PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/ugc2ce841a4-2d5a-453b-9552-d3dde42ad185-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/ugc2ce841a4-2d5a-453b-9552-d3dde42ad185-415x250-IndiaHerald.jpgతెలుగు రాష్ట్రాల్లో పాఠశాల విద్యకు సంబంధించి ఆన్ లైన్ క్లాసులు మొదలయ్యాయి. టెన్త్ లో ఆల్ పాస్ అనేశారు కాబట్టి, ఇంటర్ అడ్మిషన్లు కూడా జరుగుతున్నాయి. మరి డిగ్రీ, పీజీ విద్యార్థుల సంగతేంటి..? తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా డిగ్రీ, పీజీ కాలేజీల అడ్మిషన్లు, పరీక్షల విషయంలో ఇప్పటి వరకు సందిగ్ధత నెలకొంది. దీనిపై తాజాగా యూజీసీ క్లారిటీ ఇచ్చింది. డిగ్రీ, పీజీ కాలేజీలకు టైమ్ టేబుల్ విడుదల చేసింది యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్. ugc{#}School;Degree;september;Telugu;October;Newsడిగ్రీ, పీజీ కాలేజీలకు టైమ్ టేబుల్ ఫిక్స్..డిగ్రీ, పీజీ కాలేజీలకు టైమ్ టేబుల్ ఫిక్స్..ugc{#}School;Degree;september;Telugu;October;NewsSun, 18 Jul 2021 08:00:00 GMTతెలుగు రాష్ట్రాల్లో పాఠశాల విద్యకు సంబంధించి ఆన్ లైన్ క్లాసులు మొదలయ్యాయి. టెన్త్ లో ఆల్ పాస్ అనేశారు కాబట్టి, ఇంటర్ అడ్మిషన్లు కూడా జరుగుతున్నాయి. మరి డిగ్రీ, పీజీ విద్యార్థుల సంగతేంటి..? తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా డిగ్రీ, పీజీ కాలేజీల అడ్మిషన్లు, పరీక్షల విషయంలో ఇప్పటి వరకు సందిగ్ధత నెలకొంది. దీనిపై తాజాగా యూజీసీ క్లారిటీ ఇచ్చింది. డిగ్రీ, పీజీ కాలేజీలకు టైమ్ టేబుల్ విడుదల చేసింది యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్.

ఆగస్ట్ 31లోగా పరీక్షలు పూర్తి చేయాలి..
ప్రస్తుతం డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం చదివే విద్యార్థులకు అకడమిక్ ఇయర్ పూర్తయినా పరీక్షలు పూర్తి కాలేదు. వీరందరికీ ఆగస్ట్ 31లోగా పరీక్షలు నిర్వహించాలని యూజీసీ సూచించింది. చివరి సెమిస్టర్ పరీక్షలు పూర్తి చేసి ఫైనల్ ఇయర్ విద్యార్థులకు విద్యా సంవత్సరం పూర్తి చేయాలని, సెప్టెంబర్ నుంచి కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించాలని సూచించింది.

అక్టోబర్ 1నుంచి కొత్త విద్యా సంవత్సరం..
దేశవ్యాప్తంగా డిగ్రీ, పీజీ కాలేజీలు, యూనివర్శిటీల్లో అక్టోబర్ 1నుంచి కొత్త విద్యా సంవత్సరం మొదలుపెట్టాలని యూజీసీ సూచించింది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల ఇంటర్ బోర్డ్ లు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేస్తున్నాయి కాబట్టి. వాటి ద్వారా ఎంట్రన్స్ ల నిర్వహణ, ఇంటర్ ఫలితాల ఆధారంగా డిగ్రీ ప్రవేశాలు జరపాలని సూచించింది. అక్టోబర్ 1న వీలుకాకపోతే, కనీసం అక్టోబర్ 18నుంచయినా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభించాలని సూచించింది యూజీసీ.

ఆఫ్ లైన్, ఆన్ లైన్.. ఏది బెటర్..?
డిగ్రీ, పీజీ కాలేజీల్లో ఆఫ్ లైన్, ఆన్ లైన్ లేదా మిశ్రమ పద్ధతిలో బోధనకు ఆయా యూనివర్శిటీలే నిర్ణయం తీసుకోవచ్చని చెప్పింది యూజీసీ. థర్డ్ వేవ్ ముప్పు గురించి ముందే సమాచారం ఉంది కాబట్టి, దానికి తగ్గట్టు విద్యా సంవత్సరానికి ప్రణాళిక రచించాలని చెప్పింది. ఆఫ్ లైన్ లో సాధ్యపడకపోతే, ఆన్ లైన్ బోధన కొనసాగించాలని, వచ్చే ఏడాది జులై లోగా కొత్త విద్యా సంవత్సరాన్ని ముగించాలని సూచించింది. యూజీసీ తాజా మార్గదర్శకాలతో డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఓ క్లారిటీ వచ్చింది.



ముంబైలో ఘోర ప్రమాదం.. 11 మంది మృతి

ప్రపంచం మెచ్చిన టాలీవుడ్ చిత్రాలు..

ఆర్ ఆర్ ఆర్ ప్రమోషనల్ సాంగ్ లో టాప్ హీరోలు !

స్మరణ : సీనియర్ నటి అశ్విని ఎలా మరణించింది..?

ఆచార్య సినిమా నుండి ఇంట్రెస్టింగ్ అప్ డేట్..!!

JULY:18 చరిత్రలో ఈనాడు జరిగిన ముఖ్య సంఘటనలు ఇవే...

అక్కడ టీడీపీని నిలబెట్టాల్సింది పవనేనా...?

పుష్ప లో అదిరిపోయే ట్విస్ట్ అదేనా .. ??

దుబాయిలో 7 కోట్ల లాటరీ గెలుచుకున్న భారతీయుడు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>