PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/yediyurappaafa5e5bc-5727-46d6-94ae-32b81d37e88b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/yediyurappaafa5e5bc-5727-46d6-94ae-32b81d37e88b-415x250-IndiaHerald.jpgకర్ణాటక కథకు ఢిల్లీలో శుభం కార్డు పడింది. ముుఖ్యమంత్రి పదవికి బీఎస్ యడియూరప్ప రాజీనామా చేస్తారంటూ హస్తిన వీధుల్లో జోరుగా సాగిన రచ్చకు... యడ్డీనే స్వయంగా ఫుల్ స్టాప్ పెట్టారు. తన పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదంటూ యడియూరప్పే క్లారిటీ ఇచ్చేశారు కూడా. ప్రధాని నరేంద్ర మోదీతో సహా పార్టీ పెద్దలతో రెండు రోజుల పాటు వరుసగా భేటీ అయిన యడ్డీ... అసలు రాజీనామా అనే మాట రాలేదని... ఇవన్నీ మీరే పుట్టించిన పుకార్లు కాదా అని మీడియాపై రివర్స్ కౌంటర్లు వేశారు కూడా. yediyurappa{#}Assembly;Prime Minister;CM;రాజీనామా;Bharatiya Janata Party;Minister;media;Party;central governmentనేనా.. రాజీనామానా... నో నాట్ ఎట్ ఆల్‌..నేనా.. రాజీనామానా... నో నాట్ ఎట్ ఆల్‌..yediyurappa{#}Assembly;Prime Minister;CM;రాజీనామా;Bharatiya Janata Party;Minister;media;Party;central governmentSun, 18 Jul 2021 06:44:00 GMTకర్ణాటక కథకు ఢిల్లీలో శుభం కార్డు పడింది. ముుఖ్యమంత్రి పదవికి బీఎస్ యడియూరప్ప రాజీనామా చేస్తారంటూ హస్తిన వీధుల్లో జోరుగా సాగిన రచ్చకు... యడ్డీనే స్వయంగా ఫుల్ స్టాప్ పెట్టారు. తన పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదంటూ యడియూరప్పే క్లారిటీ ఇచ్చేశారు కూడా. ప్రధాని నరేంద్ర మోదీతో సహా పార్టీ పెద్దలతో రెండు రోజుల పాటు వరుసగా భేటీ అయిన యడ్డీ... అసలు రాజీనామా అనే మాట రాలేదని... ఇవన్నీ మీరే పుట్టించిన పుకార్లు కాదా అని మీడియాపై రివర్స్ కౌంటర్లు వేశారు కూడా.

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు బీఎస్ యడియూరప్ప. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో జరిగిన భేటీల్లో రాష్ట్రంలో నాయకత్వ మార్పిడి అంశమే చర్చకు రాలేదన్నారు యడియూరప్ప. నేనేదో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన సమస్యలపై చర్చించడానికి మాత్రమే వస్తే మీరెందుకు ఇలా పుకార్లు పుట్టించారని మీడియా ప్రతినిధులను ఎదురు ప్రశ్నించారు. రాజీనామా చేస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు.. నో నాట్ ఎట్ ఆల్.. అని ఒక్కముక్కలో తేల్చేశారు. ప్రధాని మోదీతో రాష్ట్రంలో పరిస్థితులు, వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు గురించి చర్చించినట్లు ఆయన చెప్పారు.

కర్ణాటకలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు యడియూరప్ప. వచ్చే ఆగస్టు మొదటి వారంలో మరో సారి ఢిల్లీకి వస్తానని చెప్పారు. తను రాజీనామా చేయనున్నట్లు వచ్చిన వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం సార్...  సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరిగిందన్నారు. ఢిల్లీకి వచ్చి పార్టీ పెద్దలతో భేటీ అయినంత మాత్రానా రాజీనామా చేస్తున్నట్లు కాదన్నారు. పార్టీ ముఖ్యనేతలను కలవడం కూడా తప్పేనా అని అసహనం వ్యక్తం చేశారు. అసలు రాజీనామా అనే పరిస్థితే రాలేదన్నారు. వచ్చే ఎన్నికల వరకు కర్ణాటక సీఎంగా కొనసాగుతాననీ, రాష్ట్రంలో తమ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం తథ్యమన్నారు. తమిళనాడుతో తలెత్తిన జలవివాదంపైనా ప్రధానితో చర్చించినట్లు యడ్డి తెలిపారు. ఇదే విషయంపై కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా భేటీ అయి చర్చించానన్నారు.



బెంగాల్ బీజేపీలో గుబులు..!

డ్రోన్ ఎగరాలంటే.. షా క్లారిటీ

టీడీపీలో నామినేటెడ్ పోస్ట్ ల కలకలం..

ఆల్ పార్టీ మీటింగ్ అజెండా ఇదేనా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: అప్పలనాయుడు ఆధిక్యం తగ్గిందా?

ఆ మూడు జిల్లాల్లో ‘ముగ్గురు’ ఔట్?

అక్కడ టీడీపీని నిలబెట్టాల్సింది పవనేనా...?

జగన్ ఆ ‘ఆరు’ ఫిక్స్ చేస్తారా?

రేవంత్ ఎఫెక్ట్: బాబు భయపడుతున్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>