MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/maheshf7f7897a-32f8-493a-bdce-c2b5bea7e2fc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/maheshf7f7897a-32f8-493a-bdce-c2b5bea7e2fc-415x250-IndiaHerald.jpg పవన్ కళ్యాణ్ 50 సంవత్సరాల వయసులోకి రాబోతూ ఉండటంతో అతడి అభిమానులు సెప్టెంబర్ 2న జరగవలసిన అతడి పుట్టినరోజు వేడుకలను 50 రోజులు ముందుగానే మొదలుపెట్టి రకరకాల హ్యాష్ ట్యాగ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఈవిషయాన్ని గ్రహించిన మహేష్ అభిమానులు తాము కూడ ఈ విషయంలో తక్కువేమి కాదు అన్న విషయాన్ని తెలియచేయడానికి ఆగష్టు 9న రాబోతున్న మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలను చాల ముందుగానే జరుపుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారుతెలుస్తున్న సమాచారం మేరకు జూలై 30 నుండి ఈ హంగామా మొదలై మహేష్ పుట్టినరోజు వMAHESH{#}rachana;mahesh babu;kalyan;Rajani kanth;August;Pooja Hegde;media;News;Heroine;trivikram srinivas;king;King;september;Cinemaప్రారంభం కాబోతున్న మహేష్ అభిమానుల కౌండౌన్ !ప్రారంభం కాబోతున్న మహేష్ అభిమానుల కౌండౌన్ !MAHESH{#}rachana;mahesh babu;kalyan;Rajani kanth;August;Pooja Hegde;media;News;Heroine;trivikram srinivas;king;King;september;CinemaSun, 18 Jul 2021 09:00:00 GMT
పవన్ కళ్యాణ్ 50 సంవత్సరాల వయసులోకి రాబోతూ ఉండటంతో అతడి అభిమానులు సెప్టెంబర్ 2న జరగవలసిన అతడి పుట్టినరోజు వేడుకలను 50 రోజులు ముందుగానే మొదలుపెట్టి రకరకాల హ్యాష్ ట్యాగ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఈవిషయాన్ని గ్రహించిన మహేష్ అభిమానులు తాము కూడ ఈ విషయంలో తక్కువేమి కాదు అన్న విషయాన్ని తెలియచేయడానికి ఆగష్టు 9న రాబోతున్న మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలను చాల ముందుగానే జరుపుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారు.


తెలుస్తున్న సమాచారం మేరకు జూలై 30 నుండి ఈ హంగామా మొదలై మహేష్ పుట్టినరోజు వరకు కొనసాగుతుందని అంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ పుట్టినరోజునాడు విడుదలయ్యే ‘సర్కారువారి పాట’ మూవీ టీజర్ కు దేశవ్యాప్తంగా సోషల్ మీడియా రికార్డులు బద్దలుకొట్టేలా ఒక హ్యాష్ ట్యాగ్ ను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పెను సంచలనాలు నమోదు చేయాలని ఇప్పటి నుండే మహేష్ అభిమానులు వ్యూహ రచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  


మహేష్ పుట్టినరోజునాడు త్రివిక్రమ్ మహేష్ ల కాంబినేషన్ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగి ఆరోజు అధికారికంగా ఆమూవీ లాంచింగ్ ను ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈమూవీ కథ రీత్యా చాల భాగం యునైటెడ్ కింగ్ డమ్ లో తీస్తారని ఈమూవీకి సంబంధించిన ఒక పెద్ద షెడ్యూల్ అక్కడ జరుగుతుందని అంటున్నారు.


‘అల వైకుంఠపురంలో’ మూవీ తరువాత త్రివిక్రమ్ తీయబోతున్న మూవీ కావడంతో ఈ మూవీ పై చాల భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ‘అతడు’ ‘ఖలేజా’ సినిమాలు రావడంతో మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న మూడవ మూవీగా ఈమూవీ రికార్డ్ క్రియేట్ చేయబోతోంది ఇప్పటికీ ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను ఎంపిక చేయడానికి త్రివిక్రమ్ అన్నివిధాల ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. వచ్చే ఏడాది సమ్మర్ రేస్ కు విడుదల అయ్యేలా ఈమూవీని ప్లాన్ చేస్తున్నారు..





సీఎం జగన్ పై తెలుగు సినిమా ఇండస్ట్రీ విమర్శలు..!

శుభాలేఖ సుధాకర్ ని పిచ్చివాడ‌నుకొని ఆపేసిన గూర్ఖా!

వామ్మో.. రకుల్ ఇలా మారిపోయిందేంటి.. ఫాన్స్ షాక్?

ముంబైలో ఘోర ప్రమాదం.. 11 మంది మృతి

డిగ్రీ, పీజీ కాలేజీలకు టైమ్ టేబుల్ ఫిక్స్..

వాణిశ్రీ మొద‌ట్లో ఆ పేరుతో నటించారంట.. మీకు తెలుసా..!?

ప్రపంచం మెచ్చిన టాలీవుడ్ చిత్రాలు..

ఆర్ ఆర్ ఆర్ ప్రమోషనల్ సాంగ్ లో టాప్ హీరోలు !

ఆ సినిమాలో అయిష్టంగా నటించిన ప్రేమ.. ఎందుకంటే..!?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>