేవి కాదు.. ఇక అప్పట్లో ఫోటోలు అంటే కేవలం పెద్దపెద్ద కెమెరాలలో మాత్రమే ఉండేవి.. ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరి చేతిలో అద్భుతమైన ఫీచర్లతో కూడిన స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే నేటి రోజులలో జనాలు సెల్ఫీ లకు అలవాటు పడిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా ఇక ఆ క్షణాలని సెల్ఫీలో బంధించాలి అని ఇష్టపడుతున్నారు.  అయితే నేటి జనరేషన్ లో జనాల్లో సెల్ఫీ పిచ్చి రోజురోజుకు పెరిగిపోతోంది.



 దీంతో సెల్ఫీ పిచ్చి ద్వారా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.  సెల్ఫీ తీసుకోవాలని పిచ్చి లో ఎంతోమంది ప్రమాదాలను కూడా లెక్క చేయడం లేదు. ఈ క్రమంలోనే ప్రమాదకర ప్రదేశాలకు వెళ్లి సెల్ఫీ తీసుకోవాలి అని భావించి చివరికి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా సెల్ఫీ పిచ్చి కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఇక ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నారు. ఇలా సెల్ఫీల కారణంగా ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తున్నప్పటికీ ఎవరిలో కూడా కనీసం జాగ్రత్త తీసుకోవాలి అని అవగాహన మాత్రం రావడం లేదు.



 ఇక్కడ సెల్ఫీ పిచ్చి ఏకంగా ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది.  సెల్ఫీ తీసుకోవాలనే ఆత్రుత సంతోషంగా సాగిపోతున్న జీవితాన్ని చావుకు దగ్గరగా చేసింది. ఉత్తర ప్రదేశ్ లో ఇటీవలే ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పడవలో కొంతమంది అమ్మాయిలు ప్రయాణిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే వారి మనసులో ఒక ఆలోచన మెదిలింది. ఈ మధురమైన క్షణాన్ని సెల్ఫీ లో బంధిస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా జేబులో ఉన్న సెల్ఫోన్ తీసి సెల్ఫీ కి ఫోజులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే అందరూ ఒక వైపుగా వచ్చారు. దీంతో పడవ కాస్త బోల్తా పడిపోయింది. దీంతో పడవలో ఉన్న ఏడుగురు నీటిలో మునిగిపోయారు. ఇక నలుగురు ప్రాణాలతో బయట పడగా ముగ్గురు చివరికి ప్రాణాలు కోల్పోయారు.





సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>