PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/phone-tapping-issue-contravercy-14582571-2350-4182-8719-ed5fd0fc0615-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/phone-tapping-issue-contravercy-14582571-2350-4182-8719-ed5fd0fc0615-415x250-IndiaHerald.jpgదేశాన్ని ఓ కుదుపు కుదిపిన వాటిల్లో ఫోన్ ట్యాపింగ్ అంశం ఒకటి. యూపీఏ ప్రభుత్వ హాయంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఫోన్ ట్యాపింగ్ అంశం పార్లమెంట్ ఉభయ సభలను స్తంభింప చేసింది, దీనిపై సీబీఐ విచారణకు ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో... కేంద్రం కూడా సరే అనాల్సి వచ్చింది. మా ఫోన్లు ట్యాప్ చేశారంటూ అప్పట్లో బీజేపీ అగ్రనేతలు గగ్గొలు పెట్టారు. వీరికి కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా వత్తాసు పలికాయి. అదే సమయంలో రాష్ట్రాల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దుమారం రేపింది. Phone Tap{#}Israel;Manmohan Singh;london;CBI;News;INTERNATIONAL;Smart phone;Narendra Modi;Parliment;central government;Prime Minister;media;MP;Bharatiya Janata Partyమరోసారి ఫోన్ ట్యాపింగ్ కలకలంమరోసారి ఫోన్ ట్యాపింగ్ కలకలంPhone Tap{#}Israel;Manmohan Singh;london;CBI;News;INTERNATIONAL;Smart phone;Narendra Modi;Parliment;central government;Prime Minister;media;MP;Bharatiya Janata PartySun, 18 Jul 2021 20:43:07 GMTదేశాన్ని ఓ కుదుపు కుదిపిన వాటిల్లో ఫోన్ ట్యాపింగ్ అంశం ఒకటి. యూపీఏ ప్రభుత్వ హాయంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఫోన్ ట్యాపింగ్ అంశం పార్లమెంట్ ఉభయ సభలను స్తంభింప చేసింది, దీనిపై సీబీఐ విచారణకు ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో... కేంద్రం కూడా సరే అనాల్సి వచ్చింది. మా ఫోన్లు ట్యాప్ చేశారంటూ అప్పట్లో బీజేపీ అగ్రనేతలు గగ్గొలు పెట్టారు. వీరికి కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా వత్తాసు పలికాయి. అదే సమయంలో రాష్ట్రాల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దుమారం రేపింది.
 
తమకు ప్రతికూలంగా ఉన్న ప్రభుత్వాల్లోని ముఖ్యనేతలు, అధికారుల ఫోన్లను ట్యాప్ చేశారనేది ప్రధాన ఆరోపణ. ఇదే అంశంపై పలు రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు కూడా జరిగాయి. ఇప్పుడు ఇదే అంశం మోదీ సర్కార్ మెడకు చుట్టుకునేలా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, రాజకీయ ప్రత్యర్థులు, ప్రతిపక్ష నేతలు, మానవ హక్కుల ఉద్యమాల నేతలు, ప్రజా సంఘాలు, సామాజిక ఉద్యమకారులు, జర్నలిస్టులు, మావోయిస్టు సానుభూతిపరులు, IAS, IPS అధికారులు సహా లక్షలాది మంది ఫోన్లు ట్యాప్ అయ్యాయనేది మోదీ సర్కార్ పై వస్తున్న ఆరోపణ.

అయితే చేసిన దేశంలోని రాజకీయ నేతలో.. లేక ప్రజా సంఘాల నేతలో మాత్రం కాదు. ఈ ఆరోపణ చేసింది అంతర్జాతీయ మీడియా సంస్థలు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని కూడా వార్తలు ప్రసారం చేస్తున్నాయి. ఇక వెస్టన్ మీడియా సంస్థ అయితే.. మరో అడుగు ముందుకు వేసి... మాట్లాడుకున్న కాన్వర్జేషన్ కూడా వినిపిస్తాం అంటోంది. దీనిపై పూర్తిస్థాయి సంచలన రిపోర్ట్ కూడా బయటపెట్టేందకు రెడీ అయ్యింది వెస్టన్ మీడియా. ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుల్లో ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్కు గురయ్యాయో అనేది ఆసక్తికరంగా మారింది. దక్షిణాదిలో కర్ణాటక మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాలు కూడా బీజేపీ వ్యతిరేకంగా ఉన్నవే. కేసీఆర్, జగన్, స్టాలిన్, పినరయ్ విజయన్ ల కదలికలపై కూడా మోదీ సర్కార్ కన్నేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఎంపీ సుబ్రమణియన్ స్వామి ట్విట్ పెట్టారు. వాషింగ్టన్ పోస్ట్, లండన్ గార్డియన్ మీడియా సంస్థలు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, జర్నలిస్టులు, ఆర్ఎస్ఎస్ నేతలు, సుప్రీంకోర్టు జడ్జిల ఫోన్లను ట్యాపింగ్ చేసేందుకు ఇజ్రాయిల్ కు చెందిన పెగసాస్ ను నియమించాయని.. ఆ వివరాలు రాగానే నేను అందరికీ తెలియజేస్తా అంటూ స్వామి పోస్ట్ చేశాడు.



మేమంటే అంత చిన్న‌చూపా?

బిజినెస్ : ఇలా చేస్తే 6 నెలల్లో రూ.2.5 లక్షలు..

మినీ స్టూడియోల కాన్సెప్ట్ తో ప్రముఖ నిర్మాత... ?

హుజూరాబాద్‌లో అప్పుడే పంప‌కాలు... ఆ గిఫ్ట్‌లు ఇవే ?

నాడు అన్యాయం చేసిన నేత‌ను గుర్తించిన జ‌గ‌న్‌..!

గంట ముందే రావాలంటూ మోదీ వార్నింగ్

కేంద్రం తీరు సరిగ్గా లేదన్న విజయసాయిరెడ్డి

కౌంట్ డౌన్ మొదలైంది... ఏపీలో అక్క‌డ ఉప ఎన్నిక త‌ప్ప‌దా ?

హుజురాబాద్‌ బరి నుంచి తప్పుకోనున్న ఈటల ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>