MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manish-malhotra-to-driect-films3157c7d4-d5d1-4f11-ac59-9659f323d01b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manish-malhotra-to-driect-films3157c7d4-d5d1-4f11-ac59-9659f323d01b-415x250-IndiaHerald.jpgసినిమా రంగం అనేది ఎంతో మందికి ఎన్నో విధాలుగా ఉపాధినిస్తోంది. సినిమా పరిశ్రమలో ఒక చిన్న స్థాయి నుండి పెద్ద హీరోలు, డైరెక్టర్లు మరియు నిర్మాతలుగా మారినవారు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ ఒక సినిమాకు కెప్టెన్ డైరెక్టర్. చాలా మందికి లోలోపల డైరెక్టర్ గా అవ్వాలని ఆశ ఉంటుంది. కానీ కొందరికి అది ఆశ గానే మిగిలిపోతుంది. MANISH MALHOTRA TO DRIECT FILMS{#}Karan Johar;manish;Comedian;Manish Pandey;Smart phone;producer;Producer;Fashion;Hero;bollywood;Success;Darsakudu;Director;Cinemaడైరెక్టర్ కానున్న ఫేమస్ ఫ్యాషన్‌ డిజైనర్ ...డైరెక్టర్ కానున్న ఫేమస్ ఫ్యాషన్‌ డిజైనర్ ...MANISH MALHOTRA TO DRIECT FILMS{#}Karan Johar;manish;Comedian;Manish Pandey;Smart phone;producer;Producer;Fashion;Hero;bollywood;Success;Darsakudu;Director;CinemaSat, 17 Jul 2021 15:00:00 GMTసినిమా రంగం అనేది ఎంతో మందికి ఎన్నో విధాలుగా ఉపాధినిస్తోంది. సినిమా పరిశ్రమలో ఒక చిన్న స్థాయి నుండి పెద్ద హీరోలు, డైరెక్టర్లు మరియు నిర్మాతలుగా మారినవారు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ ఒక సినిమాకు కెప్టెన్ డైరెక్టర్. చాలా మందికి లోలోపల డైరెక్టర్ గా అవ్వాలని ఆశ ఉంటుంది. కానీ కొందరికి అది ఆశ గానే మిగిలిపోతుంది. కానీ మరి కొందరు మాత్రం ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొని సాధించి తీరుతారు. ఇప్పటి వరకు ఎంతోమంది అలాగా డైరెక్టర్ లు అయినవారున్నారు. ఒక కమెడియన్ డైరెక్టర్ అయిన సందర్భాలున్నాయి. స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారు కూడా మెగా ఫోన్ పట్టిన కథలున్నాయి. ఇప్పుడు ఇదే దారిలో ఒక ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ డైరెక్టర్ గా మారాలనుకుంటున్నాడు.

అతనెవరో కాదు బాలీవుడ్ ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా. ఇతను స్టార్ హీరో మరియు హీరోయిన్లకు డిజైనర్ గా పని చేశారు. మనీష్ దాదాపు 30 సంవత్సరాల నుండి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇతని కెరీర్ లో నేటికి 800 సినిమాలకు కాస్ట్యూమ్ మరియు స్టైలింగ్ విషయంలో డిజైనర్ గా పనిచేసిన అనుభవం ఉంది. అయితే మనీష్ కు ఎప్పటి నుండో డైరెక్టర్ అవ్వాలని కోరిక ఉండేదట, కానీ దానికి ఒక బ్యాక్ గ్రౌండ్ ఉండాలనే ఉద్దేశ్యంతో ఇలా ఫ్యాషన్ డిజైనర్ గా ఫేమస్ అయ్యాక ట్రై చేస్తున్నాడు. అంతే కాకుండా బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత మరియు దర్శకుడు అయిన కరణ్ జోహార్ కు ఇతను ఫ్రెండ్ కావడం విశేషం.

ఇంకేముంది మనీష్ ఖచ్చితంగా డైరెక్టర్ గా రాణిస్తాడని నెటిజన్లు అనుకుంటున్నారు, ఎందుకంటే బాలీవుడ్ రంగం కరణ్ జోహార్ చేతుల్లో ఉంటుంది కాబట్టి. మొదటి సినిమానే ఒక పీరియాడిక్ డ్రామాను డైరెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన కథ కూడా ఇప్పటికే రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు నిర్మాత కూడా కరణ్ జోహార్ కావడం వలన ఈ వార్త అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి డిజైనింగ్ రంగంలో ఆకట్టుకున్న మనీష్ డైరెక్టర్ గానూ సక్సెస్ కాగలడా ? తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే...
 

 


అరుంధతి మూవీ లో అనుష్క తండ్రి గా చేసింది ఎవరో తెలుసా?

మోక్షజ్ఞ సినిమా కోసం అక్కడ సే ట్టిగ్స్ స్టార్ట్ అయ్యాయా..?

వెంకటేష్ చాలా బాధపడ్డాడు.. ఆ నిర్మాత వల్లే అలా : సురేష్ బాబు

టక్ జగదీష్ : ఆ వార్తలు నమ్మకండి.. !

కాంచన- 4 మూవీలో కాజల్ అగర్వాల్?

బాలయ్య, నాగ్, వెంకీ ల మధ్య పోటీ.. గెలిచిందెవరు.. ?

హీరోల వ‌య‌స్సు అంటే నేనే గుర్తొస్తానారా..? నెటిజ‌న్ పై సిద్ధార్థ్ ఫైర్.. !

'కళ్యాణ్ బాబు' నుంచి 'పవన్ కళ్యాణ్' గా ఎలా మారాడు

పీకల మీదకొచ్చినా మళ్ళీ రిస్క్ చేయబోతున్న నాగబాబు... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>