PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp2f0ddd4f-b9c1-4170-bbae-4a02eef5b816-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp2f0ddd4f-b9c1-4170-bbae-4a02eef5b816-415x250-IndiaHerald.jpgఏపీలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు, ప్రతిరోజూ ఏదొక అంశంపై జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటారనే సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తున్నా కూడా బాబు వెనక్కి తగ్గకుండా విమర్శలు గుప్పిస్తారు. అసలు జగన్‌పై విమర్శలు చేయకుండా బాబుకు నిద్రపట్టదనే చెప్పొచ్చు. అలా జగన్‌పై ఫైర్ అయ్యి చంద్రబాబు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మాత్రం చంద్రబాబు పోరాటం చేయరు. మరి బీజేపీ అంటే భయమో లేక ఎక్కడ ఏ విమర్శ చేస్తే తనకు ఇబ్బంది అవుతుందని అనుకుంటారో తెలియదుగానీ, బtdp{#}Bharatiya Janata Party;Diesel;CBN;central government;revanth;Revanth Reddy;KCR;Narendra Modi;Jaganరేవంత్ ఎఫెక్ట్: బాబు భయపడుతున్నారా?రేవంత్ ఎఫెక్ట్: బాబు భయపడుతున్నారా?tdp{#}Bharatiya Janata Party;Diesel;CBN;central government;revanth;Revanth Reddy;KCR;Narendra Modi;JaganSun, 18 Jul 2021 01:00:00 GMTఏపీలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు, ప్రతిరోజూ ఏదొక అంశంపై జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటారనే సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తున్నా కూడా బాబు వెనక్కి తగ్గకుండా విమర్శలు గుప్పిస్తారు. అసలు జగన్‌పై విమర్శలు చేయకుండా బాబుకు నిద్రపట్టదనే చెప్పొచ్చు. అలా జగన్‌పై ఫైర్ అయ్యి చంద్రబాబు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మాత్రం చంద్రబాబు పోరాటం చేయరు. మరి బీజేపీ అంటే భయమో లేక ఎక్కడ ఏ విమర్శ చేస్తే తనకు ఇబ్బంది అవుతుందని అనుకుంటారో తెలియదుగానీ, బాబు మాత్రం మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేయరు.

గత ఎన్నికల్లో ఓడిపోయాక చంద్రబాబు, బీజేపీకి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. బాబు దగ్గరవ్వాలని చూస్తున్న కూడా బీజేపీ మాత్రం ఆయన్ని దగ్గరకు రానివ్వడం లేదు. అలా బీజేపీకి దగ్గర కావడానికే బాబు, మోదీ ప్రభుత్వంపై ఒక్క విమర్శ కూడా చేయట్లేదు. అటు పక్కనే ఉన్న తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న తన మాజీ శిష్యుడు రేవంత్ రెడ్డి మాత్రం దూకుడుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తున్నారు.

తాజాగా పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని పోరాటం చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్‌లపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విధించిన పన్నులని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. అలా రేవంత్ పోరాటం చేస్తుంటే, ఏపీలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు మాత్రం ఈ అంశంపై ప్రజల్లోకి వచ్చి పోరాటం చేయడానికి భయపడుతున్నట్లు కనిపిస్తోంది.

ఒకవేళ పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుదలపై జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు గానీ, మోదీ ప్రభుత్వాన్ని ఒక్క మాట అనడం లేదు. అయితే డైరక్ట్‌గా దీనిపై ప్రజల్లో పోరాటానికి దిగితే బీజేపీని కూడా టార్గెట్ చేయాల్సి ఉంటుంది. అందుకే బాబు జూమ్ సమావేశాలకే పరిమితవుతున్నారు తప్ప, ప్రజల మధ్యలోకి రావడం లేదు.  



జగన్ ఆ ‘ఆరు’ ఫిక్స్ చేస్తారా?

ఆ మాజీ టీడీపీ నేతలు మళ్ళీ రిటర్న్ వస్తారా?

వాళ్ల ఆటలు సాగవు..!

తీయ్ పో.. తుమ్మల సెట్టు... బాయ్ బాయ్ బండి బ్రో...?

మాన్సాస్ ఈవోకు తీరిక లేదన్న అశోక్

అంటే అన్నాడంటారు గానీ... కెసీఆర్ తపన అర్థం చేసుకోరే మాస్టారూ...?

అంధప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాలు మధ్య జల జగడం తీవ్రంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే రాజకీయ ప్రయోజనాల కోసమే రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కేసీఆర్, జగన్ ప్రభుత్వాలు వివాదాన్ని పెద్దది చేస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో త్వరలో జరిగే హుజూరాబాద్ ఉపఎన్నిక పోరుని దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ జల వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని, అక్కడి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నుంచి ముగ్గురేసి చొప్పున మంత్రులు జగన్ క్యాబినెట్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి జరిగే మంత్రివర్గంలో జరిగే మార్పుల్లో ఈ జిల్లాల నుంచి కనీసం ఒక్కరు చొప్పున క్యాబినెట్ నుంచి బయటకు రావడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో నాలుగైదు నెలల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గంలో మార్పులు చేయనున్నారు.

జగన్ని తిడుతూ... తిడుతూ... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>