PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ysrcp-support-rally-on-theree-capitals-in-vijayawada13364e2c-f3eb-460c-8320-4c59935a89cf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ysrcp-support-rally-on-theree-capitals-in-vijayawada13364e2c-f3eb-460c-8320-4c59935a89cf-415x250-IndiaHerald.jpgఏదో జగన్ ఇమేజ్, సంక్షేమ పథకాల వల్ల బండి లాగిస్తున్నారు గానీ, లేదంటే వారి సీన్ ఎప్పుడో అయిపోయేదని అంటున్నారు. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు పుంజుకున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా విజయనగరం ఎంపీ విషయంలో వైసీపీకి గట్టి షాక్ తగిలేలా ఉంది. ఎంపీ చంద్రశేఖర్ వల్ల జిల్లాకు పావలా కూడా ఉపయోగం లేదని అక్కడి ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పటికే ఇక్కడ అశోక్ గజపతి రాజుకు లీడింగ్ వచ్చిందని తెలుస్తోంది. అటు విజయనగరం అసెంబ్లీ స్థానంలో వైసీపీ ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి వీక్ అవ్వడం, అతిథి గజపతి YSRCP TDP{#}king;MLA;Fort;Elections;TDP;ashok;Vijayanagaram;Vizianagaram;Jagan;YCP;MPవైసీపీ క్లీన్‌స్వీప్ చేసిన జిల్లాలో టీడీపీకి లీడింగ్...!వైసీపీ క్లీన్‌స్వీప్ చేసిన జిల్లాలో టీడీపీకి లీడింగ్...!YSRCP TDP{#}king;MLA;Fort;Elections;TDP;ashok;Vijayanagaram;Vizianagaram;Jagan;YCP;MPSun, 18 Jul 2021 17:14:08 GMTగత ఎన్నికల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసిన జిల్లాల్లో విజయనగరం కూడా ఒకటి. జిల్లాలో ఉన్న 9 సీట్లని వైసీపీనే గెలుచుకుంది. అలాగే ఉన్న ఒక్క ఎంపీ సీటు వైసీపీ ఖాతాలోనే పడింది. అయితే ఎన్నికలు ముగిసి రెండేళ్ళు దాటేసింది. ఈ రెండేళ్లలో జిల్లాలో వైసీపీ మీద వ్యతిరేకిత పెరిగినట్లే కనిపిస్తోంది. జిల్లాలో మెజారిటీ వైసీపీ ఎమ్మెల్యేలు మెరుగైన పనితీరు కనబర్చడంలో పూర్తిగా వెనుకబడి ఉన్నారని తెలుస్తోంది.

ఏదో జగన్ ఇమేజ్, సంక్షేమ పథకాల వల్ల బండి లాగిస్తున్నారు గానీ, లేదంటే వారి సీన్ ఎప్పుడో అయిపోయేదని అంటున్నారు. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు పుంజుకున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా విజయనగరం ఎంపీ విషయంలో వైసీపీకి గట్టి షాక్ తగిలేలా ఉంది. ఎంపీ చంద్రశేఖర్ వల్ల జిల్లాకు పావలా కూడా ఉపయోగం లేదని అక్కడి ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పటికే ఇక్కడ అశోక్ గజపతి రాజుకు లీడింగ్ వచ్చిందని తెలుస్తోంది.

అటు విజయనగరం అసెంబ్లీ స్థానంలో వైసీపీ ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి వీక్ అవ్వడం, అతిథి గజపతి రాజు పుంజుకోవడంతో టీడీపీకి ప్లస్ అవుతుంది. అలాగే బొబ్బిలిలో వైసీపీ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడుపై తీవ్ర వ్యతిరేకిత వచ్చింది. అదే సమయంలో టీడీపీ నేత బేబీ నాయన పికప్ అయ్యారు. అలాగే శృంగవరపుకోటలో టీడీపీకి లీడింగ్ వచ్చినట్లు కనిపిస్తోంది. బొబ్బిలిలో గ‌త మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో కూడా టీడీపీ గెలుపు అంచుల వ‌ర‌కు వ‌చ్చింది.

ఇక ఎస్ కోట ముందు నుంచి టీడీపీకి లీడ్ ఉన్న నియోజ‌క‌వ‌ర్గం. ఇక్క‌డ ఎమ్మెల్యే నాన్ లోక‌ల్ కావ‌డం కూడా టీడీపీకి ప్ల‌స్ అవుతోంది. కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాల్లో కాస్త టీడీపీకి పట్టు చిక్కినట్లే కనిపిస్తోంది. ఇక నెల్లిమర్ల, చీపురుపల్లి, సాలూరు, గజపతినగరం స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు స్ట్రాంగ్‌గా ఉన్నారు. దీంతో ఈ నాలుగుచోట్ల టీడీపీ ఇంకా పుంజుకోలేదని చెప్పొచ్చు. మొత్తానికైతే జిల్లాలో టీడీపీ కాస్త లీడ్‌లోకి వచ్చింది.  



ఈ ఒక్క ప‌నితో జ‌గ‌న్ క్రెడిబిలిటీ పెరిగిందా ?

హుజురాబాద్‌ బరి నుంచి తప్పుకోనున్న ఈటల ?

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో టీడీపీ పుంజుకుంటోందా ?

సొమ్ము ఒకడిది.. సోకు ఒకడిది... ఆదే ఏపీ స్పెషల్

బిజెపి ని టార్గెట్ చేసిన విజయసాయి...?

అమిత్ షా... ప్లీజ్ ఇది కూడా మీరే అంటూ రఘురామ లేఖ

రేవంత్ భూమి ఎకరం వంద కోట్లా...?

మేము సిద్ధం, ఆయన సిద్ధమా?

గుర్తు పెట్టుకో జ‌గ‌న్...2024లో మ‌ళ్లీ క‌ట్టి తీరుతాం...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>