MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmik-mandana7735f3bf-803a-4b25-a899-cec657c3b57e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmik-mandana7735f3bf-803a-4b25-a899-cec657c3b57e-415x250-IndiaHerald.jpgనేషనల్ క్రష్ రష్మిక మందన 'చలో' సినిమా తో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో వరుస ఆఫర్లను చేజిక్కించుకొని తెలుగు స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది. ఈ ముద్దుగుమ్మ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటుంది. రష్మిక మందన ఒక డైరీ రాసుకుంటుంది. డైరీ అంటే పర్సనల్ గా చదువుకునేది కాదు సోషల్ మీడియా ద్వారా ఈ ముద్దుగుమ్మ చేసే డైలీ ఆక్టివిటీస్, పూర్తిగా వివరించే ఒక చిన్న వీడియో. అందులో భాగంగా జులై ఒకటవ తారీకు నా డైరీ అంటూ ఒక వీడియోను కూRashmik mandana{#}Instagram;Evening;Heroine;Telugu;Crush;rashmika mandanna;media;Cinemaరష్మిక డైరీలో పుష్ప పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!రష్మిక డైరీలో పుష్ప పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!Rashmik mandana{#}Instagram;Evening;Heroine;Telugu;Crush;rashmika mandanna;media;CinemaSun, 18 Jul 2021 11:44:00 GMTనేషనల్ క్రష్ రష్మిక మందన 'చలో' సినిమా తో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో వరుస ఆఫర్లను చేజిక్కించుకొని తెలుగు స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది. ఈ ముద్దుగుమ్మ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటుంది. రష్మిక మందన ఒక డైరీ రాసుకుంటుంది. డైరీ అంటే పర్సనల్ గా చదువుకునేది కాదు సోషల్ మీడియా ద్వారా ఈ ముద్దుగుమ్మ చేసే డైలీ ఆక్టివిటీస్, పూర్తిగా వివరించే ఒక చిన్న వీడియో.

అందులో భాగంగా జులై ఒకటవ తారీకు నా డైరీ అంటూ ఒక వీడియోను కూడా పోస్ట్ చేసింది. ఈ ముద్దుగుమ్మ ప్రారంభించిన ఈ డైరీ కి మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. తాజాగా ఇప్పుడు డైరీలో నిన్న జరిగిన కొన్ని విషయాల గురించి హీరోయిన్ ఇలా చెప్పుకొచ్చింది. ఈ డైరీ లో ఎక్కువ శాతం ఈ ముద్దుగుమ్మ తాజాగా నటిస్తున్న 'పుష్ప' సినిమా గురించే చెప్పింది. డియర్ డైరీ నిన్ను చాలా రోజులు మిస్సయ్యాను. ఈ రోజు 'జూలై 17' షూటింగ్ ఉండడం వల్ల ఉదయాన్నే లేచాను.ఎందుకంటే అనుకున్న సమయానికి షూటింగ్ స్పాట్ కు వెళ్లాలి కాబట్టి. పుష్ప సినిమా షూటింగ్ చాలా బాగా జరుగుతుంది.

మా సినిమా యూనిట్ అంతా ఇవాళ జరిగే సన్నివేశం కోసం రిహార్సల్స్ చేశాం. పెద్ద సీక్వెన్స్ ని చాలా ఆనందంగా పూర్తి చేశాం.  సినిమా గురించి కాబట్టి ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. కానీ అది నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. సాయంత్రం 6 గంటలకు షూటింగ్ పేకప్  చెప్పేసాము. ఎంతో అలసిపోయినా కూడా జిమ్ కి వెళ్లాను, కాసేపు వర్కౌట్స్ కూడా చేశాను. జిమ్ లో ఒకరి బర్త్ డే అవ్వడం వల్ల కేక్ చెప్పించి కట్ చేయించాము. కేకు ను అందరూ తిన్నారు .నేను మాత్రం తినలేదు. ఆ తర్వాత ఇంటికి వచ్చి పెట్స్ తో కాసేపు ఆడుకున్నాను. నా ఫ్రెండ్స్ తో సరదాగా కాసేపు గడిపి ఇక చివరగా పడుకున్నాను. ఇలా రోజంతా గడిచింది అంటూ రష్మిక మందన తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో లో చెప్పుకొచ్చింది.



విజయ్ దేవరకొండ, సుకుమార్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ?

మెగా హీరో సినిమాలో ఇలియానా ?

అయ్యప్పనుం రీమేక్ లో విబేధాలు.. ఆయనపై వేటు తప్పదా!!

వెంకటేష్ - సౌందర్య జంటగా వచ్చిన సినిమాలు..

సౌందర్య గురించి మీకు తెలియని నిజాలు..!

నిండు కుండల్లా ఏపీ తెలంగాణ ప్రాజెక్ట్ లు.. !

మొదటి రోజు షూటింగ్ కి వచ్చి ఏడ్చేసిన సౌందర్య

బాలయ్యకి కౌంటర్ ఇచ్చిన నాగబాబు..!!

బాలయ్య సినిమాకు 30 ఏళ్ళు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>